చంద్రబాబు ఎక్కడో లాజిక్ మిస్సవుతున్నారే..!

2024లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా.. చంద్రబాబునాయుడుకు, 2019లో ప్రజలు తనను తిరస్కరించారని ఒప్పుకోవడానికి ఈగో అడ్డు వస్తున్నట్టుగా ఉంది.

ప్రజల సానుభూతి పొందేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రకరకాల కుట్ర రాజకీయాలు చేస్తుంటారనేది చంద్రబాబునాయుడు ఆరోపణ. కొన్ని ట్రిక్కుల ద్వారా ఆయన సానుభూతి కోసం ప్రయత్నిస్తుంటారని, అలాంటప్పుడు ఆయనకు సానుభూతి దక్కకుండా తెలుగుదేశం నాయకులంతా సమర్థంగా ఆయన ప్రచారాలను తిప్పికొట్టాలని ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు.

ఇంతవరకు బాగానే ఉంది. ఈ పని ప్రతి రాజకీయనాయకుడూ చేస్తారు. తన ప్రత్యర్థి మీద ఇలాంటి ఆరోపణలు చేస్తారు. అంతవరకు ఓకే. కానీ.. జగన్ కుట్రలు చేస్తారంటూ.. చంద్రబాబు చెబుతున్న ఉదాహరణల్లోనే ఎక్కడో లాజిక్ మిస్సయినట్టుగా కనిపిస్తోంది.

‘జగన్ కుట్రల పట్ల జాగ్రత్తగా ఉండండి. 2019 ఎన్నికల సమయంలో వివేకానందరెడ్డి హత్యకు గురైతే గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేశారు. 2024 ఎన్నికల సమయంలో గులకరాయి డ్రామా ఆడారు.. 2019లో అలర్ట్ గా లేకపోవడం వల్ల మనం నష్టపోయాం.. కానీ, గులకరాయి డ్రామాను గట్టిగా తిప్పికొట్టాం. దీంతో ప్రజలు వారి డ్రామాలను నమ్మలేదు’ అని చంద్రబాబు రెండు ఉదాహరణలు చెప్పారు.

2024లో తన మీద హత్యాయత్నం జరిగినదంటూ గులకరాయిదాడిని అభివర్ణించడం గురించి.. సానుభూతి కోసం చేసిన ప్రయత్నంగా చంద్రబాబు రంగుపులమదలచుకుంటే ఓకే. కానీ.. ఆయన చెబుతున్న ప్రకారమే వివేకానందరెడ్డి మరణం తర్వాత.. వారికి ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు తొలుత గుండెపోటు అని ప్రకటించారు. సాక్షి టీవీలో కూడా అలాగే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అయితే, చిన్నాన్న హత్యను- గుండెపోటుగా అభివర్ణించి చెప్పుకుంటే జగన్ కు మైలేజీగానీ, ప్రజల్లో సానుభూతి గానీ ఎలా వస్తుంది? గుండెపోటుతో చనిపోయినా కూడా హత్య జరిగినట్టుగా ప్రచారం చేసుకుంటే.. సానుభూతి వస్తుంది గానీ.. ఇక్కడ రివర్సులో జరిగింది కదా.. అంత సింపుల్ లాజిక్ చంద్రబాబు నాయుడు ఎలా మిస్సయ్యారు.. అని ప్రజలు అనుకుంటున్నారు.

2024లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా.. చంద్రబాబునాయుడుకు, 2019లో ప్రజలు తనను తిరస్కరించారని ఒప్పుకోవడానికి ఈగో అడ్డు వస్తున్నట్టుగా ఉంది. 2019లో ప్రజలు తనను ఓడించి, జగన్ కు అధికారం కట్టబెట్టడాన్ని.. జగన్ కుట్రల ఫలితంగానే చాటిచెప్పడానికి ఆయన ఇంకా ప్రయత్నిస్తున్నారు. అప్పటి పాలన ప్రజలకు నచ్చలేదని ఇప్పటికీ ఆమోదించలేక, ఆత్మవంచన చేసుకుంటే.. అది చంద్రబాబునాయుడుకే నష్టదాయకమని ప్రజలు అనుకుంటున్నారు.

26 Replies to “చంద్రబాబు ఎక్కడో లాజిక్ మిస్సవుతున్నారే..!”

  1. As per this article, CBN did not use the word sympathy when referring to Viveka murder. So, why are you trying to create as if he is talking about sympathy. They initially tried to cover it up as heart attack because they(Avinash and others) were involved(as per CBI investigation). When they could not hide any longer, they tried to accuse CBN for the murder. What CBN was saying is they tried to hide the murder even though they knew the facts and tried to accuse innocents.

  2. అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి..

