అమెరికా గోల్డ్ వీసా: తీసుకుని ఏం చేయొచ్చు?

ఇలాంటి వాతావరణంలో గోల్డ్ వీసా కొనుక్కుని అమెరికాలో ఏదో చెయ్యాలనుకునేవాళ్లు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

అమెరికా అనేది ఒక్క భారతీయులకే కాదు, ప్రపంచంలో చాలా దేశాలవాళ్లకి ఒక డ్రీం డెస్టినేషన్. ఎప్పటికైనా అక్కడ స్థిరపడి డాలర్లు సంపాదించుకోవాలని కలలు కంటూ ఉంటారు చాలా మంది. వాళ్లల్లో భారతీయులది అగ్రస్థానం.

అందుకే చదువులకోసం అక్కడ వాలే విద్యార్థులు, ఉద్యాగాల ద్వారా ఆన్-సైట్ కోటాలో చేరే వాళ్లు, దొంగ దారుల్లో డంకీ రూట్ల బాపతులో అమెరికాకి వెళ్లినవాళ్లు మనకి తెలుసు.

వీళ్లతో పాటు ఎన్నో ఏళ్లుగా ఈబీ5 విసా అని ఒకటుంది. ఎంచుకున్న ప్రాంతాన్ని బట్టి సుమారు మొత్తం కలిపి (అన్ని రకాల ఫీజులతో పాటు) 9 నుంచి 11 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఆ డబ్బుని అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తే ఈబీ5 అనే వీసా ఇస్తారు. అంటే అది పెట్టుబడిదారుల వీసా అన్నమాట. అలా ఆ డబ్బుతో ఏదైనా కంపెనీ పెట్టి అక్కడ ఉపాధి కల్పించాలి..లాంటి లెక్కలేవో ఉంటాయి. ఆ ఈబీ5 విసా ఉంటే, గ్రీన్ కార్డ్ పొందడం తేలిక..కావాలంటే సిటిజెన్షిప్ కూడా త్వరగా పొందే అవకాశముంటుంది. ఆ బాపతులో ఇన్నేళ్లు అమెరికా వెళ్లి స్థిరపడినవాళ్లు ఎవరి సర్కిల్లో చూసినా తక్కువమందే ఉంటారు.

ఒకవేళ ఈ రకం వీసా తీసుకున్న కూడా దానిని టూరిజం కోసం తప్ప అమెరికాలో శాశ్వత జీవితం కోసం వాడుతున్నవాళ్లు తక్కువ. బాగా ధనికులు తమ పిల్లల చదువులకి, చదువయ్యాక వాళ్లు చెయ్యాలనుకునే స్టార్టప్ వ్యాపారాలకి అడ్డం లేకుండా ఉండడానికి ఈ రకం వీసా తీసుకుంటున్నారు. ఒక్క వీసా కొనుక్కోవడానికే ఆ మాత్రం ఖర్చు పెడుతున్నారంటే వాళ్లకి కనీసం తక్కువలో తక్కువ 50 కోట్ల పై చిలుకు ఆస్తి ఉండనే ఉంటుంది. అంత డబ్బున్నవాళ్లకి అమెరికాలోకంటే ఇండియాలోనే ఎక్కువ సుఖాలు పొందచ్చు. ఆ సంగతి వాళ్లకీ తెలుసు. అందుకే దానినొక ఆప్షన్ గానో, లేక పిల్లల కోరిక మేరకో పెట్టుకుంటున్నారు కొందరు.

ఇప్పుడు ఈ ఈబీ5 ని స్క్రాప్ చేసి “గోల్డ్ వీసా” ని ప్రవేశపెడుతున్నాడు ట్రంప్. దీని ఖరీదు ఏకంగా రూ 44 కోట్ల రూపాయాలు. అంటే ప్రస్తుత ఈబీ5 విసా ఖరీదు కంటే సుమారు నాలుగు రెట్లు ఎక్కువ. ఇది మొత్తం కలిపా, లేక ఫీజులు గట్రా కలిపి ఇంకా పెరుగుతుందా అనేది అప్పుడే తెలీదు.

