భారత్ జోడో యాత్ర.. రంగంలోనికి సోనియా!

ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని అకాంక్ష‌తో పాద‌యాత్ర చేస్తున్న‌ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ దారిపొడవునా ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగుతున్నారు. సెప్టెంబ‌ర్ 7న క‌న్యాకుమారిలో ప్రాంభ‌మైన భార‌త్ జోడో…

ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని అకాంక్ష‌తో పాద‌యాత్ర చేస్తున్న‌ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ దారిపొడవునా ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగుతున్నారు. సెప్టెంబ‌ర్ 7న క‌న్యాకుమారిలో ప్రాంభ‌మైన భార‌త్ జోడో యాత్ర త‌మిళ‌నాడు, కేర‌ళ‌ను దాటి క‌ర్ణాట‌క‌లో సాగుతోంది.  

వ‌య‌సు భారం, ఆనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా రాహుల్ పాద‌యాత్ర‌లో పాల్లోన్నారు. వచ్చే సంవత్సరం కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌కు ఈ పాదయాత్ర కీలకంగా మారింది. 

సోనియాగాంధీ యాత్రలో పాల్గోనున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ మరింత రెట్టింపయిందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. రేపు భారత్ జోడో యాత్రలో ప్రియాంక గాంధీ వాద్రా కూడా పాల్గోనున్నారు.

ప్రతిరోజూ 25 కి.మీ. మేర రాహుల్ పాద‌యాత్ర చేస్తున్నారు. భారత్ జోడో యాత్ర.. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 150 రోజుల్లో 3,500 కి.మీ మేర 12 రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేయ‌నున్నారు.