బొత్స సౌండ్ బాగా పెంచాలా?

అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లకపోవడంతో బొత్స మీదనే పెద్ద బాధ్యత భారం పడ్డాయని అంటున్నారు.

వైసీపీకి శాసనమండలి ఇప్పుడూ ఆధారంగా మారుతోంది. అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లడం లేదు. దాంతో అధికార కూటమి చేసే తప్పులను ఎత్తి చూపడానికి మండలి మాత్రమే వేదికగా ఉంది. దానిని వైసీపీ కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. మండలిలో జరుగుతున్న చర్చలలో వైసీపీ తరఫున ఎమ్మెల్సీలు బాగానే మాట్లాడుతున్నారు. వాడిగా వేడిగా ఉపన్యాసాలు ఉంటున్నాయి. కూటమి సర్కార్‌ని నిలదీస్తున్నారు. తప్పులను ఎత్తి చూపుతున్నారు.

అయితే వైసీపీ పక్ష నాయకుడు, లీడర్ ఆఫ్ అపోజిషన్‌గా ఉన్న సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాత్రం అచ్చం పెద్ద మనిషిగానే వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. ఆయన అధికార కూటమి మీద మరింత గట్టిగా టార్గెట్ చేయాల్సి ఉందని అంటున్నారు.

ఆయన, “మేము చెప్పాం, మీ ఇష్టం” అన్నట్లుగా ప్రతీ ఇష్యూ మీద తనదైన శైలిలో మాట్లాడుతున్నారు. కూటమి వైపు నుంచి కొందరు నేతలు అరెస్టులు ఉంటాయని అన్నపుడు, “చేస్తే చేసుకోండి” అని బొత్స బదులిచ్చారు. అదే సమయంలో “తప్పు చేసిన వారు వారి కర్మాన పోతారు” అని వ్యాఖ్యానించారు. ఆ విధంగా చూస్తే, తప్పులు చేసిన వారి మీదనే కేసులు పెడుతున్నారా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

మెత్తగా మెల్లగా మాట్లాడడం వల్ల సభలో వైసీపీ పక్ష నేత సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులను బాగా నిరుత్సాహపరుస్తున్నారు అని అంటున్నారు. మహిళా ఎమ్మెల్సీ అయిన వరుదు కళ్యాణి అయితే ధాటిగా మాట్లాడుతున్నారు.

బొత్స కూడా గొంతు పెంచాల్సి ఉందని అంటున్నారు. బడ్జెట్‌ను కూటమి ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. అనేక హామీలకు అందులో అరకొర నిధులే కేటాయించారని అంటున్నారు. వీటి మీద బొత్స సహా వైసీపీ ఎమ్మెల్సీలు మండలిలో నిగ్గదీయాలని వైసీపీ అభిమానులు కోరుతున్నారు. అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లకపోవడంతో బొత్స మీదనే పెద్ద బాధ్యత భారం పడ్డాయని అంటున్నారు. మరి ఆయన తన అనుభవంతో ఏ విధంగా నెట్టుకుని వస్తారో అని తర్కించుకుంటున్నారు.

26 Replies to “బొత్స సౌండ్ బాగా పెంచాలా?”

  1. సౌండ్ పెంచితే జగన్ రెడ్డే పెంచాలి..

    అలా YCP కట్టుబాట్లు దాటి.. బొత్స సౌండ్ పెంచితే.. శాసన మండలి కూడా బాయ్ కాట్ చేస్తాడని భయపడుతున్నాడేమో..

  2. కోడలి, ద్వారంపూడి, వంశి, అంబటి, రోజా, పేర్ని లాంటి వాళ్ళ లేకి మాటలకి బాగా అలవాటుపడ్డారు, బొత్స మొత్తగా ఉంటే వైసీపీ వాళ్ళకి నచ్చదు…

  3. ఆయనేమి జగన్ గారి బొమ్మ మీద గెలవలేదు ఆయనకి ఇమేజ్ వుంది అయన అవసరమే జగన్దు గారికి వుంది ఎదుటి పక్షం తో తప్పుడు వాదనలతో వెళ్లి తన పేరు పాడుచేసుకొనే మనిషి కాదు

  4. ఈయన సౌండు పెంచితె ఈయన మాట్లాడెది జనానికి అసలు అర్దం కాదు ఎమొ?

  5. సౌండ్ పెంచితే తీసుకెళ్ళి బొక్కలో వేస్తారు… వైజాగ్ లో ల్యాండ్ కేసులు బానే వున్నాయ్.. అంత అవసరమా? ఆ శాడిస్టు కోసం.

  6. గతంలో అసెంబ్లీలో జగనన్న శాసనమండలి రద్దు గురించి మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటే మంచిది ..

Comments are closed.