గూగుల్ లో ఇలా సెర్చ్ చేస్తే జైలుకే..!

ఈ యుగంలో ఏం కావాలన్నా గూగుల్ తల్లిని అడగడం కామన్ అయిపోయింది. ఎంత చిన్న విషయమైనా గూగుల్ సెర్చ్ చేయనిదే నిర్థారణకు రావడం లేదు ఇప్పటి నిజం. దీనికితోడు వాయిస్ సెర్చ్ కూడా అందుబాటులో…

ఈ యుగంలో ఏం కావాలన్నా గూగుల్ తల్లిని అడగడం కామన్ అయిపోయింది. ఎంత చిన్న విషయమైనా గూగుల్ సెర్చ్ చేయనిదే నిర్థారణకు రావడం లేదు ఇప్పటి నిజం. దీనికితోడు వాయిస్ సెర్చ్ కూడా అందుబాటులో ఉండడంతో, గూగుల్ వాడకం పీక్స్ కు చేరుకుంది. అయితే గూగుల్ లో ఏది పడితే అది సెర్చ్ చేయకూడదనే విషయం మీకు తెలుసా?

అవును.. గూగుల్ లో అన్నీ సెర్చ్ చేయడానికి వీల్లేదు. మరీ ముఖ్యంగా కొన్ని సెర్చ్ ల వల్ల మీకు నష్టం కలిగే ప్రమాదం ఉంది. అవసరమైతే పోలీసు కేసులు, ఆ తర్వాత జైలుకు కూడా వెళ్లేంత ఇబ్బందులు గూగుల్ సెర్చ్ తో మీకు కలగొచ్చు. ఇంతకీ గూగుల్ లో ఏం వెదకకూడదో ఇప్పుడు చూద్దాం..

బాంబ్ తయారుచేయడం ఎలా.. గూగుల్ లో ఇలా సెర్చ్ చేశారంటే మీ పనైపోయినట్టే. వెంటనే మీ కంప్యూటర్ ఐపీ ట్రాక్ అయిపోతుంది. మీపై నిఘా మొదలైపోతుంది. దీంతో పాటు ఛైల్డ్ పోర్న్ అనే సెర్చ్ చేసినా ఇబ్బందులు తప్పవు. ఇది చట్టరీత్యా నేరం.

అబార్షన్ కు సంబంధించి గూగుల్ లో వెదికినా ఇబ్బందికరమే. గర్భాన్ని తొలిగించుకోవడం ఎలా? అబార్షన్ టాబ్లెట్స్ లాంటివి సెర్చ్ చేయకూడదు. ఎందుకంటే, ఇవి ప్రాణాపాయం, వైద్యుల సలహా తప్పనిసరి.

వీటితో పాటు పలు నేరాలకు సంబంధించిన పదాలు కూడా గూగుల్ లో సెర్చ్ చేయకూడదు. 'గన్ ఆన్ లైన్', 'బాంబ్ మెటీరియల్', 'బ్లాస్ట్ చేయడం ఎలా', 'సైనైడ్ ఎక్కడ దొరుకుతుంది' లాంటివి గూగుల్ లో సెర్చ్ చేయకూడదు.

వీటన్నింటినీ నేరపూరితమైన సెర్చ్ కీ-వర్డ్స్ గా గూగుల్ నిర్థారించింది. అంతేకాదు.. 2023కు సంబంధించి ఇలాంటి నిషేధిక కీ-వర్డ్స్ లోకి మరిన్ని పదాల్ని చేర్చింది గూగుల్. కాబట్టి ఇకపై గూగుల్ లో ఏదైనా వెదికేముందు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సెర్చ్ కొట్టాలి. ఖాళీగా ఉన్నామని ఏది పడితే అది టైప్ చేస్తే పోలీసులు ఇంటికొస్తారు.