బస్టాప్, రైలు పట్టాలు, సెల్ టవర్.. కాదేదీ చోరీకి అనర్హం

మొన్నటికిమొన్న తెలంగాణలో ఓ వ్యక్తి దర్జాగా ఆర్టీసీ బస్సును దొంగిలించాడు. కట్ చేస్తే, ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన బస్టాప్ దొంగతనానికి గురైంది. బస్టాప్ చోరీకి గురవ్వడం ఏంటని ఆశ్చర్యంగా ఉందా? నిజంగానే బస్టాప్…

మొన్నటికిమొన్న తెలంగాణలో ఓ వ్యక్తి దర్జాగా ఆర్టీసీ బస్సును దొంగిలించాడు. కట్ చేస్తే, ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన బస్టాప్ దొంగతనానికి గురైంది. బస్టాప్ చోరీకి గురవ్వడం ఏంటని ఆశ్చర్యంగా ఉందా? నిజంగానే బస్టాప్ ను లేపేశారు.

బెంగళూరులో 10 లక్షల రూపాయల ఖర్చుతో ఓ బస్టాప్ ఏర్పాటుచేశారు. అలా ఏర్పాటుచేసిన వారం రోజులకే ఎవరో ఆ బస్టాప్ ను అక్కడ్నుంచి లేపేశారు. ఏర్పాటుచేసిన వారానికి తరలించడంపై ప్రయాణికులు కాస్త గందరగోళానికి గురయ్యారు. అయితే అది తరలించడం కాదని, తస్కరించడమని తర్వాత తెలుసుకున్నారు.

బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బిఎమ్‌టిసి) బస్ షెల్టర్‌ల నిర్మాణానికి బాధ్యత వహించే ఒక కంపెనీ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ రవిరెడ్డి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము ఆగస్ట్ 21న బస్టాండ్ ఏర్పాటుచేశామని, 28వ తేదీకి అదృశ్యమైందని ఫిర్యాదు చేశాడు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే బస్టాండ్ చోరీకి గురైన నెల రోజుల తర్వాత తాపీగా కంప్లయింట్ ఇవ్వడంపై కూడా ఆరా తీస్తున్నారు.

ఇలాంటి అసాధారణ దొంగతనాలు జరగడం ఇండియాలో కొత్తేం కాదు. బిహార్ లో ఆమధ్య కొంతమంది సెల్ టవర్ కొట్టేశారు. అదే రాష్ట్రంలో రైలింజన్ తో పాటు.. 2 కిలోమీటర్ల పొడవైన రైలు ట్రాక్ ను కూడా కొట్టేశారు.