టాక్ ఆఫ్ ద స్టేట్ ఆయనే!

ప్రస్తుతానికి రాష్ట్ర ప్రజల దృష్టి, అన్ని పార్టీల చూపు ఒక్కడిపైనే కేంద్రీకృతమై ఉంది.

ప్రస్తుతానికి రాష్ట్ర ప్రజల దృష్టి, అన్ని పార్టీల చూపు ఒక్కడిపైనే కేంద్రీకృతమై ఉంది. ఆయన ఏం చేయబోతున్నాడు అన్నదాన్ని గురించే ఆలోచిస్తున్నారు. ఆ నాయకుడే గులాబీ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.

ఎందుకు ఆయన మీద దృష్టి పెట్టారంటే …రేపు అంటే సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరవుతాడా? కాడా? అనేదే అందరి ముందున్న ప్రశ్న. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని పట్టుబడుతున్నారు. ప్రభుత్వ పాలనపై అభిప్రాయాలు చెప్పాలని, తప్పులు ఎత్తిచూపాలని కోరుతున్నాడు.

అయినప్పటికీ కేసీఆర్ ఏమీ జవాబు చెప్పడంలేదు. సమావేశాల్లో కేటీఆర్ అండ్ హరీష్ రావు ఊరుకోరు. సర్కారు వైఫల్యాలను చర్చకు పెడతారు. తీవ్ర విమర్శలు చేస్తారు. వీళ్లకు కేసీఆర్ తోడైతే ఆ దృశ్యం మరోలా ఉంటుంది. రుణ మాఫీ, రైతుభరోసా, మూసీ ప్రక్షాళన, హైడ్రా ….మొదలైన అంశాలు ఎన్నో ఉన్నాయి.

ఈ అంశాలపై కేసీఆర్ ఇప్పటివరకు మాట్లాడలేదు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడి ఏడాదైంది. ఇప్పటివరకు కేసీఆర్ అసెంబ్లీలో ప్రభుత్వంతో తలపడలేదు. బడ్జెట్ సమావేశాలప్పుడు ఒక్కరోజే హాజరయ్యాడు. కొన్ని గంటలు మాత్రమే ఉన్నాడు. అదే మొదటిసారి.

ఇప్పుడు అసెంబ్లీకి వస్తే ఓకే. రాకపోతే అదే చివరిసారి అవుతుంది. సమావేశాలు కూడా సుదీర్ఘ కాలం జరగవు. కేవలం వారం రోజులు మాత్రమే. కాబట్టి కేసీఆర్ ఏం నిర్ణయించుకుంటారో చూడాలి.

3 Replies to “టాక్ ఆఫ్ ద స్టేట్ ఆయనే!”

Comments are closed.