అతిపెద్ద ప్రకృతి విపత్తుల్లో ఒకటి

పచ్చటి కొండలు, ఎటుచూసినా పచ్చదనం, అడుగడుగునా జలపాతాలు, మంచినీటి సరస్సులు, తల పైకెత్తితే చేతికి అందేంత ఎత్తులో మేఘాలు, ఓవైపు అందమైన గుహలు, మరోవైపు ప్రకృతి సోయగాలు.. ఇలా వయనాడ్ గురించి ఎంత చెప్పినా…

పచ్చటి కొండలు, ఎటుచూసినా పచ్చదనం, అడుగడుగునా జలపాతాలు, మంచినీటి సరస్సులు, తల పైకెత్తితే చేతికి అందేంత ఎత్తులో మేఘాలు, ఓవైపు అందమైన గుహలు, మరోవైపు ప్రకృతి సోయగాలు.. ఇలా వయనాడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడీ ప్రకృతే అక్కడి ప్రజలకు శాపంగా మారింది.

వయనాడ్ లో ప్రకృతి కన్నెర్రజేసింది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. నిజానికి ఇక్కడిలా కొండ చరియలు విరిగిపడ్డం కొత్తేంకాదు. కాకపోతే ఈసారి ప్రమాదకర స్థాయిలో.

మెప్పాడి సమీపంలోని ఉన్నట్టుండి కొండ చరియలు విరిగిపడ్డాయి. పైన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మట్టి దిబ్బలు జనావాసాల్లోకి వచ్చేశాయి. అయితే దాన్ని చాలామంది గుర్తించలేకపోయారు. ఎందుకంటే, అప్పుడు సమయం అర్థరాత్రి ఒంటి గంట.

అక్కడితో విధ్వంసం ఆగలేదు. వేకువజాము 4 గంటల ప్రాంతంలో మరోసారి కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో నష్టం ఊహకు అందనంత. ఇప్పటివరకు 19 మంది మృతి చెందినట్టు, 16 మందికి గాయాలైనట్టు ప్రాధమికంగా తెలుస్తోంది.

కానీ అసలు విపత్తు ఇది కాదు. ఆ ప్రాంతంలో ఉన్న దాదాపు 500 కుటుంబాలపై ఈ ప్రభావం పడింది. ఎవరు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. ఎక్కడ ఇల్లు ఉందో, ఎక్కడ మట్టిదిబ్బలు పడ్డాయో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఊరు మొత్తం రాళ్లు తేలి ఉంది. దీంతో ఇది ఊహకందని పెను విపత్తుగా మారే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇండియాలో అతిపెద్ద ప్రకృతి విపత్తు సునామి. ఇక 2001లో వచ్చిన గుజరాత్ భూకంపం, 1999లో ఒరిస్సాలో వచ్చిన మెరుపు తుఫాను, ఉత్తరాంఖండ్ లో వచ్చిన వరదలు అతిపెద్ద ప్రకృతి విపత్తులుగా నిలిచాయి. వయనాడ్ ఘటన అలాంటి ఓ మహా ఉత్పాతంగా మారుతుందని అంతా భయపడుతున్నారు.

3 Replies to “అతిపెద్ద ప్రకృతి విపత్తుల్లో ఒకటి”

  1. 2004 లో వచ్చిన సునామి

    2019 లో జగన్ రెడ్డి గెలుపు.. టాప్ 2 ప్రకృతి విపత్తు ల లిస్ట్ లో ఉంటాయి..

      1. 2024 జూన్ 4 నుండి జనాలు సంతోషం గానే ఉన్నారు కదా.. మేము చూస్తూనే ఉన్నాము..

        మీకే ఒళ్ళు “మందం” పెరిగి.. చూడాలనుకోవడం లేదు..

Comments are closed.