ఓటిటి అమ్మకాల మర్మమేమిటి?

కేవలం క్రెడిబులిటీ కారణంగా ఓటిటి సంస్థలు ఇలా చేస్తున్నాయా? లేక ఇంకేమైనా కారణం వుందా అన్నది క్లారిటీ లేదు.

ఓటిటి అమ్మకాలు అన్నది ఇప్పుడు టాలీవుడ్ లో కీలకం. ఒకప్పుడు శాటిలైట్ అమ్మకాల మాదిరిగా. టాలీవుడ్ లో పెద్ద సినిమాలను మ్యాచ్ చేసి చిన్న సినిమాలు జోడించి శాటిలైట్‌లను అమ్మేసేవారు. అప్పుడు చిన్న సినిమాలు కూడా అమ్ముడుపోయేవి. రేటు వచ్చేది. పెద్ద సినిమాలు తీసే బ్యానర్లు చిన్న సినిమాలు తీస్తే కూడా ఓటిటి సంస్థలు కొంటున్నాయి. ఎందుకంటే ఆ సంస్థతో రిలేషన్ కోసం. అదే ఓ మంచి చిన్న సినిమా ఓ చిన్న బ్యానర్ తీసినా పట్టించుకోవడం లేదు.

రాను రాను టాలీవుడ్ లో ఓటిటి అమ్మకాలు అన్నది కొన్ని సంస్థలకు మంచినీళ్ల ప్రాయంగా వుంది. కథ విని, ప్రాజెక్ట్ అనుకుంటే చాలు ఓటిటి అగ్రిమెంట్, మంచి రేటు చేతిలో పడుతోంది. కొందరు నిర్మాతలకు అది అసాధ్యంగా వుంది. ఒకే హీరోతో, ఒకేమాదిరి కాంబినేషన్ లో సినిమా తీస్తే ఒకరికి ఒక రేటు వస్తోంది. మరొకరికి మరో రేటు వస్తోంది. దీనికి ఓ రూల్ అన్నది లేదు.

విష్వక్ సేన్ తో సితార సంస్థ సినిమా తీస్తే మంచి రేటుకు నాన్ థియేటర్ అమ్ముడుపోయింది. అదే విష్వక్ సేన్ తో లైలా సినిమా తీస్తే కమర్షియల్ సబ్జెక్ట్ అయినా అమ్మడం కష్ఠమయింది.

ప్రియదర్శితో కోర్ట్ అనే చిన్న సినిమా హీరో నాని నిర్మిస్తే 8 కోట్ల మేరకు నాన్ థియేటర్ అమ్మకాలు జరిగిపోయాయి. అదే ప్రియదర్శితో ఇంద్రగంటి లాంటి కాస్త పేరున్న దర్శకుడు సినిమా తీస్తే సింగిల్ రూపాయి అమ్మకాలు జరగలేదు.

రవితేజతో మిగిలిన బ్యానర్లు సినిమాలు స్టార్ట్ చేస్తే ఓటిటి అమ్మకాలు జరిగిపోయాయి. పీపుల్స్ మీడియా అదే రవితేజతో సినిమాలు తీస్తే నాన్ థియేటర్ అమ్మకాలు జరగలేదు.

యువి సంస్థ మెగాస్టార్ తో తీసిన విశ్వంభర, పీపుల్స్ మీడియా సంస్థ ప్రభాస్ తో తీసిన రాజాసాబ్ సినిమాల ఓటిటి బేరాలు తెగడం లేదు. ఇవే సినిమాలు వేరే బ్యానర్లు తీస్తే పరిస్థితి వేరుగా వుండేదనే టాక్ వినిపిస్తోంది.

కేవలం క్రెడిబులిటీ కారణంగా ఓటిటి సంస్థలు ఇలా చేస్తున్నాయా? లేక ఇంకేమైనా కారణం వుందా అన్నది క్లారిటీ లేదు.

6 Replies to “ఓటిటి అమ్మకాల మర్మమేమిటి?”

Comments are closed.