ఈ చర్య యోగి సర్కార్ దుర్మార్గం!

అధికారికంగా ప్రభుత్వాధినేత ఒక ప్రకటన చేయకుండానే.. ఇతర వదంతుల్ని, వార్తల్ని నమ్మవద్దని ఆయన చెబితే ఎలాగ?

కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. మౌని అమావాస్య పర్వదినం నాడు త్రివేణీ సంగమంలో స్నానాలు ఆచరిస్తే పుణ్యం వస్తుందనే నమ్మకంతో తరలి వెళ్లిన కోట్ల మంది భక్తుల్లో 20 మందికి పైగా చనిపోయారు. ఈ విషయంలో యోగి ఆదిత్యనాధ్ సర్కారు చాలా దుర్మార్గంగా వ్యవహరించింది.

కోట్ల మంది భక్తులు ఈ రోజున స్నానాల కోసం వస్తారని తెలిసినప్పటికీ.. కేవలం ఏర్పాట్లు చేయకపోవడానికి సంబంధించిన నింద కాదు ఇది. సంఘటన జరిగిన తర్వాత.. దానికి సంబంధించిన వివరాలను కూడా అధికారికంగా ప్రకటించకపోవడం అనేది అచ్చంగా ప్రభుత్వ దుర్మార్గం.

మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమంలో మునిగితే.. అమృతప్రాయమేనని విస్తృతంగా ప్రచారం జరిగింది. మౌని అమావాస్య నాడు ఒక్కరోజునే పదికోట్ల మందికి పైగా భక్తులు ప్రయాగ్ రాజ్ కు వచ్చి పుణ్య స్నానాలు చేస్తారని ముందునుంచి ప్రచారం చేస్తూ వచ్చారు.

నిజానికి ఈ సంఖ్య ఇంకా ఊహించనంత ఎక్కువగా ఉంది. ఎందుకంటే.. మంగళవారం రాత్రినుంచి బుధవారం ఉదయం 10 గంటల సమయానికే 8 కోట్ల మంది స్నానాలు చేసినట్టుగా లెక్కలు చెప్పారు. ఇంత జనం వస్తున్న సంగతి.. మంగళవారం నుంచే అధికార్లకు, నిర్వాహకులకు, ప్రభుత్వానికి కనిపిస్తూ ఉంటుంది కదా..! జనం వరదలాగా హఠాత్తుగా పోటెత్తి రారు కదా.. మరి తదనుగుణమైన ఏర్పాట్లు ఏం చేసినట్టు?

ఇంతకంటె దుర్మార్గానికి యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం పాల్పడింది. స్వయంగా ముఖ్యమంత్రి యోగి నే ప్రజలను భ్రమ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తొక్కిసలాట జరిగినట్టుగా చెబుతున్నారు. ఉదయం పది గంటల వేళకు మోడీ నాలుగుసార్లు ఫోనుచేసి ఆరా తీశారంటూ.. అక్కడికేదో మహోపకారం చేసినట్టుగా ఆ విషయం యోగి చెబుతున్నారే తప్ప.. తొక్కిసలాటలో ఎంతమంది చనిపోయారో అధికారికంగా ఆయన వెల్లడించలేదు. అర్ధరాత్రి 2 గంటలనుంచి ఉదయం 10 గంటల వరకు కనీసం శవాల లెక్క తీయడానికి ప్రభుత్వానికి చేతకాలేదా?

మళ్లీ యోగి ఇంకో మాట అంటున్నారు. తొక్కిసలాట గురించి వస్తున్న వదంతులు నమ్మవద్దు అని ఆయన దేశానికి హితవు చెబుతున్నారు. అధికారికంగా ప్రభుత్వాధినేత ఒక ప్రకటన చేయకుండానే.. ఇతర వదంతుల్ని, వార్తల్ని నమ్మవద్దని ఆయన చెబితే ఎలాగ? ఆయన బాధ్యత మరచి, అధికారిక ప్రకటన చేయలేదు గనుకనే.. ఎడాపెడా సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. 38 మంది నుంచి 50 మంది దాకా మరణించినట్లు ఎవరికి తోచిన విధంగా వారు చెప్పుకుంటున్నారు.

ఇంతా జరిగితే.. త్రివేణి సంగమం కోసం ఎగబడకుండా అన్ని ఘాట్లకు వెళ్లండి అని ఆయన చెబుతున్నారు.. ఆయన టీవీలో చెప్పే మాటలు.. ప్రయాగ్ రాజ్ లో అపరిమితమైన భక్తితో ప్రవాహంలో వెళుతున్న జనానికి ఎలా చేరుతాయి. ఇంతా.. ఆ జన ప్రవాహాన్ని త్రివేణి సంగమం వైపు కాకుండా ఇతర ఘాట్లకు మళ్లించడానికి ఆయన ఏం ఏర్పాట్లు చేశారో చెప్పలేదు. కనీసం మృతుల సంఖ్యను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోవడం అనేది బాధ్యతను విస్మరించిన దుర్మార్గమైన చర్యగా అనుకోవాలి.

19 Replies to “ఈ చర్య యోగి సర్కార్ దుర్మార్గం!”

  1. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  2. మావోడు ఉండుంటే ఇలా తొక్కకిసలాట లేకుండా

    “త్రివేణి సంఘమం సెట్టింగ్” వేసి ఇంటింటికీ వాలంటీర్స్ తో కుంభమేళా నీళ్లు అందించేవాడు తెలుసా?? ఈ జనాలు ఉన్నారే.. 11 ఇంచులు దింపి లండన్ కి పారిపోయేట్టు చేశారు.. కోపంగా ఉంది

  3. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  4. GA useless fellow! Don’t comment negative on Yogi in this matter. People should follow certain rules during that kind of massive mela.

    During 1954, around 800 people died in Kumbamela. Everybody has to take proper care and discipline.

  5. అదే 30 ఇయర్స్ ఇండస్ట్రీ అయితే తొక్కిసలాట ను ముందే కనిపెట్టేవాడు బూతు కిట్టు గాడు టెక్నాలజీ తెచ్చేవాడు

  6. చాలామంది చెత్త డబ్బాలు తగిలి కింద పడిపోయారుట, తొక్కిసలాటలో గాల్లో కలిసిపోయారు ! ఇక్కడ వీడియో తీస్తుంటేనే ప్రాణాలు పోతాయి పట్టపగలు . కొద్దిగా నేర్చుకోండి!

  7. అన్న హయాంలో గోదావరి లాంచీ ప్రమాదం లో చనిపోయున 20 మంది గురుంచి చెప్పు

  8. మా A1 సీఎం అయ్యుంటే, హిందువుల మీదకక్షతో అసలు కుంభమేళా జరక్కుండా రద్దు చేసి పడేసేవాడు, ఇక తొక్కకిసలాట స్కోప్ ఉండేదే కాదు తెలుసా??

  9. ఇది నిర్లక్ష్యం వల్ల జరిగిన incident కాదు, its an accident!! నిర్లక్ష్యం అంటే తిరుపతి రూయ హాస్పిటల్ లో జరిగిందాన్ని అంటారు, అప్పటి CM ని ఈ కేసులో ఉరి వేసినా తక్కువే!!

  10. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  11. బారికేడ్ల ను విరిచేసిన జనాలను నియంత్రించడం అంటే కష్ట సాధ్యం. అక్కడ ఈ జిఎ గాణ్ణి కంట్రోలర్ గా నియమించడం యోగీ గారికి తట్టి ఉండదు.

Comments are closed.