బంగ్లాదేశ్ పార్ల‌మెంట్ ర‌ద్దు

బంగ్లాదేశ్ పార్ల‌మెంట్‌ను ఆ దేశ అధ్య‌క్షుడు మ‌హ్మ‌ద్ ష‌హ‌బుద్దీన్ మంగ‌ళ‌వారం ర‌ద్దు చేశారు. బంగ్లాదేశ్‌లో తీవ్ర అల్ల‌క‌ల్లోల ప‌రిస్థితులు నెల‌కున్న సంగ‌తి తెలిసిందే. ఆ దేశ ప్ర‌ధాని షేక్ హ‌సీనా సోమ‌వారం త‌న ప‌ద‌వికి…

బంగ్లాదేశ్ పార్ల‌మెంట్‌ను ఆ దేశ అధ్య‌క్షుడు మ‌హ్మ‌ద్ ష‌హ‌బుద్దీన్ మంగ‌ళ‌వారం ర‌ద్దు చేశారు. బంగ్లాదేశ్‌లో తీవ్ర అల్ల‌క‌ల్లోల ప‌రిస్థితులు నెల‌కున్న సంగ‌తి తెలిసిందే. ఆ దేశ ప్ర‌ధాని షేక్ హ‌సీనా సోమ‌వారం త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి భార‌త్‌కు పారిపోయిన వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

రిజ‌ర్వేష‌న్ల వ్య‌తిరేక ఉద్య‌మం చివ‌రికి ఆ దేశం సైనిక పాల‌న‌లోకి వెళ్లింది. రిజ‌ర్వేష‌న్ల వ్య‌తిరేక ఉద్య‌మం సుమారు 300 మంది ప్రాణాలు తీసింది. ఆరు నెల‌ల క్రితం నూత‌నంగా ఏర్ప‌డిన ప్ర‌భుత్వం ప‌డిపోయేలా చేసింది. హ‌సీనా రాజీనామా చేయ‌డంతో పాటు ఆ దేశంలో ఉండ‌లేని దుస్థితి నెల‌కుంది.

ఈ నేప‌థ్యంలో ఆ దేశ పార్ల‌మెంట్‌ను అధ్య‌క్షుడు ర‌ద్దు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. త్వ‌ర‌లో తాత్కాలిక ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి శ‌ర‌వేగంగా చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు సైన్యాధ్య‌క్షుడు తెలిపారు. కొత్త ప్ర‌భుత్వ సార‌థిగా నోబ‌ల్ బ‌హుమ‌తి గ్ర‌హీత మ‌హ్మ‌ద్ యూన‌స్‌ను నియ‌మించాల‌నే డిమాండ్స్ విద్యార్థుల నుంచి వ‌స్తున్నాయి.

కొత్త ప్ర‌భుత్వం ఏర్నాటు అవుతుంద‌ని, అంద‌రూ శాంతియుత వాతావ‌ర‌ణం నెల‌కొల్పేందుకు స‌హ‌క‌రించాల‌ని ఆ దేశ అధ్య‌క్షుడు కోరారు.

2 Replies to “బంగ్లాదేశ్ పార్ల‌మెంట్ ర‌ద్దు”

  1. అన్నయ్య ఓడిపోయి బతికిపోయాడు, లేకపోతే చెడ్డితో తాడేపల్లి వీధుల్లో పరిగెత్తించి పరిగెట్టించి…….

Comments are closed.