ఈ నిర్మాత ఇక సినిమాలు తీయరా..?

కమెడియన్ గా చాలా సినిమాలు చేశారు. నిర్మాతగా చేసినవి మాత్రం కొన్ని సినిమాలే. అయితే ఇలా అంకెలతో లెక్కకట్టలేని ఇమేజ్ ఆయన సొంతం. స్టేజ్ ఎక్కితే పూనకాలు తెప్పించేలా మాట్లాడ్డం ఆయన నైజం. అతడే…

కమెడియన్ గా చాలా సినిమాలు చేశారు. నిర్మాతగా చేసినవి మాత్రం కొన్ని సినిమాలే. అయితే ఇలా అంకెలతో లెక్కకట్టలేని ఇమేజ్ ఆయన సొంతం. స్టేజ్ ఎక్కితే పూనకాలు తెప్పించేలా మాట్లాడ్డం ఆయన నైజం. అతడే బండ్ల గణేశ్.

తననుతాను పవన్ కల్యాణ్ కు వీరాభిమానిగా చెప్పుకునే బండ్ల గణేశ్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమా తీయమని అతడ్ని సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేసే అభిమానులు చాలామంది. కానీ ఈ నిర్మాత మాత్రం ఎందుకో ముందుకు రావడం లేదు.

తన దేవుడు పవన్ కల్యాణ్ తో సినిమా చేయబోతున్నానంటూ చాన్నాళ్ల కిందటే ప్రకటించారు బండ్ల గణేశ్. ఆ తర్వాత ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. ఒక దశలో ఒకేసారి 2-3 సినిమాలు స్టార్ట్ చేస్తానని, కొత్త టాలెంట్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని కూడా అన్నారు. ఆ సినిమాల సంగతులు కూడా ఆయన వెల్లడించలేదు.

ప్రస్తుతం ఆయన సోషల్ మీడియా ఎకౌంట్ చూస్తే, సినిమాలకు దూరంగా, రాజకీయాలకు దగ్గరగా ఆయన ఆలోచనలు సాగుతున్నట్టు కనిపిస్తున్నాయి. అటు ఆన్ లైన్లో విజ్ఞప్తులు మాత్రం ఆగడం లేదు. అతడు తీసిన గబ్బర్ సింగ్, తీన్ మార్ లాంటి సినిమాల క్లిప్పింగ్స్ ను ట్యాగ్ చేస్తూ.. మరో సినిమా తీయమని అడిగే వాళ్లు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నారు.

బండ్ల గణేశ్ కు సినిమాలంటే ఇష్టం. వివిధ వ్యాపారాల్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ ఆయన మనసులో ఎప్పుడూ సినిమా ఉంటుంది. అందుకే ఎంత బిజీగా ఉన్నప్పటికీ కొన్ని పాత్రల్లో నటించారు, కొన్ని సినిమాలు నిర్మించారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఆలోచనలు ఆ దిశగా సాగుతున్నట్టు అనిపించడం లేదు.

ప్రాక్టికల్ గా చూసుకుంటే ఇప్పటికిప్పుడు పవన్ కల్యాణ్ తో సినిమా కష్టం. కనీసం మరో ప్రాజెక్టునైనా ఆయన పట్టాలపైకి ఎక్కిస్తే బాగుంటుంది. “నిర్మాత బండ్ల గణేశ్” మళ్లీ మనకు ఎప్పుడు కనిపిస్తారో…!

4 Replies to “ఈ నిర్మాత ఇక సినిమాలు తీయరా..?”

Comments are closed.