కాక్ పిట్ లో గర్ల్ ఫ్రెండ్.. ఎయిరిండియాకు జరిమానా

ఓ ఎయిరిండియా పైలెట్, తన గర్ల్ ఫ్రెండ్ ను కాక్ పిట్ లోకి తీసుకెళ్లిన ఘటన గురించి గత నెలలో చెప్పుకున్నాం. ఇప్పుడీ కేసుపై డీజీసీఏ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాదు, తన…

ఓ ఎయిరిండియా పైలెట్, తన గర్ల్ ఫ్రెండ్ ను కాక్ పిట్ లోకి తీసుకెళ్లిన ఘటన గురించి గత నెలలో చెప్పుకున్నాం. ఇప్పుడీ కేసుపై డీజీసీఏ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాదు, తన రూలింగ్ కూడా ఇచ్చింది. గర్ల్ ఫ్రెండ్ ను కాక్ పిట్ లోకి తీసుకెళ్లిన పైలెట్ 3 నెలలు సస్పెండ్ అయ్యాడు. అంతేకాదు, ఇలాంటి సెన్సిటివ్ కేసును త్వరగా పరిష్కరించనందుకు గాను, ఎయిరిండియాకు కూడా 30 లక్షల జరిమానా విధించింది రెగ్యులేటరీ.

ఫిబ్రవరి 27.. దుబాయ్ నుంచి ఢిల్లీ.. ఎయిరిండియా విమానం.. 3 గంటల ప్రయాణం.. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రయాణికుల సీట్లలో కూర్చున్న తన గర్ల్ ఫ్రెండ్ ను పైలెట్, కాక్ పిట్ లోకి ఆహ్వానించాడు. కాక్ పిట్ లోనే ఆమెకు సకల మర్యాదలు చేశాడు. అక్కడే భోజన ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి హుకుం జారీచేశాడు.

సిబ్బంది మినహా ఇతరులు ఇలా కాక్ పిట్ లోకి ప్రవేశించడం నిషేధం. ఎయిరిండియా విమానంలోనే కాదు, ఏ ఎయిర్ లైన్స్ కూడా దీన్ని సమర్థించదు. ప్రయాణికుల భద్రతకు అతిపెద్ద ముప్పుగా దీన్ని భావిస్తుంది. అలాంటి సున్నితమైన అంశాన్ని సదరు పైలెట్ పట్టించుకోలేదు. ఈ వ్యవహారం బయటకొచ్చిన తర్వాత కూడా ఎయిరిండియా వెంటనే చర్యలు తీసుకోలేదని డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది.

మొత్తమ్మీద గర్ల్ ఫ్రెండ్ ను కాక్ పిట్ లోకి తీసుకెళ్లి పైలెట్ ఎంజాయ్ చేస్తే, ఎయిరిండియా 30 లక్షల మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఈమధ్యే ఎయిరిండియా తన లిక్కర్ పాలసీని మార్చింది. ఇప్పుడు సిబ్బందితో పాటు పైలెట్స్ కు అదనపు శిక్షణ ఇవ్వడానికి కార్యాచరణ సిద్ధం చేస్తోంది.