జనసేన అనే అమ్మాయిని టీడీపీ అనే అబ్బాయి ప్రేమ పేరుతో రెచ్చగొట్టాడు. గత కొంత కాలంగా “నువ్వు లేకపోతే నాకు బతుకే లేదుష అనే అబ్బాయి మాటలకు అమ్మాయి పడిపోయింది. తాను ప్రేమిస్తున్నా, అమ్మాయి వైపు నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడం లేదని అబ్బాయి బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేశాడు. వన్‌సైడ్ లవ్ అయితే ఏం లాభమని వేలాది మంది ఎదుట విరహ వేదన చెందాడు. అమ్మాయి కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించాడు.
అమ్మాయి సీరియస్‌గా ఆలోచించింది. ప్రేమిస్తే పోయేదేమైనా ఉందా? అని ఒకటికి పదిసార్లు మనసును ప్రశ్నించుకుంది. ఏమైనా వుంటే కదా పోవడానికి అని మనసు సమాధానం చెప్పింది. ఎందుకంటే గతంలో ఇదే అబ్బాయితో సరసాలు, సంసారాలు ముగిసాయి. అందుకే పోవడానికి శీలం కూడా లేదని ఒకింత బాధ కలిగింది. కానీ అమ్మాయి మనసు ఎంతో విశాలమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే త్రిబుల్ ఇంజన్ అన్నమాట.
అబ్బాయి వన్‌సైడ్ లవ్, త్యాగమనే మాయ మాటలకు అమ్మాయి మరోసారి బోల్తా పడింది. “నా మనసు నీకే అంకితం ప్రియుడా” అని బహిరంగంగానే ప్రకటించింది. అమ్మాయి ప్రకటన వచ్చే సరికి పుణ్యకాలం కాస్త మించిపోయిందని అబ్బాయి యూటర్న్ తీసుకున్నాడు. ప్రియుడి స్వరం మారింది. తన నిరాకరణను మౌనం ద్వారా చెప్పాడు. ఇలా అమ్మాయిలను వంచించడం అతనికి వెన్నుపోటుతో పెట్టిన విద్య. ఎవరైనా నమ్మితేనే కదా మోసపోయేది? అమ్మాయి విషయంలోనూ అదే జరుగుతోంది.
అమ్మాయి కళ్లు తెరిచే సరికి ఏవేవో జరిగిపోతున్నాయి. ఇదేంటి నువ్వే కదా ప్రేమ, దోమ అన్నావని అమ్మాయి నిలదీసింది. వన్‌సైడ్ లవ్, వార్ వన్‌సైడ్ అని అంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిందే అని అమ్మాయి వాపోయింది. మోసం చేసేదెవరు, మోసపోయేదెవరు? అంతా ఆ రాజకీయం నడిపిస్తోంది ప్రియా…. నన్ను అపార్థం చేసుకోకు అని ప్రియుడు కొత్త పల్లవి ఎత్తుకున్నాడు.
ఇలాగైతే నా బతుకేం కావాలని ప్రియురాలు నిలదీసింది. ఈ సందర్భంగా ప్రియుడి ముందు నాలుగు ఆప్షన్లు పెట్టింది. అవి ఏంటంటే..
1.నువ్వు లేక ఒంటరిగా బతకడం
2.నువ్వు, నేను కలిసి బతకడం
3.మనసు చంపుకుని మరొకరితో వ్యభిచరించడం
4.ఆత్మహత్య చేసుకోవడం అని ప్రియుడి ముందు ఆప్షన్స్ ఉంచింది.
ప్రియా నిన్ను చేసుకుంటే… నీ సంగతేంటో గానీ, మా భార్య, కుమారుడి దెబ్బకు నేను నాలుగో అప్షన్ ఎంచుకోవాల్సి వుంటుందని చావు కబురు చల్లగా చెప్పాడు.
సొదుం రమణ