నివర్ ఎఫెక్ట్.. స్వామివారి భక్తులకు విజ్ఞప్తి

నిఫర్ ప్రభావం చిత్తూరు జిల్లాపై ఎక్కువగా పడింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురవగా.. తిరుమలపై ఆ ప్రభావం గట్టిగా పడింది. ఏకంగా శ్రీవారి మెట్లు నడకదారి మార్గాన్ని మూసేశారంటే నివర్ ఎఫెక్ట్…

నిఫర్ ప్రభావం చిత్తూరు జిల్లాపై ఎక్కువగా పడింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురవగా.. తిరుమలపై ఆ ప్రభావం గట్టిగా పడింది. ఏకంగా శ్రీవారి మెట్లు నడకదారి మార్గాన్ని మూసేశారంటే నివర్ ఎఫెక్ట్ తిరుమలపై ఏ రేంజ్ లో పడిందో అర్థం చేసుకోవచ్చు.

తుపాను కారణంగా మెట్ల దారి మార్గంలో చెట్లు, కొండ చరియలు విరిగిపడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన టీటీడీ సిబ్బంది నడకమార్గాన్ని క్లియర్ చేసినప్పటికీ.. ముందుజాగ్రత్త చర్యగా రాత్రి నుంచి ఆ మార్గాన్ని మూసివేశారు. భక్తులు ప్రత్యామ్నాయంగా రహదారి మార్గాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు.

ఇక ఘాట్ రోడ్డుపై కూడా బండరాళ్లు పడుతున్నాయి. వాటిని సిబ్బంది ఎప్పటికప్పుడు తొలిగిస్తోంది. ప్రస్తుతానికైతే ఘాటు రోడ్డు రవాణాకు అనుకూలంగానే ఉందని ప్రకటించింది టీటీడీ. మరోవైపు భారీ వర్షాలకు తిరుమలలో జలాశయాలన్నీ నిండిపోయాయి. 

ఆకాశగంగ, గోగర్భం, పాప వినాశనం, కేపీ డ్యామ్ పూర్తిస్థాయిలో నిండిపోవడంతో.. అధికారులు గేట్లు ఎత్తేశారు. స్వామివారి ఆలయ పరిసరాలు వరద నీటితో నిండిపోయాయి. మాడవీధులు జలమయమయ్యాయి.

ఈరోజు రేపు తిరుమలకు భక్తుల రాక పూర్తిగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే, ఇప్పటికే తిరుపతి ఎయిర్ పోర్ట్ నుంచి 4 విమానాలు రద్దుచేశారు. అటు తిరుపతి-సప్తగిరి ఎక్స్ ప్రెస్ రైలు రద్దయింది. దీనికితోడు తిరుపతి-చిత్తూరు, తిరుపతి-మదనపల్లె, రేణిగుండ-కడప, పుంగనూరు-బెంగళూరు రహదారులు కోతకు గురవ్వడంతో పాటు చెట్లు విరిగిపడ్డంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

నడకమార్గం ప్రస్తుతానికి మూసివేశామని.. దీంతో పాటు ప్రస్తుతం వాతావరణ పరిస్థితిని అంచనా వేసుకొని భక్తులు తమ తీర్థయాత్రల్ని ప్లాన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది టీటీడీ.

సొంత పరువు కూడా బాబుకి తాకట్టు