మీ దగ్గర 190 కోట్లు ఉంటే ఏం చేస్తారు? ఎవరైనా వ్యాపారం చేస్తారు, పెట్టుబడి పెట్టాలంటే భూములు కొంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం అపార్ట్ మెంట్ లో ఓ ఫ్లాట్ కొన్నాడు. అవును.. కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం.
గుర్గావ్ లోని ఓ ఖరీదైన అపార్ట్ మెంట్ లో పెంట్ హౌజ్ 190 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. 16,290 చదరపు అడుగుల ఈ పెంట్ హౌజ్ ను రిషి పార్తీ అనే వ్యక్తి ఇంత భారీ మొత్తానికి కొనుగోలు చేశాడు.
ఈ ప్రాపర్టీ కొనుగోలులో స్టాంప్ డ్యూటీ కింద అతడు 13 కోట్ల రూపాయలు చెల్లించాడు. అంచనాల ప్రకారం, చదరపు అడుగు లక్షా 82 వేల రూపాయలు పడింది. భారతదేశంలో ఒక చదరపు అడుగు ఇంత మొత్తంలో అమ్ముడుపోవడం ఇదే. ఇంతకుముందు ముంబయిలోని కొన్ని వెంచర్లలో చదరపు అడుగు లక్షా 36వేల రూపాయలకు అమ్ముడుపోయింది.
డీఎల్ఎఫ్ కు చెందిన ఓ అల్ట్రా లగ్జరీ వెంచర్ లో ఉంది ఈ పెంట్ హౌజ్. సకల సౌకర్యాలకు నిలయంగా ఈ వెంచర్ రూపొందింది. ఇన్ఫో-ఎక్స్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ అధిపతి రిషి పార్తీ. 24 ఏళ్ల వయసులో 2001లో అతడు ఈ కంపెనీని స్థాపించాడు. ఆ తర్వాత మరో 3 కంపెనీలు కూడా పెట్టి వాటికి డైరక్టర్ గా కొనసాగుతున్నాడు.
గుర్గావ్ లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డు ఇప్పుడు ధనవంతులకు అడ్డాగా మారుతోంది. ఉత్తరాదికి చెందిన బిలియనీర్లు ఈ ప్రాంతంలో లగ్జరీ నివాసాలు కొనేందుకు ఎగబడుతున్నారు. అందుకే రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ కోటీశ్వరుల్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ అపార్ట్ మెంట్లు నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాంతం, న్యూయార్క్ సెంట్రల్ పార్క్ లో ఉన్న బిలియనీర్ల గృహసముదాయాలతో పోెటీ పడతాయని అంచనా వేస్తున్నారు.
bocchu lo 190Cr penthouse, maa vadu aiduvandala kotlu petti beach view palace ye katticgadu reddy
9019471199 vc available
vc ante ?
what is vc ?