Advertisement

Advertisement


Home > Politics - Opinion

ఇది ముమ్మాటికీ కమ్మవారి 'రియలెస్టేట్' పోరాటమే

ఇది ముమ్మాటికీ కమ్మవారి 'రియలెస్టేట్' పోరాటమే

అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న అత్యధికులు కమ్మవారే అంటే ఈనాడు లెక్కలు తీసి ఏయే కులాల వాళ్లు ఎంతమందున్నారో రాసింది. ఇది కమ్మవారి పోరాటం కాదని, అన్ని కులాల వాళ్లు ఉన్నారని వాదించింది. అయితే అదే కథనంలో అసలు విషయం చెప్పి కళ్లు తెరిపించింది. ఎకరాల్లెక్కన ఎంతమంది ఎంతెంతిచ్చారో కూడా ఒక లెక్క చెప్పింది. ఈ రెండు రకాల గణాంకాలను సమన్వయం చేసి మొత్తం రైతుల ఇచ్చిన 34323 ఎకరాలలో ఏ కులం వారు ఇచ్చిన విస్తీర్ణం ఎంత ఉన్నది అనే లెక్కలు తీస్తే కనుక అసలు రహస్యం అర్థమవుతుంది. అమరావతి రాజధాని కోసం కమ్మ కులస్థుల బాధ ఏమిటో తెలుస్తుంది. 

పార్టీలతో సంబంధం లేకుండా అమరావతి ఉద్యమానికి వత్తాసు పలుకుతున్న వాళ్లు ముమ్మాటికీ కమ్మవారే. కళ్లు, చెవులు ఉన్న ఎవరికైనా ఈ నిజం బోధపడుతుంది. బీజేపీ లో సుజన చౌదరి నుంచి కమ్యూనిస్టు నాయకులు, కాంగ్రెస్ లీడర్ల వరకు... ఎవరెవరు అమరావతికి సపోర్టిస్తూ నోరు విప్పుతున్నారో వాళ్లంతా కమ్మవారే. అమెరికాలో అమరావతి ఉద్యమానికి సపోర్ట్ గా ధర్నాలు చేస్తున్నవారెవరో విడిగా చెప్పక్కర్లేదు. వాళ్లూ కమ్మవారే. 

అమరావతిలో అని కులాల వారి పెట్టుబడులు ఒకెత్తైతే కమ్మవారిదొక్కటీ ఒకెత్తు. చంద్రబాబుని నమ్మి, అరచేతిలో సింగపూర్ చూపిస్తే గుడ్లు తేలేసి అక్కడ రియెలెస్టేట్ వ్యాపారం కోసం భారీ పెట్టుబడులు పెట్టిన వాళ్లు కమ్మవారే. రియలెస్టేట్ వ్యాపారం ఎవరైనా చేయొచ్చు. కానీ చంద్రబాబు గారు మ్యాపు వేసి మంచి ఏరియాలని కట్టబెట్టింది మాత్రం అశ్వినీదత్తు లాంటి కమ్మవ్యాపారులకే. వీళ్లకే కాదు అమెరికాలోని కమ్మ ఎన్నారైల నుంచి కూడా భారీగా పార్టీ ఫండు తెచ్చుకుని, దానికి ప్రతిగా అమరావతిలో ఎకరాల్లెక్కన భూములు కేటాయించిన విషయం కూడా న్యూజెర్సీ నుంచి నూజివీడుదాకా చాలామందికి తెలుసు. అవన్నీ వందాలది కోట్లైపోతాయనుకుంటే ఎక్కడ పెట్టిన పెట్టుబడి అక్కడే అన్నట్టుంది. అందుకే వాళ్లకి మండుతున్న మంట అంతా ఇంతా కాదు. 

ఉద్యమంలో పాల్గొంటున్న గుంపులో ర్యాండం గా లెక్కేసినా ఎంతమంది కమ్మవారున్నారో తేలిపోతుంది. అందుకే మొన్నీమధ్య కొడాలి నానిపై ధ్వజమెత్తిన అమరావతి ఉద్యమకారుల్లో పలువురు, "అసలు నువ్వు కమ్మ పుటక ఎలా పుట్టావురా" అంటూ ఊగిపోయారు. అలా తిడుతూ "నేను ఫలానా చౌదరినిరా" అంటూ వాళ్ల పేర్లు కూడా చెప్పారు. అక్కడే తెలిసిపోయింది ఉద్యమంలో ఉన్న కమ్మవారి సంఖ్యాబలం ఎంతుందో. 

అమరావతి ఉద్యమంలో ఉన్న కమ్మవారి బాధలో అర్థముందనుకున్నా అసలు తక్కిన ప్రజలు ఎలా చూస్తున్నారో చూద్దాం. 

