జగన్ వద్దనుకున్న సరుకు…టీడీపీ నెత్తిన బరువు

రాజకీయాల్లో అప్డేట్ కావాలి. ఎంతసేపూ పాతగా ఉంటే జనరేషన్ మారుతోంది. గతంలో అయితే ఎక్కడ చూసినా పోటీ పెద్దగా ఉండేది కాదు. ఇపుడు సొసైటీ మారింది. రాజకీయాల్లోకి వచ్చేవారు కూడా బాగా పెరిగారు. అప్పట్లో…

రాజకీయాల్లో అప్డేట్ కావాలి. ఎంతసేపూ పాతగా ఉంటే జనరేషన్ మారుతోంది. గతంలో అయితే ఎక్కడ చూసినా పోటీ పెద్దగా ఉండేది కాదు. ఇపుడు సొసైటీ మారింది. రాజకీయాల్లోకి వచ్చేవారు కూడా బాగా పెరిగారు. అప్పట్లో పాలిటిక్స్ ని మాకు వద్దు అనుకునే యూత్ ఇపుడు కావాలీ అంటోంది. అంతే కాదు యూత్ ఆలోచనలు బాగా మారుతున్నాయి.

వారు పోటీకి రెడీగా ఉన్నారు. దాంతో గతంలో మాదిరిగా పాతికే ముప్పయ్యేళ్ళు ఒకే సీట్లో అతుక్కుపోయే ఎమ్మెల్యేలు కనిపించడంలేదు. జనాలకు కూడా బోర్ కొట్టేతోందేమో. ఇది కేవలం రాజకీయాల్లోనే కాదు అన్ని రంగాల్లోనూ ఉంది. సినిమాలు ఒకనాడు వంద రోజులు మూడు వందల రోజులూ ఆడేసేవి. ఇపుడు పరిస్థితి మారిందిగా.

సినిమా రోజుకు నాలుగు ఆటలు మూడువందల అరవై రోజులూ అన్న కాలం పోయింది. సీజనల్ గా పండుగలు సెలవలు ఉంటేనే సినిమాలు హిట్ అవుతున్నాయి. జనాలు వస్తున్నారు. దీనినే పాలిటిక్స్ కి అప్లై  చేస్తే ఒక నియోజకవర్గంలో తానే పదే పదే ఎమ్మెల్యేగా ఉంటాను అంటే జనాలు నో అనేస్తున్నారు.

అందుకే వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో చాలా ముందు చూపుతో ఎపుడూ ఉంటారు అంటారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తే ట్రెడిషనల్ పాలిటిక్స్ కి దూరంగా ఉంటారు. ఆయారాం గయారాం కల్చర్ కి జగన్ బహు దూరం. ఎక్కడైనా ఒకటీ అరా ఉన్నా టోటల్ గా వైసీపీలో జగన్ ఎపుడూ న్యూ థాట్స్ లోనే ముందుకు సాగుతారు అని చెప్పాలి.

అందుకే అయిదేళ్ల పాటు పనిచేసిన ఎమ్మెల్యేల విషయంలో వారి పనితీరు విషయంలో తనదైన సర్వేలు చేయిస్తున్నారు. పనితీరు బాలేదని తెలిసి తెలిసి జనాల మీదకు రుద్దడం ఎందుకు అన్నదే ఆయన మార్క్ ఆలోచన. ఆ విధంగా పనిచేయని వారిని ఎమోషన్స్ కోసం సెంటిమెంట్స్ కోసం  టికెట్లు ఇస్తూ పోవడం వల్ల అల్టిమేట్ గా పార్టీ విజయావకాశాలు దెబ్బ తింటాయని భావించే ఆయన వర్క్ షాప్స్ పేరిట టికెట్ల విషయంలో కుండబద్ధలు కొడుతున్నారు.

పనితీరు బాగులేకపోతే టికెట్ ఇవ్వలేమని, తానేమి చేసేది లేదని కూడా చెబుతున్నారు. పార్టీ పరంగా ఇతరత్రా వారికి అండగా ఉంటాను అని జగన్ చెబుతున్నారు. ఇక జగన్ ఏమి చెప్పారు అన్నది ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరెడ్డి కూడా చెప్పారు. నాకు ఎమ్మెల్సీ ఇస్తామని అన్నారు. కానీ ఓడినా గెలిచినా నీకే టికెట్ శేఖరన్నా అని ఉంటే బాగుండేది అని ఆయనే చెప్పుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.

దీన్ని బట్టి చూస్తే తనను నమ్ముకున్న వారికి ఏదో  రకంగా న్యాయం చేస్తానని జగన్ చెబుతూనే కొత్త వారికి యూత్ కి టాలెంట్ ఉన్న వారికి ఎప్పటికపుడు అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నారు అని అర్ధమవుతోంది. అలా జగన్ వద్దు అని అనుకుంటున్న వారిలో అసంతృప్తి ఉంటుంది. రాజకీయాల్లో నమ్మకాలు తక్కువ. ఎవరి ఫ్యూచర్ వారు జాగ్రత్తగా చూసుకుంటారు.

అందుకే రెబెల్స్ బయటకు వచ్చారు. ఇంకా రాబోతారు కూడా. వీటన్నిటి మీద జగన్ వద్ద పక్కా లెక్క ఉండి ఉండాలి. అందుకే ఆయన దేనికీ కలవరపడడంలేదనే అనుకోవాలి. అయితే ఇలా వచ్చిన వారిని తమ పార్టీలోకి లాగేసి వారితోనే సైకిల్ స్పీడ్ ని పెంచాలనుకుంటే మాత్రం చంద్రబాబు దెబ్బ తిన్నట్లే. ఎమ్మెల్యేల పనితీరు వైసీపీలో బాగులేకపోతే వారిని తీసుకుని టీడీపీ ఎలా జనంలోకి వెళ్తుంది అన్నది కూడా కీలకమైన అంశం.

ఒక విధంగా చూస్తే జగన్ కాదు వద్దు అనుకున్న వారిని చంద్రబాబు నెత్తికెక్కించుకుంటే టీడీపీ రెండిందాల నష్టపోతుందని అంటున్నారు. ఒకటి వారి పట్ల జనంలో విముఖత ఉందని అంటున్నారు. రెండవది అక్కడ అప్పటికే టీడీపీ ఇంచార్జిలు ఉంటారు. వారు రివర్స్ అవుతారు. జగన్ రాజకీయాల్లో నాలుగు అడుగులు ముందు ఉన్నారు. చంద్రబాబు విజన్ 2029, 2050 అనడం కాదు, మారుతున్న రాజకీయాలను బట్టి తన  వైఖరిని మార్చుకోవాలని అంటున్నారు. ఆయన డెబ్బై కాలం నాటి రాజకీయాలను చేస్తామంటే 2024లో ఇబ్బందులు ఎదురవుతాయనే అంటున్నారు. ఆ మీదట బాబు ఇష్టమని సొంత పార్టీలోనే వినిపిస్తున్న మాటగా ఉంది.