కష్టపడి చదువుకున్నారు.. జీవితంలో ఒక స్థాయికి రావాలనుకున్నారు, దేశం కాని దేశం వెళ్లారు.. సముద్రాలన్నీ దాటినా.. ఖండాలు దాటినా కొంత మందికి కుల పిచ్చి పోలేదు. మా కులం వాడు.. మా హీరో… మా హీరోనే గొప్ప అంటూ మన దేశం పరువు విదేశాల్లో బజారుకు ఈడుస్తున్నారు. తాజాగా అలాంటి ఘటననే అమెరికా దేశంలోని డల్లాస్ లో చోటు చేసుకుంది.
కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా డల్లాస్ లో ఓ మ్యూజికల్ నైట్ లో పాల్లొన్న టీడీపీ, జనసేన అభిమానులు కొందరు రచ్చకెక్కారు. మ్యూజికల్ నైట్ లో పాల్లొన్న టీడీపీ ఎన్నారై కీలక సభ్యుడు కేసీ చేకూరి మద్యం మత్తులో.. 'జై బాలయ్య' అంటూ అక్కడే ఉన్న పవన్ అభిమానుల మీదకు దూసుకెళ్లాడంతో.. ప్రతిగా పవన్ అభిమానులు 'జై పవన్' అంటూ నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్త పరిస్ధితి చోటు చేసుకుంది.
గతంలో బాలకృష్ణ 'అలగాజనం అంటూ తిట్టినా సిగ్గులేకుండా బాలయ్య కాళ్ళ దగ్గర కొచ్చిన పవన్' అంటూ టీడీపీ సభ్యులు హేళన చేస్తూ, చిరంజీవి, పవన్ పోస్టర్లను చించేయడంతో పవన్ ఫ్యాన్స్ ప్రతిదాడికి పాల్పడబోయారు. పవన్ ఫ్యాన్స్ పై టీడీపీ సభ్యుడు కేసీ చేకూరి పిడిగుద్దులు గుప్పించారు. గొడవ తీవ్రంగా మారడంతో ఈవెంట్ మేనేజర్లు పోలీసులను ఆశ్రయించగా కేసీ చేకూరిని ఆరెస్ట్ చేసి డల్లాస్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాంతో టీడీపీ తానా పెద్దలు.. జనసేన సభ్యులతో రాజీకి యత్నిస్తు.. చేకూరి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు.
ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయలని గట్టిగా ప్రయత్నిస్తున్న టీడీపీ-జనసేన అభిమానులో మాత్రం సానుకూల వైఖరి రావడం లేదు.