'అసలు ఆగష్టు సంక్షోభం ఆరంభం ఇక పవన్ కళ్యాణ్ పాత్ర ప్రారంభం..' ఇదీ శ్రీమాన్ నూతన్ నాయుడు పేరుతో ఉన్న ఒక ఫేస్ బుక్ అకౌంట్లో ఈ నెల ఎనిమిదో తేదీన పెట్టిన పోస్టు! పవన్ కల్యాణ్ రాజకీయాల పట్ల సీరియస్ గా లేకపోయినా ఆయన మద్దతుదారులు మాత్రం ఊపేకుహా తీరున సోషల్ మీడియాలో చెలరేగిపోతుంటారు. అయితే అంతా ఆకూపోక తెలియని వ్యవహారమే!
ఇందుకు నిఖార్సైన ఉదాహరణ.. పవన్ కల్యాణ్ వీరాభిమాని నూతన్ నాయుడు ఇదే ఆగస్టు ఎనిమిదో తేదీ పెట్టిన పోస్టు. ఇప్పుడంటే జనసేన పార్టీ తమకూ నూతన్ నాయుడుకు సంబంధం లేదని చెప్పవచ్చు! అయితే ఆయన తీసిన కళాఖండం పరాన్నజీవి పరిస్థితి ఏమిటి? ఏం… అప్పుడు చెప్పలేదే..మాకూ నూతన్నాయుడుకూ సంబంధం లేదని!
అప్పుడు అలివిగాని రీతిలో ప్రమోట్ చేసి, ఆగస్టులో సంక్షోభాలు పుట్టేస్తాయని పలికి.. ఆ అతితోనే తీరా ఇరుక్కున్నాకా.. సంబంధం లేదంటే ఎలా?
ఆగస్టు సంక్షోభం అంటూ హెచ్చరించిన వాళ్లు అంతులేని అహంకారంతో అట్రాసిటీ సంక్షోభంలో చిక్కుకున్నట్టున్నారు. ఆయనతో సంబంధం లేదని తేల్చి జనసేన కూడా చేతులు దులిపేసుకుంది! సినిమాల్లోలా పవన్ కల్యాణ్ వచ్చి రక్షిస్తాడని అతి చేసే జనసైనికులకు కూడా మంచి సందేశాన్నే ఇచ్చినట్టున్నారు.