అంటే అంత పెట్టి గోల్డ్ వీసా కొనాలంటే వాళ్ల వర్త్ కనీసం ఐదారొందల కోట్లైన కనిష్టంగా ఉండుండాలి. అప్పుడే ఆ దిశగా ఆలోచించగలుగుతారు. కానీ అంత పెట్టి కొని ఏం చేసుకోవాలి? మళ్లీ పైన చెప్పుకున్నదే. తమ పిల్లలకి అమెరికా చదువులు, వ్యాపారాలు కావాలనుకుంటే మార్గం సుగమం చేసుకోవడానికి వాడుకోవాలంతే. లేదా అమెరికాలో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తృతపరిచి, ట్రంప్ కోరుకుంటున్నట్టు అక్కడ ఉపాధి అవకాశాలు పెంచి, ఇండియాలోకంటే ఎక్కువగా సంపాదించి, అమెరికన్ ట్యాక్సులు కట్టి సంబరపడాలి.

ఇక్కడ ట్యాక్సుల విషయంలో మాత్రం కాస్త వెసులుబాటిస్తున్నాడు ట్రంప్. అదేంటంటే, “ఫారిన్ ఆదాయం” మీద ట్యాక్స్ వేయడట. అంటే ఏంటి? ఉదాహరణకి ఒక అమెరికన్ సిటిజెన్ కి ఇండియాలో కూడా గణనీయమైన ఆదాయం ఉందనుకుందాం. ఆ ఆదాయం మీద ఇండియాలో కట్టాల్సిన 35% ట్యాక్స్ కట్టాడనుకుందాం. అమెరికాలో ట్యాక్స్ 45%. అంటే ఆ డిఫెరెన్స్ 10% కట్టి తీరాలి అమెరికాలో. అందరికీ ఇన్నాళ్లూ సాగుతున్నది అదే. కానీ గోల్డ్ వీసా కొనుక్కున్నవాళ్లకి ఆ 10% కట్టించుకోడట. ఆ రకంగా వెసులుబాటే. కానీ ప్రాధమికంగా అమెరికన్ ఆదాయం మీద కట్టాల్సిన 45% శాతం యథాతధమే. అందులో ఏమీ రాయితీ గురించి చెప్పలేదు.

సరే ఉన్నంతలో బానే ఉందనుకుందాం. కానీ అమెరికాలో కంపెనీ పెట్టి ఉపాధి కల్పించాలంటే లేబర్ ఎక్కడ? ఇన్నాళ్లూ ఉండేవాళ్లు. ఇప్పుడు వాళ్లందరినీ ఇల్లీగల్ వలసదారులని తోలేస్తే ఎవర్ని పెట్టుకుని వ్యాపారం చేయాలి? “అమెరికా ఫస్ట్” నినాదంతో లోకల్స్ కి ఉద్యోగాలివ్వాలంటే “కనీస వేతనాల” లెక్కలతో జీతాలకే తడిసిమోపెడవుతుంది. ఇంక పెట్టే పరిశ్రమ ఏంటి? చేసే వ్యాపారమేంటి? కట్టే ట్యాక్స్ ఏంటి? పొందే లాభమేంటి?

సుమారు 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసి అమెరికన్ గోల్డ్ వీసా కొనుక్కునే వాళ్లు ఎంతమంది ఉంటారులే..అనుకుంటే ట్రంప్ ఏకంగా కోటి గోల్డెన్ వీసాలు అమ్ముతానంటున్నాడు. అసలు ఆ స్థాయి ధనవంతులు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉంటారు? లెక్కలు చూస్తే అమెరికా కాకుండా బయటి దేశాల్లో మొత్తం కలిపి నెట్ వర్త్ రూ 250 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ ఉన్నవాళ్లు సుమారు 2,77,000 మంది ఉన్నారని ఒక అంచనా. వాళ్లంతా ఈ గోల్డెన్ వీసాకి టార్గెట్ మార్కెట్ అనుకున్నా కూడా…వారిలో అందరికీ గోల్డ్ వీసా కొనుక్కోవాలన్న ఆశ, సరదా, అవసరం ఏర్పడదు. వారిలో ఎంతమంది కొనుక్కుని తరిస్తారో తెలీదు. మరి ట్రంప్ కోటి గోల్డ్ వీసాలు ఎలా అమ్ముతాడో, ఆయన లెక్కలేవిటో?

