Advertisement

Advertisement


Home > Politics - National

సిద్ధాంతాలు చెబుతున్న కిరాయి మేధావి!

సిద్ధాంతాలు చెబుతున్న కిరాయి మేధావి!

‘‘మిడిల్ ఇన్ కమ్ కేటగిరీలోకి వచ్చే రాష్ట్రాలు మూలధన పెట్టుబడి మౌలిక వసతుల కల్పనను గాలికి వదిలేయకూడదు’’

‘‘ఒక నాయకుడు తనను తాను జనం అందరికీ ప్రొవైడర్ గా భావించడం మొదలు పెట్టాడంటే అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదం’’

‘‘నాయకుడు తాను అందరి అవసరాలు తీర్చేవాడిని అని భావించుకోవడం తప్పు. అయిదుకోట్ల మంది ప్రజల అవసరాలను ఏ ప్రభుత్వం కూడా తీర్చడం సాధ్యం కాదు’’

.. ఈ స్టేట్ మెంట్స్ ను గమనించారా? ఎవరో ప్రపంచదేశాల రాజకీయాలను, సామాజిక స్థితిగతులను, కొన్ని వందల ప్రభుత్వాల ఉత్థాన పతనాలను దగ్గరుండి గమనించిన ఒక పెద్ద మేధావి చెప్పిన వాక్యాల్లాగా కనిపిస్తున్నాయి కదా. కానీ వీటిని చెప్పింది ఒక కిరాయి మేధావి. కిరాయి సొమ్ములకు వ్యూహాలను ఆలోచనలను అమ్ముకునే ప్రశాంత్ కిషోర్ మొన్నమొన్నటిదాకా జగన్ విజయం కోసం పనిచేసి.. ఇప్పుడు ఆయన దారుణంగా ఓడిపోతున్నారని చెబుతున్నారు. కిరాయి బేరం ఇప్పుడు చంద్రబాబుతో కుదిరిందేమోననే సందేహాలు ప్రజల్లో కలిగేలా ఆయన మాట్లాడుతున్నారు.

ప్రశాంత్ కిషోర్ కు ఎన్నికల వ్యూహకర్తగా ఎంతటి పేరైనా ఉండవచ్చు గాక. కానీ, ఆయన వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీలతో కుదుర్చుకున్న ఒప్పందాలలో ఎన్ని సక్సెస్ లు ఉన్నాయో.. అన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. అయితే సక్సెస్ లను మాత్రం సమర్థంగా ప్రచారం చేసుకునే టెక్నిక్స్ పుష్కలంగా తేలిసిన ఈ కిరాయిమేధావి.. ఇప్పుడు జగన్ ఓడిపోతారని చెబుతున్నారు.

జగన్ పార్టీ విజయానికి అవసరమైన వ్యూహరచన కోసం ఇప్పటిదాకా ప్రశాంత్ కిశోర్ బృందాలు పనిచేస్తూనే ఉన్నాయని ఒక వాదన ఉంది. అయితే.. ఇప్పుడు ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఇంటర్వ్యూలో జగన్ ఘోరంగా ఓడిపోతున్నారని అన్నారు. ఆయన ఫలానా ఫలానా తప్పులు చేస్తున్నారంటూ.. ఏవేవో ఏకరవు పెట్టారు. ఇప్పుడు జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గత ఎన్నికల సందర్భంగా పీకే అందించిన వ్యూహాలుగానే అప్పట్లో ప్రచారం జరిగింది.

ఇప్పుడు అలాంటి సంక్షేమ పథకాలను ఆయన ఎద్దేవా చేస్తున్నారు. పేదల కోసం అమలు చేసే సంక్షేమ పథకాలను ఎద్దేవా చేసే సూడో సంపన్నుల భావజాలాన్నే ప్రశాంత్ కిషోర్ కూడా ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం ప్రజల సంపదకు సంరక్షకురాలు మాత్రమే అని.. ఆ డబ్బులు పంచిపెట్టడానికి వారికి ఏం అధికారం ఉన్నదని ఆయన సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు.

ఈ లెక్కన ఈ దేశంలో ప్రతి ప్రభుత్వమూ పేదలకోసం అమలుచేసే ప్రతి పథకాన్నీ తప్పుపట్టాల్సిందే. అందుకే ప్రశాంత్ కిశోర్ తన కిరాయి మేథస్సును ప్రదర్శిస్తూ, చంద్రబాబు బేరం ఒప్పుకుని జగన్ మీద నిందలు వేయడానికి సాహసిస్తున్నారని.. ఆయన కుటిలనీతిని ప్రజలు అర్థం చేసుకుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?