ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్‌తో కూల్చివేతలపై సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలు ఇచ్చింది. కూల్చివేతలు వద్దని మాత్రం చెప్పలేదు. చట్టానికి లోబడి కూల్చివేతలు వుండాలని సర్వోన్నత న్యాయస్థానం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించడం గమనార్హం. బీజేపీ నాయకులు నుపుర్‌శర్మ, నవీన్‌కుమార్ జిందాల్ ఇటీవల ఒక మతంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలకు దారి తీశాయి.
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. ఆందోళనకారుల ఇళ్లను కూల్చివేసేందుకు యోగి ప్రభుత్వం బుల్డోజర్లను దింపింది. ఉత్తరప్రదేశ్‌లో ఇళ్ల కూల్చివేతపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల దేశంలోని పలువురు న్యాయకోవిదులు సుప్రీంకోర్టుకు లేఖ రాసారు.
ఉత్తరప్రదేశ్‌లో ఏం జరుగుతున్నదో అర్థం కావడం లేదని, ఇళ్ల కూల్చివేతను సుమోటోగా స్వీకరించి విధ్వంసాన్ని అడ్డుకోవాలని ఆ లేఖలో కోరారు. అలాగే చట్ట విరుద్ధంగా కట్టిన ఇళ్లని చెబుతూ కూల్చివేతకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని జమియత్ ఉలామా-ఇ- హింద్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇవాళ కీలక సూచనలు మరోసారి దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఉత్తరప్రదేశ్‌లో కూల్చివేతలు చట్టానికి లోబడి ఉండాలని, అవి ప్రతీకారం తీర్చుకునేవిగా ఉండకూదని హితవు చెప్పింది. అంతే తప్ప, ఇళ్ల కూల్చివేతలు ఆపాలని మాత్రం ఆదేశాలు ఇవ్వకపోవడం గమనార్హం.
కూల్చివేతపై స్టే ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. చట్టం ప్రకారం వెళ్లమని మాత్రమే చెప్పగలమని దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పడం విశేషం.