‘తానా’ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన నిరంజన్‌ ప్యానెల్‌

వాషింగ్ట‌న్‌: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ ఎన్నికల్లో నిరంజన్‌ శృంగవరపు ప్యానెల్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో తానా త‌దుప‌రి అధ్యక్షుడిగా నిరంజన్ ఎన్నిక‌య్యారు. …

వాషింగ్ట‌న్‌: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ ఎన్నికల్లో నిరంజన్‌ శృంగవరపు ప్యానెల్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో తానా త‌దుప‌రి అధ్యక్షుడిగా నిరంజన్ ఎన్నిక‌య్యారు. 

నిరంజన్‌కు 10,866 ఓట్లు రాగా, నరేన్‌ కొడాలికి 9,108 ఓట్లు వ‌చ్చాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ఆధిక్యం క‌న‌బ‌రిచిన నిరంజ‌న్ ప్యానెల్ చివ‌రికి భారీ మెజారిటీతో గెలుపొందింది. ఈ విజ‌యంతో నిరంజన్‌ ప్యానెల్‌ సభ్యులు సంబురాల్లో మునిగిపోయారు. 

ఇక శృంగవరపు నిరంజన్‌కు తానా ప్ర‌స్తుత అధ్యక్షుడు జ‌యశేఖ‌ర్‌ తాళ్లూరి, అంజయ్య చౌదరిలు మద్దతు తెలిపిన విష‌యం తెలిసిందే. వీరి ద్వారా నిరంజ‌న్ ప్యానెల్‌కు సుమారు 1758 ఓట్లు వ‌చ్చినట్లు స‌మాచారం. 

కాగా, నరేన్‌ కొడాలికి మద్దతుగా తానా మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి, సతీష్‌ వేమన ఉన్నారు.