మధ్యప్రదేశ్‌లో గిరిజన యువకుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనలో మరో కీలక పరిణామం చేటుచేసుకుంది. తాజాగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బాధితుడు దశమంత్ రావత్‌ను భోపాల్‌లోని తన ఇంటికి పిలించుకుని పాదాలు కడిగి క్షమాపణలు కోరారు.
ఆ ఘటన తనను ఎంతగానో బాధపెట్టిందని.. అందుకు కాళ్లు కడిగి.. క్షమాపణలు చెబుతున్నంటూ అవేదన వ్యక్తం చేశారు. నిందితుడు శుక్లాకి బీజేపీతో సంబంధం ఉందని కాంగ్రెస్ పార్టీ అరోపిస్తున్నా నేపథ్యంలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇప్పటికే నిందితుడు ప్రవేశ్ శుక్లాని అరెస్ట్ చేసిన పోలీసులు జాతీయ భద్రతా చట్టం-ఎన్ఎస్ఏ కింద కేసు బుక్ చేశారు. అతని ఇంటిని బుల్డోజర్‌తో కూల్చేశారు.
మరోవైపు నిందితుడి కుటుంబ సభ్యులు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో గతంలోనిదని.. త్వరలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దీన్ని సోషల్ మీడియాలోకి వదిలారని వారు ఆరోపిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు వీడియో వైరల్ చేశారని వాపోతున్నారు. కాగా వీడియో చూసిన వారు మాత్రం సభ్యసమాజం సిగ్గుపడేలా నీచమైన, హేయమైన చర్యకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని.. గిరిజనులపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.