Advertisement

Advertisement


Home > Politics - National

బిజెపికి రాని ఐడియాలు ఇస్తున్న రాహుల్ గాంధీ!

బిజెపికి రాని ఐడియాలు ఇస్తున్న రాహుల్ గాంధీ!

భారతీయ జనతా పార్టీ ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 400పైచిలుకు ఎంపీ సీట్లను సాధించడం ద్వారా.. మోడీ 3.0 ప్రభుత్వాన్ని చాలా ఘనంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అడుగులు వేస్తోంది. గతంలో కూటమిని వదలిపోయిన మిత్రులందరినీ కూడా కలుపుకుంటూ.. పార్టీకి పరిమితమైన బలం ఉన్న రాష్ట్రాల్లో కూడా ఫోకస్ పెంచుతోంది.

ఇలాంటి సమయంలో రాహుల్ గాంధీ బిజెపి వారికి ఒక కొత్త ఐడియా ఇస్తున్నారు. ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా.. భాజపా 400 సీట్ల లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యం అని ఆయన అంటున్నారు. ఇండియా కూటమి ఢిల్లీలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మ్యాచ్ ఫిక్సింగ్ అంటే ఏమిటో తనకు తోచిన నిర్వచనాన్ని కూడా రాహుల్ గాంధీ వివరించారు. ఐపీఎల్ మ్యాచ్ ల సీజను గనుక.. రాహుల్ కు మ్యాచ్ ఫిక్సింగ్ అనే పోలిక స్ఫురించినట్టుగా ఉంది. ‘అంపైర్లపై ఒత్తిడి చేసి, ఆటగాళ్లను కొనుగోలు చేసి, కెప్టెన్లను బెదిరించి మ్యాచ్ లను గెలవవచ్చు.. దీనిని మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు’ అంటూ రాహుల్ చెప్పుకొచ్చారు. బహుశా ఇండియా కూటమిలో భాగమైన ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేయడం గురించి ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా తెలియజెప్పదలచుకున్నారో ఏమో గానీ, మొత్తానికి మ్యాచ్ ఫిక్సింగ్ అంటే.. ప్రత్యర్థి జట్టులోని వారిని ముందే ప్రలోభపెట్టి ఓడించడం మాత్రమే.

భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా ప్రత్యర్థి పార్టీ తరఫున గెలిచిన వారిని ప్రలోభపెట్టి తమలో కలిపేసుకోవడం ద్వారా బలాన్ని విస్తరించుకునే కుయుక్తులను మాత్రమే అనుసరిస్తూ వెళుతోంది. ఎన్నికలకు ముందే ప్రత్యర్థి జట్టు తరఫున బరిలోకి దిగుతున్న వారిని ప్రలోభ పెట్టడం ఇంకా వారికి అలవాటు కాలేదు. ఇప్పుడు రాహుల్ మ్యాచ్ ఫిక్సింగ్ అనే మాట ద్వారా.. వారిని కొత్త అయిడియా ఇచ్చినట్లుగా ఉంది.

లేదా, అసలు ఇండియా కూటమిలో ఉన్న పార్టీల మీద, వాటి సారథుల మీద, ఆ పార్టీల తరఫున బరిలోకి దిగే అభ్యర్థుల మీద రాహుల్ గాంధీకి అనుమానాలు ఉన్నాయా? వారిలో చాలా వరకు బిజెపి వారి ప్రలోభాలకు లోబడిపోతారనే అభిప్రాయం ఆయనకు ఉన్నదా అని కూడా అనిపిస్తోంది. సొంత జట్టు మీదనే అపనమ్మకంతో.. ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీలో ఇలాంటి ప్రసంగం చేయడం అనేది.. బూమరాంగ్ అవుతుందని రాహుల్ కు అనిపించలేదేమో మరి!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?