ఎంత కాదన్నా అమరావతి ఉద్యమానికి కమ్మరావతి ఉద్యమం కలరొచ్చేసింది. ఒకానొక కులానికి నష్టం జరుగుతోంది... ఆదుకోవాలి అని అన్నప్పుడు అది అణగారిన వర్గమైతే సమాజంలో సానుభూతి వచ్చే అవకాశముంటుంది. కానీ దశాబ్దాలపాటు రాజ్యాలు చేస్తున్న కులాలు అలా రోడ్డున పడితే మిగిలిన వాళ్లు చోద్యం చూస్తున్నట్టు చూసి నవ్వుకుంటారే తప్ప సానుభూతి కురిపించరు. 

కమ్మకులం తెలుగునాట విజయబావుటా ఎగరేసిన కులం. అన్ని రంగాల్లోనూ దూసుకుపోయి కోట్లకు పడగలెత్తిన వాళ్లు కమ్మవాళ్లల్లో చాలా ఎక్కువ. కమ్మవారి ప్రాభవం తెలుగుదేశం పార్టీ పుట్టడానికి ముందు, పుట్టిన తర్వాత లెక్కేయాలి. రాజకీయంగా బలోపేతమైన దగ్గర్నుంచీ స్వపక్షాన్ని కుబేరుల్ని చేసిన ఘనత ఎన్.టి.ఆర్, చంద్రబాబులదే. అంతకు ముందు అక్కడక్కడా కమ్మవారు వ్యవసాయ భూములున్న ఆసాములుగా ఉన్నా తెదేపా వచ్చాక పేద కమ్మలు కూడా ఎందరో అందలాన్నెక్కేసారు. ఉన్నవాళ్లు ఇంకా పైకి లేచారు. చేయిచ్చి పైకి లేపడమంటే ఈ కులం వాళ్ళ తర్వాతే ఎవరైనా అనే పేరు తెచ్చుకున్నారు. 

అలాంటి కులం వారు ఇవాళ రోడ్డున పడి ఉద్యమం చేస్తుంటే జనం మనసులోనే నవ్వుకుంటున్నారు తప్ప ఏ రకమైనా సానుభూతీ చూపించట్లేదు. అసలీ ఉద్యమం జరుగుతోందన్న విషయం కూడా పచ్చ పత్రికలు చూస్తే తప్ప ఎవరికీ తెలియని కూడా తెలియట్లేదు. 

కులం సంగతి పక్కన పెడదాం. అంతలా అమరావతి సెంటిమెంటుంటే మరి 2019 తర్వాత వచ్చిన స్థానిక ఎన్నికల్లో తెదేపా అమరావతి ప్రాంతంలోనే అంత దారుణంగా ఎందుకు మట్టికరుస్తుంది? 

ఆ ఎన్నికలకి ముందు చంద్రబాబు అమరావతిలో పర్యటించి..."మీరంతా వైకాపాని ఓడించాలి, తెదేపాని గెలిపించాలి. లేకపోతే అమరావతి ఉద్యమానికి విలువుండదు" అంటూ ప్రసంగాలు దంచారు. 

అయినా కూడా చిత్తుచిత్తుగా ఓడిపోయింది తెదేపా. 

అంటే రోడ్డున పడి నడిచే ఆ కొద్ది మందికి తప్ప అమరావతి రాజధాని అయినా, అవ్వకపోయినా ఆ ప్రాంతంలో ఎవరికీ పెద్దగా పట్టట్లేదన్నమాట. ఈ విషయం స్థానిక ఎన్నికల సాక్షిగా తేలిపోయాక కూడా ఇంకా అదే పాత పాట ఎందుకో! 

ఒకరి బాధ మరొకరికి వినోదం కాకూడదు. కానీ కమ్మరావతి ఉద్యమం చూస్తుంటే మాత్రం తక్కిన కులాల వారికి, తెదేపా సానుభూతిపరులు కాని వారికి వింతగా అనిపిస్తోంది. 

ఈ ఉద్యమం ఇలాగే కొనసాగిస్తూ కేవలం కమ్మవారి ప్రయోజనాలను కాపాడే పార్టీగా తెదేపా మరింత పెద్ద ముద్ర వేసుకుంటోంది. కనుక ఈ ఉద్యమం ఆ పార్టీకి అపాయమే తప్ప ఓట్లు సంపాదించే ఉపాయం మాత్రం కాదు. 

ఇంతకంటే పెద్ద ఉద్యమమే చేసారు 2019 తర్వాత. అయినా పైన చెప్పుకున్నట్టు స్థానిక ఎన్నికల్లో భయంకరమైన ఓటమి చూడాల్సొచ్చింది. ఇంత జరిగినా బాబుగారికి విషయం బోధపడకపోవడం ఆశ్చర్యం. అనవసరంగా ఇతర కులాలోని తటస్థ ఓటర్లకి దూరం కావడం తప్ప ఈ కమ్మరావతి ఉద్యమం వెలగబెట్టేది ఏమీ ఉండదు. 

హరగోపాల్ సూరపనేని

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను