మంచు మనోజ్ కు గాయాలు.. వైద్యులు ఏమన్నారంటే?

అయితే ఇవేవీ ప్రమాదకరమైన గాయాలు కావని, అన్నీ స్వల్ప గాయాలేనని, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాయని స్పష్టం చేశారు

మంచు మనోజ్ పై కొంతమంది దాడి చేసి ఉంటారని, అతడిపై భౌతిక దాడి జరిగి ఉండొచ్చనే అనుమానాల్ని వ్యక్తం చేశారు వైద్యులు. పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత డాక్టర్లు ఈ అనుమానాల్ని వ్యక్తం చేశారు.

ఈరోజు కుంటుతూ హాస్పిటల్ కు వచ్చాడు మంచు మనోజ్. పైకి కనిపించని మరికొన్ని దెబ్బలు కూడా ఉన్నాయి. అతడికి సిటీ స్కాన్, ఎక్స్ రే తీశారు డాక్టర్లు. మెడ భాగంలో కండరాలపై స్వల్ప గాయాలైనట్టు నిర్థారించారు. అలాగే కుడికాలు కండరం కూడా పట్టేసిందని తెలిపారు. దీంతో పాటు చేతికి, తలపై చిన్న చిన్న గాయాలున్నాయన్నారు.

అయితే ఇవేవీ ప్రమాదకరమైన గాయాలు కావని, అన్నీ స్వల్ప గాయాలేనని, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాయని స్పష్టం చేశారు. యాక్సిడెంట్ అయితే ఇలాంటి గాయాలు తగలవని, సహజంగా భౌతిక దాడిలోనే ఇలాంటి దెబ్బలు తగులుతాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మంచు మనోజ్, మంచు మోహన్ బాబు గొడవ పడినట్టు వార్తలొచ్చాయి. మోహన్ బాబు, తన అనుచరులతో మంచు మనోజ్ ను కొట్టించినట్టు ఊహాగానాలు చెలరేగాయి. వీటిపై మోహన్ బాబు వర్గీయులు వెంటనే స్పందించారు. ఆధారాల్లేకుండా అసత్య ప్రచారాలు చేయొద్దంటూ ప్రకటించారు. ఆ ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే గాయాలతో మంచు మనోజ్ హాస్పిటల్ లో చేరడం గమనార్హం.

12 Replies to “మంచు మనోజ్ కు గాయాలు.. వైద్యులు ఏమన్నారంటే?”

Comments are closed.