ఇదే విషయం ప్రస్తావిస్తే..వ్యక్తిగతంగా కాకపోయినా, నేట్ వర్త్ తో సంబంధం లేకుండా హై లెవెల్ ట్యాలెంటెడ్ ఎంప్లాయీస్ ని అమెరికాకి పర్మనెంట్ గా రప్పించడానికి యాపిల్ లాంటి కంపీనీలు వాళ్లకి గోల్డ్ వీసాలు కొనిపెడతాయని అంటున్నారు. ఏమిటి? రూ 50 కోట్లు ఖర్చు పెట్టా? అలా అనుకున్నా ఎంతమంది ఉంటారు ఆ కేటగరీలో?

అల్రెడీ 2.5 లక్షల మంది ఈ గోల్డ్ వీసా కొనుక్కోవడానికి లైన్లో ఉన్నారంటూ కొందరు ట్రంప్ అనుయాయులు చెప్తున్నారు. అదంతా మార్కెటింగ్ డ్రామా అని కొట్టి పారేస్తున్నవారూ ఉన్నారు.

సరే, ఇదంతా ఒకెత్తైతే…ఇక్కడ పెద్ద సెక్యూరిటీ ఇష్యూ ఉంది. రూ 50 కోట్లు పారేసి టెర్రరిస్టులు గోల్డ్ వీసా కొనుక్కుని అమెరికాకొచ్చేస్తే పరిస్థితి ఏంటి? యాపిల్ లాంటి కంపెనీలు తమ ఎంప్లాయీస్ కి ఏమో కానీ, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మాత్రం తమ వాళ్ల కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టడానికి వెనకాడవు. ఎన్ని రకాల బ్యాక్ గ్రౌండ్ చెక్స్ చేసినా గోల్డ్ వీసా తీసుకుని అమెరికాలోకి అడుగుపెట్టేవాడి ఆలోచన ఏమిటో చెప్పడం కష్టం. పైగా ఎక్కువ గోల్డెన్ వీసాలు అమ్మి అమెరికన్ ఖజానా నింపాలన్న ట్రంప్ ఆరాటం వల్ల బ్యాక్ గ్రౌండ్ చెక్స్ కూడా అటకెక్కొచ్చు. అది ఇంకా ప్రమాదకరం.

ట్రంప్ వస్తే తమ దేశానికి ఏదో గొప్ప జరుగుతుందని అమెరికన్ల ఆశాభావం. ఆ దిశగానే ట్రంప్ కూడా ఆలోచిస్తున్నాడు. కానీ తన విప్లవాత్మక నిర్ణయాలు ఎటువంటి కొత్త చిక్కులు తెచ్చిపెడతాయన్నది చూడాలి.

ట్రంప్ నెగ్గగానే అమెరికన్ స్టాక్ మార్కెట్లు పైకి లేచాయి, బిట్ కాయిన్ విలువ కూడా ఆకాశాన్ని అంటింది. కానీ సడెన్ గా అమెరికన్ స్టాక్ మార్కెట్స్ లో నిన్న రక్తకన్నీరు..మార్కెట్ ఢమాల్ అంది. బిట్ కాయిన్ కూడా నీరసించి కిందకి పడింది. ఇన్వెస్టర్లు గుండెలు పట్టుకుని కూర్చున్నారు. దానికి కారణం అమెరికాలో నిరుద్యోగాలకి సంబంధించిన కొన్ని ప్రకటనలు. కాస్ట్ కటింగ్ పేరుతో ట్రంప్ వరుసపెట్టి ఫెడెరల్ ఉద్యోగాలు పీకేస్తున్నాడు. దానివల్ల నిరుద్యోగులు పెరుగుతున్నారు. ఆ భయం స్టాక్ మార్కెట్ మీద పడుతోంది. ఇంతకీ ఇంతేసిమంది ఉద్యోగుల్ని పీకేయడమెందుకు అంటే బైడెన్ చేసిన పనే అంటున్నారు.

