నక్సల్స్ నేత ఆర్కే మృతి?

చిరకాలంగా పలు రాష్ట్రాల పోలీసులకు కొరకరాని కొయ్య గా వుంటూ, నక్సలైట్ ఉద్యమానికి కీలక నేతగా వుంటూ, ఎన్నో గండాల నుంచి తప్పించుకుని, ఎన్నో కేసుల్లో ముద్దాయిగా వుండి, యాభై లక్షల రివార్డు తలపై…

చిరకాలంగా పలు రాష్ట్రాల పోలీసులకు కొరకరాని కొయ్య గా వుంటూ, నక్సలైట్ ఉద్యమానికి కీలక నేతగా వుంటూ, ఎన్నో గండాల నుంచి తప్పించుకుని, ఎన్నో కేసుల్లో ముద్దాయిగా వుండి, యాభై లక్షల రివార్డు తలపై వుంచుకున్న నక్సల్స్ అగ్రనేత ఆర్కే అలియాస్ అక్కిరాజు రామకృష్ణ మృతి చెందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దక్షిణ బస్తర్ అడవుల్లో ఆర్కే మృతి చెందినట్లు సమాచారం వ్యాపించింది. కానీ పోలీసులు దానిని ధృవీకరించలేదు. చంద్రబాబు పై అలిపిరి వద్ద దాడితో సహా పలు కేసుల్లో ఆయన నిందితుడు. పలు ఎన్ కౌంటర్ల నుంచి ఆయన తృటిలో తప్పించుకున్న ఉదంతాలు వున్నాయి.

పల్నాడు ప్రాంతంలోని బడిపంతులు కుమారుడిగా జీవితం ప్రారంభించి గుంటూరు జిల్లాలో విద్యార్థి దశలోనే నక్సలైట్ ఉద్యమం వైపు ఆకర్షితుడై, నిట్ విద్యార్థి జీవితం అనంతరం నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్లారు.  

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే నక్సల్స్ ఉద్యమానికి రామకృష్ణ మృతి చాలా గట్టి దెబ్బ. గతంలో వైఎస్ తో చర్చలకు ఆర్కే అజ్ఖాతం నుంచి బయటకు వచ్చారు. ఆ తరువాత మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటి నుంచి మళ్లీ బయటకు ఇప్పటి వరకు రాలేదు.