జెప్టో, బ్లింకిట్ ల దెబ్బ‌.. 17 ల‌క్ష‌ల అంగ‌ళ్లు మూత‌!

ఎంత‌టి న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో అయినా, వీధి చివ‌ర చిన్న చిన్న దుఖాణాలు ఉండేవి.. అని చెప్పుకునే త‌రుణం ఆస‌న్నం అయ్యింది. ఇప్ప‌టికే రీటెయిల్ స్టోర్ల ఫ‌లితంగా చిన్న చిన్న దుఖాణాలు, అంగ‌డి న‌డుపుకునే వాళ్ల…

ఎంత‌టి న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో అయినా, వీధి చివ‌ర చిన్న చిన్న దుఖాణాలు ఉండేవి.. అని చెప్పుకునే త‌రుణం ఆస‌న్నం అయ్యింది. ఇప్ప‌టికే రీటెయిల్ స్టోర్ల ఫ‌లితంగా చిన్న చిన్న దుఖాణాలు, అంగ‌డి న‌డుపుకునే వాళ్ల ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. ప్ర‌తి మండ‌ల హెడ్ క్వార్ట‌ర్లో కూడా ఇప్పుడొక సూప‌ర్ స్టోర్స్, రీటెయిల్ చైన్ సంస్థ‌ల దుఖాణాలు వ‌చ్చి ప‌డ్డాయి.

విశాల‌మైన ఆ స్టోర్ల‌లో స‌ర‌దాగా తిరిగి, అవ‌స‌ర‌మైన‌వి, అవ‌స‌రం లేనివి కొనుక్కోవ‌డానికి జ‌నాలు అల‌వాటు ప‌డిపోయారు వేగంగా. అంత వ‌ర‌కూ పట్ట‌ణాల్లో కూడా కోమ‌ట్ల అంగ‌ళ్ల‌లో ఖాతాలు మెయింటెయిన్ చేసి, అవ‌స‌రం అయిన‌వి అవ‌స‌ర‌మైన‌ట్టుగా తెచ్చుకునే వారు కూడా .. రీటెయిల్ స్టోర్ల , సూప‌ర్ మార్కెట్ల వెంట ప‌డ్డారు. పాత‌బంధాలు తెగిపోయాయి. మ‌రీ చిన్న చిన్న ప‌నులు చేసుకునే వారు, ఏ పూట‌కు ఆ పూట తెచ్చుకునే వారు త‌ప్ప‌.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కూడా ఇప్పుడు వీధి చివ‌రి అంగ‌ళ్ల‌తో బంధాన్ని తెంచేసుకున్నారు. సూప‌ర్ మార్కెట్లో క‌లియ‌తిరిగి తెచ్చుకోవ‌డం ఇప్పుడు మండ‌ల స్థాయి ప‌ట్ట‌ణాల్లో కూడా ఒక స్టేట‌స్ సింబ‌ల్.

అలాంటి ప‌ట్ట‌ణాల్లో కిరాణా అంగ‌ళ్ల ప‌రిస్థితి అలా బిక్కుబిక్కుమంటూ సాగుతూ ఉండ‌గా, న‌గ‌రాలు, పెద్ద పెద్ద ప‌ట్ట‌ణాల్లో ఇప్పుడు జెప్టో, బ్లింకిట్ లు దూసుకు వ‌చ్చాయి. పెద్ద పెద్ద సూప‌ర్ మార్కెట్ల వాళ్లు క‌రోనా కాలం నుంచినే డోర్ డెలివ‌రీ ఇస్తున్నాయి. యాప్ లో ఆర్డ‌ర్ చేస్తే మ‌రుస‌టి రోజుకు డెలివ‌రీ ఉండేద‌ప్పుడు. అయితే ఇప్పుడు ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది.

ఇంట్లో ఏది అర్జెంట్ గా అవ‌స‌రం అయినా యాప్ లో ఆర్డ‌ర్ పెట్టేస్తే చాలు, ఇర‌వై ముప్పై నిమిషాల్లో బైక్ మీద వ‌చ్చి డెలివ‌రీ ఇచ్చేస్తారు! ఉప్పు, ప‌ప్పుతో మొద‌లుపెడితే.. మందు సిట్టింగ్ కు గాజు గ్లాసుల‌తో స‌హా ప్ర‌తిదీ ఇంటికి డెలివ‌రీ అయిపోతుంది. అపార్ట్ మెంట్ లో ఉంటూ, కిందికి దిగే ప‌ని కూడా లేకుండా.. ఇంట్లోకే వేగంగా అన్నీ డెలివరీ అయిపోతున్నాయి! క‌నీసం సూప‌ర్ మార్కెట్ కు వెళ్లాల్సిన అవ‌స‌రం కూడా లేకుండా చేసేస్తున్నాయి క్విక్ కామ‌ర్స్ సంస్థ‌లు!