దేశంలో నిరుద్యోగ శాతం తగ్గించడం కోసం బైడెన్ హయాములో ఫెడెరల్ ప్రభుత్వ ఉద్యోగాల్లో లెక్కలేనంత మందికి ఫేక్ ఉద్యోగాలు ఇచ్చేశాడట. వాళ్లు కనుక పదేళ్లు సర్వీసు పూర్తి చేస్తే, జీవితాంతం పెన్షన్లు ఎంజాయ్ చేస్తూ హాయిగా బతికేయొచ్చు. అది ప్రభుత్వం మీద విపరీతమైన భారం. ఆ ఖర్చు తగ్గించాలని మస్క్ సూచించడంతో ట్రంప్ సరేనని పీకేయడం మొదలుపెట్టాడు. ఇన్ని లక్షలమందికి ఉద్యోగాలు పోతే, సమాజంలో స్పెండింగ్ పవర్ తగ్గుతుంది. దానివల్ల వ్యాపారాలు వీకౌతాయి. ఫలితంగా లాభాలు చూడలేవు. ఈ లెక్కలతోనే ఇన్వెస్టర్లు స్టాక్స్ లో పెట్టిన డబ్బుని వెనక్కు లాగేస్తున్నారు. అందుకే స్టాక్ మార్కెట్ పతనమయ్యింది. కనుక ట్రంప్ నిర్ణయాలు, ప్రకటనలు ఎప్పుడు ఏ ప్రభావం చూపుతాయో తెలీదు. అమెరికన్ ఎకానమీ చాలా వాలటైల్ గా మారింది ట్రంప్ రాకతో…మంచికైనా, చెడుకైనా.

ఇలాంటి వాతావరణంలో గోల్డ్ వీసా కొనుక్కుని అమెరికాలో ఏదో చెయ్యాలనుకునేవాళ్లు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

– పద్మజ అవిర్నేని

24 Replies to “అమెరికా గోల్డ్ వీసా: తీసుకుని ఏం చేయొచ్చు?”

  1. గన్నవరం వంశీ eb5 వీసా తో ఆమెరికా లో సెటిల్ అవ్వాలనుకున్నారంట కదా..

    వెళ్ళే లోపే కధ అడ్డం తిరిగింది పాపం

  2. ముప్పావాలా కోడిపిల్ల కి మూడు రూపాయల దిష్టి అని.

    44 కోట్లా?

  3. ఈ కొత్త గోల్డెన్ వీసా తీసుకుంటే.. అమెరికా లో కంపెనీ పెట్టాలి.. ఉపాధి కల్పించాలన్న కండిషన్ ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదు..

    దయచేసి తెలియని విషయాలను ఊహించుకుని రాసేయకండి..

    ఈ కొత్త గోల్డెన్ వీసా.. కాష్ అండ్ క్యారీ టైపు.. చాలా దేశాలు పాటిస్తున్నాయి.. ఇప్పుడు అమెరికా కూడా.. అంతే..

    ..

    ఇంకో కామెడీ…

    టెర్రరిస్టులు 50 కోట్లు పారేసి గోల్డెన్ వీసా తో అమెరికా కి వచ్చేస్తారని సెక్యూరిటీ ఇష్యూ.. గురించి రాశారు..

    మరి దానికన్నా తక్కువ EB5 వీసా.. ఇన్నేళ్లు జస్ట్ 10 కోట్లు ఖర్చుతో ఆ EB5 వీసా తీసుకుని టెర్రరిస్టులు రాలేకపోయారా..? పైగా వాళ్ళు 10 మందికి ఉపాధి కల్పించాలన్న కండిషన్ కూడా ఉంది.. తమతో పాటు ఇంకో 10 మంది టెర్రరిస్టులను తెచ్చుకొనే అవకాశం ఉండింది.. మీ లెక్క ప్రకారం..

    ..

    ఇంకా బిట్ కాయిన్.. స్టాక్ మార్కెట్ అంటూ ఏదేదో రాశారు.. అది ఇంకా కామెడీ..

    పీకలదాకా కుక్కుకుని తింటే.. కక్కేస్తాం.. అదే ఇప్పుడు అమెరికా లో స్టాక్ మార్కెట్ పరిస్థితి..

    గత 16 ఏళ్లుగా బుల్ మార్కెట్ పరుగులు పెడుతూనే ఉంది.. ఎక్కడో ఒక చోట ఆగాలి..

    అది ఒక సైకిల్.. దానికి కారణాలు ఉండవు.. అప్పటికి కనపడే కారణాలు వాటికి ఆపాదించేస్తారు..

    ..

    కాబట్టి.. ఓ ఓ టెన్షన్ పడిపోయి.. తెలియనివి.. తెలిసినట్టు ఊహించుకుని రాసేయకండి..

    1. Good reply. బాగుంది నీ analysis.

      Political replies మాత్రం neevi bagundavu.

