విశాఖకు కొత్త పేరు…

విశాఖకు ఎన్నో పేర్లు ఉన్నాయి. నిజానికి ఏ సిటీకి లేనన్ని పేర్లు ఒక్క విశాఖనే ఉన్నాయంటే ఆశ్చర్యంగా, గర్వంగా కూడా ఉంటుంది. విశాఖను సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. అదే విధంగా క్యాపిటల్ ఆఫ్…

విశాఖకు ఎన్నో పేర్లు ఉన్నాయి. నిజానికి ఏ సిటీకి లేనన్ని పేర్లు ఒక్క విశాఖనే ఉన్నాయంటే ఆశ్చర్యంగా, గర్వంగా కూడా ఉంటుంది. విశాఖను సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. అదే విధంగా క్యాపిటల్ ఆఫ్ ఫైనాన్స్, టూరిజం అని కూడా చెబుతారు. సినీ రాజధాని అన్నా విశాఖ నేనే అంటుంది.

ఇపుడు చూస్తే విశాఖకు సిటీ ఆఫ్ ద‌ పార్క్ అంటున్నారు కొత్త మేయర్ గొలగాని హరి వెంకట కుమారి. విశాఖకు ఎంతో భవిష్యత్తు ఉందని, ప్రగతిపధంలో తాము నగరాన్ని తీర్చిదిద్దుతామని ఆమె చెబుతున్నారు. 

అంతే కాదు విశాఖనే మొత్తం సిటీనే ఉద్యానవనంగా తయారు చేస్తామని ఆమె చెబుతున్నారు. ఎటు చూసిన స్వచ్చదనం, పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండేలా విశాఖను డిజైన్ చేస్తున్నామని చెప్పారు.

విశాఖను దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల జాబితాలో కూడా చేర్చడానికి మేయర్ ప్రతిన పూనారు. చూడబోతే విశాఖకు ఇకపైన వచ్చే వారు అసలు తిరిగి వెళ్లలేరు అంటున్నారు. 

నగరమే అందమైన పార్క్ మాదిరిగా ఉంటే ఇక ప్రతీ క్షణమూ విహారమే కదా అని నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దానికి తగిన ప్రణాళికతో కొత్త పాలక వర్గం ముందుకు సాగడం స్వాగతించే పరిణామమని అంటున్నారు.