కుంకీ ఏనుగులు ఏవి పవన్ జీ?

ఇప్పటికైనా కర్ణాటక ప్రభుత్వం నుంచి కుంకీ ఏనుగులను తెస్తేనే ఏపీలో ఏనుగుల బెడద తప్పుతుందని అంటున్నారు.

ఇప్పటికి చాలా నెలల క్రితం కుంకీ ఏనుగుల కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక వెళ్లి అక్కడి సంబంధిత మంత్రితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏపీలోని ఏనుగుల గుంపు ఊళ్ళ మీద, పొలాల మీద పడి మనుషుల ప్రాణాలు, పంట నష్టాలు చేస్తోంది అన్నది ప్రధాన సమస్య. ఈ ఏనుగుల మందను తరిమికొట్టే కుంకీ ఏనుగులను తీసుకుని వస్తే, ఏపీలో ఏనుగుల బెడద తగ్గుతుందని అటవీశాఖ మంత్రిగా పవన్ ఈ రకమైన సంచలన నిర్ణయమే తీసుకున్నారు.

ఇది మంచి పరిణామం అని అంతా అనుకున్నారు. అలా కర్ణాటక ప్రభుత్వంతో ఎనిమిది కుంకీ ఏనుగుల కోసం ఏపీ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. కుంకీ ఏనుగులు పోరాటంలో ఎంతో శిక్షణ పొంది ఉంటాయి. ఏనుగుల గుంపు కనుక దాడికి ప్రయత్నిస్తే వాటిని తరిమికొడతాయి.

ఏపీలో ఏనుగుల బెడద ఎక్కువగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంది. ఇక్కడ తాజగా జియ్యమ్మవలస లో ఒక బియ్యం దుకాణంలోకి ఏనుగుల గుంపు ప్రవేశించి బియ్యాన్ని చెల్లా చెదురు చేసి పారేశాయి. ఇలా తరచుగా పొలాల మీద పడుతున్నాయి.

లేటెస్ట్ గా అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడి జరిగి ముగ్గురు భక్తులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కుంకీ ఏనుగుల గురించి అంతా ఆలోచిస్తున్నారు. కుంకీ ఏనుగులు ఎక్కడ అని అడుగుతున్నారు. ప్రజలకు పెద్ద కష్టం, నష్టం తెస్తున్న ఏనుగుల బారి నుంచి కాపాడేందుకు కుంకీ ఏనుగులను తెస్తామని పాలకులు చెప్పి చాలా కాలం అయిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా కర్ణాటక ప్రభుత్వం నుంచి కుంకీ ఏనుగులను తెస్తేనే ఏపీలో ఏనుగుల బెడద తప్పుతుందని అంటున్నారు.

9 Replies to “కుంకీ ఏనుగులు ఏవి పవన్ జీ?”

  1. మందు ని ప్రతీ కామన్ మెన్ కి అందుబాటులోకి తెస్తాం… దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కంటే తక్కువ ధరకే ఉండేట్టు చేస్తాం… ముసలి, ముతక, చిన్నా, చితకా అందరూ చూసే అసెంబ్లీ లో బాబోరు..

    మీరు సూపర్ సర్…

    1. అంతే కదా మధ్య నిషేధం అని నియంత్రణా అని చెప్పేస్తే పోయేదానికి

Comments are closed.