      Politics ఒక రొచ్చు.

      జగన్ మీద విపరీతమైన ద్వేషం ఎందుకు?

      1. నాకు జగన్ రెడ్డి నా ఏడేళ్ళప్పటి నుండి తెలుసు.. అప్పుడు జగన్ రెడ్డి కి 12 ఏళ్ళు..

        ఆ వయసులోనే అతనికి కోపం వస్తే.. ఇంట్లో పనోళ్ళను, ఆడోళ్లను కూడా కాలితో తన్నేవాడు.. అతని తాత రాజారెడ్డి ని కూడా అవమానిస్తూ మాట్లాడేవాడు.. చేతికి ఏది దొరికితే అది తీసి విసిరేసేవాడు..

        ఒక్కోసారి కాఫీ టేబుల్స్ తీసి జనాలను కొట్టడానికి వచ్చేవాడు..

        వైఎస్సార్ అంటే మాత్రం భయపడేవాడు.. కారణాలు నాకు తెలీదు..

        ..

        అలాంటి జగన్ రెడ్డి.. పాదయాత్ర లో ఆ ముద్దులు, ఆ స్మైల్స్ చూస్తే.. నాకు క్లియర్ గ తెలిసిపోయేది.. నటిస్తున్నాడని..

        ..

        నా పెళ్ళి 2006 లో జరిగింది.. అప్పటికే నేను టీడీపీ లో ఆక్టివ్ మెంబెర్ ని.. మా మామగారు కాంగ్రెస్ లో ఎమ్మెల్యే ..

        సీఎం స్థాయిలో ఉన్న వైఎస్సార్ వచ్చారు.. చంద్రబాబు కూడా వచ్చారు.. వైఎస్సార్ ఎంతో ఆప్యాయం గా మాట్లాడారు.. జోక్ గా చంద్రబాబు తోనే సవాల్ చేశారు .. ఈ అబ్బాయి ని కాంగ్రెస్ లో కలిపేసుకొంటా అంటూ.. ఉన్న 10 నిమిషాలు సందడి చేశారు..

        ..

        2020 లో నా బామ్మర్ది పెళ్లి జరిగింది.. అప్పుడు మా మామగారు వైసీపీ లో ఎమ్మెల్యే..

        జగన్ రెడ్డి ని పిలిచారు.. వస్తానని ఏర్పాట్లు చేసుకోమన్నారు.. ఊరంతా కట్ అవుట్ లు వేసి సెక్యూర్టీ ఏర్పాట్లు అన్ని చేసుకున్నాం.. సీఎం లెవెల్ సెక్యూరిటీ కూడా వచ్చి గ్రౌండ్ అంతా క్లియర్ చేసుకొన్నారు..

        ఆయన రాలేదు.. సెక్యూరిటీ మాత్రం పెళ్లి చూసుకుని భోజనం చేసి వెళ్లారు..

        ..

        ఆ తర్వాత కూడా పెళ్ళికి ఎందుకు రాలేదో ఒక్క మాట కూడా చెప్పలేదు..

        రెండు నెలల తర్వాత ఆ నియోజకవర్గం లో ఇంకో ఇంచార్జీ ని పెట్టారు.. అది మా మామయ్య కి అవమానం..

        6 నెలల తర్వాత ఆ ఇంచార్జీ టీడీపీ లోకి వెళ్ళిపోయాడు.. మళ్ళీ మా మామయ్య నే ఇంచార్జీ కి పెట్టారు..

        తీసేసినప్పుడు ఒక్క మాట కూడా చెప్పలేదు.. మళ్ళీ ఎందుకు పెట్టారో ఒక్క మాట కూడా అడగలేదు….

        ..

        2024 లో వైసీపీ సీట్ ఇవ్వడం లేదు అని సజ్జల తో చెప్పించారు .. సంతోషపడ్డాం..

        ఇంకో నాయకురాలి పేరు మీడియా లో వచ్చింది.. ఆవిడ కి ఇంటరెస్ట్ లేదు అని మా మామయ్యతోనే చెప్పింది..

        నా బామ్మర్ది కి చిరాకుదెంగి ఆ నియోజకవర్గం టీడీపీ కే అని తెలిసి కూడా.. “జనసేన” లో చేరిపోయాడు..

