అప్పుడు కాదు.. ఇప్పుడు ‘లెజెండ్’

కొన్నేళ్ల కిందటి సంగతి. తెలుగు సినీ పరిశ్రమ మొత్తం వజ్రోత్సవాల్ని ఘనంగా జరుపుకుంది. హీరోలంతా ఏకతాటిపైకి వచ్చి సంబరాలు చేశారు. అయితే చిరంజీవికి లెజెండరీ అవార్డ్ ఇచ్చే విషయంలో వివాదం చెలరేగింది. ఎవరూ ఊహించని…

కొన్నేళ్ల కిందటి సంగతి. తెలుగు సినీ పరిశ్రమ మొత్తం వజ్రోత్సవాల్ని ఘనంగా జరుపుకుంది. హీరోలంతా ఏకతాటిపైకి వచ్చి సంబరాలు చేశారు. అయితే చిరంజీవికి లెజెండరీ అవార్డ్ ఇచ్చే విషయంలో వివాదం చెలరేగింది. ఎవరూ ఊహించని విధంగా చిరంజీవికి ఆ అవార్డ్ ఇవ్వడాన్ని మోహన్ బాబు వ్యతిరేకించారు.

మోహన్ బాబు అభ్యంతరం చెప్పడంతో చిరంజీవి, ఆ అవార్డును అక్కడికక్కడ వదిలేశారు. ఆ రోజున ఆయన కొంతమంది దృష్టిలో లెజెండ్ కాకపోవచ్చు. కానీ ఈరోజు ఆయన టాలీవుడ్ లెజెండ్. ఏఎన్నార్ జాతీయ అవార్డ్ అందుకున్న సందర్భంగా ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు చిరు.

“నేను కొన్నేళ్ల కిందటే రచ్చ గెలిచాను. నా ఇల్లు లాంటి ఈ పరిశ్రమలో గెలిచే అవకాశం నాకు సినీ వజ్రోత్సవాల టైమ్ లో వచ్చింది. అందరూ కలిసి నాకు లెజండరీ అవార్డ్ ప్రదానం చేస్తుంటే, చాలా హ్యాపీ ఫీలయ్యాను. కానీ కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో, కొంతమంది నా ఘనతకు హర్షించలేదు. అలాంటి టైమ్ లో అవార్డ్ తీసుకోవడం సముచితంగా అనిపించలేదు. అందుకే ఆ రోజున ఓ క్యాప్సూల్ బాక్సులో అవార్డ్ పడేశాను. ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈరోజు ది గ్రేట్ ఏఎన్నార్ అవార్డ్ వచ్చిన రోజున నేను ఇంట గెలిచాను.”

ఏఎన్నార్ జాతీయ అవార్డుతో టాలీవుడ్ లో ‘ది లెజెండ్’ ఘనత అందుకున్నానని చిరంజీవి పరోక్షంగా ప్రస్తావించారు. ఇప్పటివరకు పద్మవిభూషణ్, గిన్నిస్ బుక్ రికార్డ్ తో పాటు ఎన్నో అవార్డులు తనకు వచ్చినప్పటికీ.. ఏఎన్నార్ జాతీయ అవార్డ్ ను ఎంతో ప్రత్యేకంగా, గొప్పగా ఫీల్ అవ్వడానికి ఇదే కారణమన్నారు.

అవార్డును ప్రకటించిన సందర్భంగా తనను కలిసిన నాగార్జునతో కూడా ఇదే మాట అన్నానని గుర్తు చేసుకున్న చిరంజీవి.. ఇన్నాళ్లకు ఇంట గెలిచిన ఆనందాన్ని, ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ తనకు అందించిందని అన్నారు.

17 Replies to “అప్పుడు కాదు.. ఇప్పుడు ‘లెజెండ్’”

  1. Congrats to mega star Chiranjeevi garu.

    He deserves it. He is a nice gentleman. With his hardwork and dedication, he has reached highest levels in the cini field. Even in politics he was decent and speeches were also nice. He never uttered any abusive or derogatory words against anyone.

  2. ఇలాంటి లెజెండ్ ని కా*ళ్ల దగ్గరకు రప్పించుకున్నాను అని విర్రవీగిన ఒక బో*కు ఎదవ ఇప్పుడు అందరి కా*ళ్ళు పట్టుకుంటున్నాడు, అదే విధి!!

    1. KukkaluMoruguthoone vuntayi nee laga… NeeBathukkeDikkuLedu NeeLantiNishaniSannasulu entha edchina Chiru is always legend.. eduvu inka eduvu..sorry morugu inka morugu.. ROFL

    2. KukkaluMoruguthoone vuntayi nee laga… NeeBathukkeDikkuLedu NeeLantiNishaniSannasulu entha edchina Chiru is alwaysLegend.. inkaEduvu..sorry inkaMorugu.. ROFL

  3. Ippudu kuda Chiru thanani thane legend ani cheppukuntunnadu. Inka Nag vishayaniki vasthe, atu Telangana, itu AP CM lu daggariki raneeyadam ledu. Ippudu chiru ni thomi AP lo cm/dycm ki daggaravvalani plan. Kabatti ippudu vachina ANR award kuda cleanga raledu.

  4. Telugu Industry varaku, Legend ante Oka Chittur Nagayya, HMR, Anjali devi, Kannamba, Savitri, Jamuna, ANR, NTR, SVR, Rajanala, LVP, KVR, Kantharao, Vitalacharya, Dasari, Superstar Krishna, Ramanayudu, Jayamalini. Chiru Legend analante emi kanapadatam ledu.

  5. Mana industry lo svr ki kaikala Satyanarayana gaariki Kota gaariki savitri gaariki suryakanram gaariki yeppudaina ilanti awards ravadam choosara? Naaku telisi vaallu chiru sir kante manchi actors. Kaani yevaru pattinchukoru. Veellaku veellem awards ichhukuntaru. Meme thopu antuntaru. Yento ee nasa

Comments are closed.