ఇది ఎంత తీవ్ర స్థాయికి వెళ్లిపోయిందంటే.. క్విక్ కామ‌ర్స్ సంస్థ‌లు దూసుకుపోవ‌డం మొద‌ల‌య్యాకా దేశంలో ఏకంగా 17 ల‌క్ష‌ల చిన్న చిన్న దుఖాణాలు, వీధి చివ‌రి అంగ‌ళ్లు మూత ప‌డ్డాయ‌ట‌! ఒక మార్కెటింగ్ స్ట‌డీ ఈ అంశాన్ని చెబుతోంది. ఇంటికే డెలివ‌రీ ఇస్తామంటూ సూప‌ర్ మార్కెట్ల వాళ్లు చుట్టు ప‌క్క‌ల ఇళ్ల వారితో మంచిగా న‌డుచుకునే ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌గానే, క్విక్ కామ‌ర్స్ యాప్స్ దూసుకుపోయాయి. క‌ష్ట‌మ‌ర్ తో సంబంధం అవ‌స‌రం లేదు, జ‌స్ట్ మొబైల్ యాప్ వార‌ధి.

ఇర‌వై నిమిషాలు, ముప్పై నిమిషాలు అంటూ ఛాలెంజింగ్ డెలివరీలు. వీటి వ‌ల్ల డెలివ‌రీ బాయ్స్ కు ఉద్యోగాలు పెరిగాయేమో కానీ, కొద్దోగొప్పో డ‌బ్బును పెట్టుబ‌డిగా పెట్టి, చిన్న అంగ‌డి పెట్టుకునో, పాల ప్యాకెట్లు అమ్ముకుంటూనో బ‌తికే వాళ్లకు అలాంటి ఉపాధి మార్గాలు పూర్తిగా మూసుకుపోతున్నాయి, క్విక్ కామ‌ర్స్ మ‌రింత‌గా విస్త‌రిస్తోంది. సూప‌ర్ మార్కెట్లు, క్విక్ క‌మార్స్.. పేర్ల‌తో మొత్తం వ్యాపారం క్ర‌మంగా కొంత‌మంది వ్య‌క్తుల చేతుల్లోకి, కొన్ని సంస్థ‌ల చేతుల్లోకి వెళ్లిపోతూ ఉంది!

11 Replies to “జెప్టో, బ్లింకిట్ ల దెబ్బ‌.. 17 ల‌క్ష‌ల అంగ‌ళ్లు మూత‌!”

  1. So what? Every family should have 4 kids minimum so that

    india remains young forever, exploiting tax payers and keeping people poor and beggars thru out their lives. People dreaming once Japan and south korea become vacant after 25 years, they give perminent residence to them. This is vision 2047.

  2. So what? Every family should have 4 kids minimum so that india remains young forever, exploitingg taxx payers and keeping people poor and beggarz thru out their lives. People dreaming once Japan and south korea become vacant after 25 years, they give perminent residence to them. This is vision 2047.

  3. Or rededined. Its a wave of change. What appears like killing a business model for a generation seems like the way it is for later generation. Walmart for a while was threatened by amazon but survived. For example take Sears or Marshals, You will find a section of Gen X who feel nostalgic about Sears.

    I’ll give another perspective. These Kirana stores when ghey started selling the 1-2 ra shampoo and killed kunkudukai ( a lot of tribals rely on this as their source of income), selling coca cola in 5rs bottles and killed the local soda naidu.. no one noticed until they are totally gone.

    That said, i think these blinkit etc would only survive untill they burn VC money. Someone will eventually come craete a instakart kinda model for these kirana stores to deliver under 5 mins.

    1. సినిమాల దెబ్బకి నాటకాలు, స్టేజ్ కళాకారులు పోలేదా?

      People must accept change and adapt new wave.

  4. monna brush & tongue cleaner urgenet ani, early morning kavali shops vundavu ani zepto lo peditha brush 3 pack 350, 30 rs tongue cleaner 95 rs vesadu. nenu first time order cheyyadam. future lo anni shops mootha pdi, order evvadam alavatu iyyi somaripothulam ayyaka mana dagggara rupayi kuda saving cheyyanivvaru.

  5. monna brush & tongue cleaner urgenet ani, early morning kavali shops vundavu ani *Gepto lo peditha brush 3 pack 350, 30 rs tongue cleaner 95 rs vesadu. nenu first time order cheyyadam. future lo anni shops mootha pdi, order evvadam alavatu iyyi somari pothulam ayyaka mana dagggara rupayi kuda saving cheyyanivvaru.

Comments are closed.