        వైసీపీ అభ్యర్థుల లిస్ట్ ప్రకటించినప్పుడు మా మామయ్య పేరు చదివారు..

        మా మామయ్య వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి.. నా బామ్మర్ది జనసేన.. ఆ ఇంటి అల్లుడు టీడీపీ లో డైరెక్ట్ గా లోకేష్ తో పనిచేశాడు..

        ..

        నిజాయితీగా చెప్పండి.. ఇదంతా చదువుతున్న నీకు చిరాకుగా అనిపించడం లేదా..

        ఇక భరిస్తున్న మాకు ఇంకెంత చిరాగ్గా ఉంటుంది..

        మీ జగన్ రెడ్డి ఓడిపోడానికి ఇంకా సాక్ష్యాలు కావాలా..?

        అతని నాయకత్వ లోపానికి ఇంకా ఆధారాలు కావాలా..?

        అతనెంత నీచుడో.. ఇంకా ఏమైనా విషయాలు తెలపాలా..?

        1. Mee Jagan reddy ani anadam thappu. Nenu Jagan reddy ni blind ga support cheyanu. Alagani TDP ni kuda support cheyanu.

          Jagan Reddy lo leader ship qualities levu anaedi naku kuda thelusu..Adi chala vishayallo prove ayindi.

          Inka human relations in politicians ki vasthe –andaru okkate..antha actione..konthamandiki action vasthundi..kontha mandiki acting raadu..raadani cheppukoleru anthe.

          1. మీరు జగన్ రెడ్డి ని ఎందుకు ఇష్టపడతారో నాకు అనవసరం మోహన్ రావు గారు..

            నేను జగన్ రెడ్డి ని ఎందుకు హేట్ చేస్తానో మీరు పలుమార్లు అడగడం వల్ల .. నేను వీలైనంతగా చెప్పడానికి ప్రయత్నించాను..

            ఆ వ్యక్తి మనిషి గా కూడా అనర్హుడు.. ఆవిషయం వైసీపీ లోనే చాలా మందికి తెలుసు..

            రాజకీయనాయకులు కొన్ని తప్పులు చేసినా .. మనిషిగా సరిదిద్దుకొంటారు..

            కానీ జగన్ రెడ్డి మనిషిగా కూడా నీచుడు.. దుర్మార్గుడు..

            ఇంటికి 30 అడుగుల గోడ ఎందుకు కట్టుకొన్నాడో.. తెలిస్తే.. రాష్ట్ర జనాలు అసహ్యించుకొంటారు.. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు ప్రజలకు తెలుస్తాయి…

  4. తల్లి మీద ఆస్తులు కోసం ఆమె అబద్ధం షెప్పింది అని కోర్టు కి వెళ్లిన కొ*జ్జా రెడ్డి కాజేసిన వేల కోట్లు డబ్బులో 50.కోట్లు అంటే చిల్లర కింద లెక్క. మరి ఆ గోల్డెన్ వీసా కి మొదటి టిక్కెట్టు మన కొ*జ్జా రెడ్డి ఎన ?

  5. కార్డ్ ఫిజికల్ నా డిజిటల్ నా..ఫిజికల్ అయితే గోక్కోడానికి బాగా కుదురుద్ది

  6. అక్క బాగా కట్నం పోసి us వెళ్లినట్టున్నావ్… ఉబుసుపోక నీకు తోచిన చెత్త అంతా రాస్తున్నావ్… కానీ ఎంటర్టైన్ చేస్తున్నావ్….

  7. అక్క బోలెడు కట్నం పోసి పోయినట్టున్నావ్..ఎందుకు ఈ ఉబుసుపోని హాఫ్ knowledge కబుర్లు..హాయ్ గ రీల్స్ చేసుకో…మిడి మిడి జ్ఞానం తో ఎందుకు **** అయిపోతావ్

    1. ఏదీ.. 50 కోట్లు పెట్టి ఫీజికల్ కార్డు తీసుకొనేది.. వీపు గోక్కోడానికి అని నువ్వు వాగినట్టా..?

      కడుపులో కుళ్ళు పెట్టుకుని.. ఎంతగా ఏడ్చి సచ్చిపోతున్నారో చూస్తే.. మా కామెంట్స్ ప్రభావం బాగా గట్టిగానే దిగుతున్నట్టు తెలుస్తోంది..

Comments are closed.