Advertisement

Advertisement


Home > Politics - National

అతడు నచ్చలేదు.. ఆమెతో వెళ్లిపోయింది

అతడు నచ్చలేదు.. ఆమెతో వెళ్లిపోయింది

పెళ్లికి ముందు ప్రేమ, పెళ్లి తర్వాత మరో ప్రేమ, ఆ ప్రేమ నచ్చక ఇంకో ప్రేమ. ఇటీవల కాలంలో అక్రమ సంబంధాల పరంపర సోషల్ మీడియాలో ఎలా రచ్చకెక్కుతుందో చూస్తూనే ఉన్నాం. భర్త నచ్చక కుటుంబాన్ని కాదనుకొని, మరో మగాడితో వెళ్లిపోతున్న ఆడవాళ్లు చాలామందే ఉన్నారు. అలాంటి ఆడవాళ్లను చితగ్గొట్టే మగాళ్లు, ముక్కలు ముక్కలుగా నరికేసే మృగాళ్ల గురించీ మనకు తెలుసు. అయితే ఇక్కడో మహిళ మగాడి ప్రేమ నచ్చక, మరో మహిళతో వెళ్లిపోయింది. అదే ఈ కథలో వెరైటీ.

పెళ్లయిన తర్వాత భార్య ఎక్కువ రోజులు కాపురం చేయకుండా ప్రియుడితో వెళ్లిపోతే ఆ భర్త పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతకంటే ఘోరం పశ్చిమబెంగాల్ ఆలిపూర్ ద్వార జిల్లాలోని ఆ భర్త వ్యథ. అతడి భార్య కూడా నెల రోజుల తర్వాత కనిపించకుండా పోయింది. కానీ ఆమె వెళ్లిపోయింది ప్రియుడితో కాదు, ప్రియురాలితో.

అవును, ఫుట్ బాల్ ఆటలో పరిచయమైన తన ప్రియురాలితో ఆమె వెళ్లిపోయింది. మాల్దా ప్రాంతంలో వారిద్దరూ కాపురం పెట్టారు. చివరకు పోలీసుల వెళ్లినా ఫలితం లేదు, తామిద్దరం మేజర్లం అని, అవసరమైతే కోర్టు మెట్లెక్కుతామని హెచ్చరించారు.

పశ్చిమబెంగాల్ ఆలిపూర్ జిల్లా ఫలకాటా ప్రాంతానికి చెందిన యువతికి, తుఫాన్ గంజ్ ప్రాంతానికి చెందిన మరో యువతితో పరిచయమైంది. కాలేజీలో ఫుట్ బాల్ టీమ్ మేట్స్ అయిన వీరిద్దరూ స్నేహం కంటే ఎక్కువగా దగ్గరయ్యారు. ఇద్దరమ్మాయిల మధ్య ప్రేమ మరింత ముదిరి జీవితంలో ఇక ఏ మగాడిని పెళ్లి చేసుకోకూడదనే ఆలోచనకు వచ్చారు.

ఇంట్లో విషయం తెలిసి తుఫాన్ గంజ్ కి చెందిన అమ్మాయి తల్లిదండ్రులు వెంటనే మరో యువకుడితో పెళ్లి జరిపించారు. కానీ నెలరోజులే ఆమె భర్తతో కలసి ఉంది. స్నేహితురాలి ప్రేమే గొప్పదని భావించింది. ఆమెతోనే వెళ్లిపోయింది. భార్య లేచిపోయింది, కానీ అది మరో అమ్మాయితో అని తెలిసే సరికి ఆ భర్త తెల్లబోయాడు. మరో మగాడితో వెళ్లిపోతే వాడిని తిట్టో, కొట్టో భార్యను విడిపించుకుని రావొచ్చు. కానీ ఇక్కడ అమ్మాయితో వెళ్లిపోయే సరికి భర్త, కుటుంబ సభ్యులకు ఏం చేయాలో తెలియడం లేదు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?