కోల్ కతాలో మరో ఘోరం జరిగింది. తల్లికూతుళ్లు కలిసి మరో మహిళను హత్య చేశారు. ఆమెను ముక్కలుగా కోసి సూట్ కేసులో సర్దిపెట్టారు. ఆ సూట్ కేసును నదిలో పడేయాలనుకున్నారు. సరిగ్గా ఇక్కడే పోలీసులకు దొరికిపోయారు. అదెలాగో చూద్దాం..
ఇద్దరు మహిళలు బరాసత్ కాజిపార నుంచి సీల్దా స్టేషన్ కు రైలులో ప్రయాణించారు. వాళ్ల వద్ద పెద్ద సూట్ కేసు ఉంది. స్టేషన్ లో దిగి టాక్సీ బుక్ చేసుకున్నారు. కుమార్తళి ఘాట్ కు వెళ్లారు. అక్కడ నదిలో సూట్ కేసు పడేయాలని వాళ్ల ప్లాన్.
అయితే తల్లీకూతుళ్లు అనుమానాస్పదంగా కనిపించడం, పెద్ద సూట్ కేసు ఉండడం చూసిన స్థానికులు వాళ్లను ప్రశ్నించారు. ముందు బుకాయించడానికి ప్రయత్నించినప్పటికీ, ఆ తర్వాత అది కుక్క శవమని అబద్ధం చెప్పారు.
అయినప్పటికీ స్థానికులకు నమ్మకం కలగలేదు. సూట్ కేసు ఓపెన్ చేశారు. చూస్తే, అందులో ఓ మహిళకు చెందిన శరీర భాగాలు కనిపించాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. తల్లీకూతుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,