ఈ రీమేక్ వర్కవుట్ అవుతుందా?

అక్షయ్ కుమార్ కచ్చితంగా మంచి నటుడే. కామెడీ పండించడంలో అతడు దిట్ట. ఎన్నో సినిమాలు ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి

ఓ భాషలో హిట్టయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం కామన్. ఇతర భాషల్లో హిట్టయిన సినిమా కోసం ఎదురుచూసే హీరోలున్నారు. ప్రతి ఇండస్ట్రీలో ఇలాంటి హీరోలున్నారు. ఈ క్రమంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రీమేక్ పై కూడా చర్చ మొదలైంది.

ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని దిల్ రాజు భావిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. కుదిరితే అక్షయ్ కుమార్ తో ఈ సినిమాను రీమేక్ చేయాలనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. రీమేక్ ఆలోచన తప్పు కాదు, ఎటొచ్చి ఈ సినిమా రీమేక్ సక్సెస్ అవుతుందా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనేది పూర్తిగా నేటివిటీ సినిమా.

అక్షయ్ కుమార్ కచ్చితంగా మంచి నటుడే. కామెడీ పండించడంలో అతడు దిట్ట. ఎన్నో సినిమాలు ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో కామెడీ పక్కా లోకల్. పైగా వెంకీ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని రాసిన డైలాగ్స్ అవన్నీ. మరి ఇలాంటి సబ్జెక్ట్ హిందీలో క్లిక్ అవుతుందా అనేది డౌట్.

రీమేక్ అంటే సాధారణంగా ఎవరైనా ఉన్నదున్నట్టు తీయడానికే ప్రయత్నిస్తారు. సొంత ప్రయోగాలు చేసి బెడిసికొడితే అదో తలనొప్పి. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను మాత్రం ఉన్నదున్నట్టు రీమేక్ చేస్తే కచ్చితంగా బెడిసికొడుతుందనే చర్చ మొదలైంది. నిజంగా ఈ సినిమాను రీమేక్ చేయాలనుకుంటే దిల్ రాజు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటే మంచిదేమో.

4 Replies to “ఈ రీమేక్ వర్కవుట్ అవుతుందా?”

  1. చంద్రముఖి ని భూల్ భూలయ్య , వర్షం ని భాగీ సిరీస్ లో ఒక సినిమా గ రేమేక్ చేసాక కూడా బాలీవుడ్ as it is గ తీసేస్తారు అని ఎలా అనుకున్నారు సామీ….

Comments are closed.