    గుండె పోటు అని నమ్మిద్దాం అనుకుంటే సునీత అడ్డం పడేసరికి

    నారాసుర రక్తచరిత్ర అని ప్రచారం చేశారు.. సి-బి-ఐ విచారణ జరిపించాలన్నారు..

    అధికారం లో కి వచ్చాకే ఏం జరిగిందో అంతా చూశాము..

    గుండె పోటు కి గొడ్డలి పోటు కి తేడా తెలియదంటారా..

  3. తన పాలన వల్లే ప్రజలు ఓడించారని జగనన్న ఒప్పుకున్నాడా..

  4. తన పాలన ప్రజల కి నచ్చలేదని ఆమెదించలేక ఆత్మ వంచన చేసుకుంటే అది జగనన్న కే నష్టదాయకం అంటున్న ప్రజలు..

  5. రూమ్ లో అంత రక్తం ఉంటే, రూమ్ అంత చిందరవందరగా ఉంటే, గుండెపోటు అని ప్రాథమిక సమాచారం ఇచ్చినా ఎదవ ఎవడు?

  6. పొద్దున్న అయిందింటికి హత్య విషయం తెలిసినది అని అజయ్ కళ్ళం చెప్పారు. మరి సాయంత్రం నాలుగు దాక ఎందుకు పెట్టింది పులివెందుల చేరటానికి?

  7. పులివెందుల చేరిన గంటలో సీన్ అఫ్ ఆఫెన్సు సీన్ తో సీన్ పోలీస్ కి తెలియకుండా జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ కి ఎలా చెప్పాడు?

    1. Script లో ఏముంటే అదే చెప్పాలి కదా . ఏంటి బ్రో నువ్వు మధ్యలో కన్ఫ్యూస్ చేస్తావ్

  8. YSRCP పార్టీ ప్రముఖ నేతా, అధినేత బాబాయ్ చనిపోతే ఎలా చనిపోయారో రూఢి చేసుకోకుండా సాక్షి లో అంత హడావిడిగా ఎలావేశారు?

  9. చంద్రబాబు గారు వున్నా మాటే చెప్పారు తెలంగాణ ఎలక్షన్ లో ఆంధ్ర పోలీస్ లను పోలింగ్ నాడు నాగార్జున సాగర్ డాం మీదకు పంపి గేట్ లు ఎత్తే ప్రయత్నం ఎందుకు చేసినట్టు ప్రాంతీయ విభేదాలు సృష్టించి అక్కడ కెసిఆర్ లబ్ది పొందే లాగా చేయాలనే కదా ఇది జనాలకు అర్థమై కెసిఆర్ కు తిరగేసి కొట్టేరు ఈయన గారి హెల్ప్ లేకుండా వెళ్లుంటే కెసిఆర్ కి ఇంకా కొన్ని సీట్స్ పెరిగేవి

  10. పెళ్ళాం ర0కు మొగుడే యేసేసాడు కాబట్టి గుండెపోటు కథలతో తమ్ముణ్ణి రక్షించకపోతే next భలి అయ్యేది తానే అని క్లియర్ గా అర్థం అయ్యింది. పాపం.. చనిపోయిన చిన్నాన్న కూతురికి నిజం తెలిసి ఎదురుతిరిగే సరికి నారాసుర రక్త చరిత్ర అంటూ డ్రామా ఆడి ఎన్నికల్లో సానుభూతి పొంది లాభపడ్డాడు రా ‘ఎదవ GA వెంకీ..

  11. ఆత్మ వంచన అంటే .. ఈవీఎం వాళ్ళ ఓడిపోయాం అని, జనాలు పాలనా నచ్చక ఓడించారు అని ఒప్పుకోలేక పోవడం వెంకట్రావు

    1. కాల్ బాయ్ జాబ్స్ >>>ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

    2. ఆహా ఏం డెడికేషన్ . ఎవ్వడు ఎలాగైనా పోనీ నీ స్టాండ్ మార్చుకోకు . పైన ఆర్టికల్ కి నీ అడ్వర్టిస్మెంట్ కి ఏమైనా సంబంధం ఉందా???

  12. అయన చెప్పెది ఎమిటి అంటె.. బాబాయిని చావకొట్టి.. దీని వెనకాల చంద్రబాబు, లొకెష్ లె ఉన్నారు అని ప్రచారం చెయటం!

    .

    నీకు తెలిసినా ఎమి తెలియనట్టు డ్రామాలు ఎందుకు రా GA? నువ్వు లాగిక్ మిస్స్ అవుతున్నవా? చంద్రబాబా?

    1. ప్రపంచమే ఒక నాటకరంగం అందులో అందరూ డ్రామా ఆర్టిస్టులే . వీరిది కూడా ఒక సపోర్టింగ్ రోల్ . మనమంతా కేవలం ప్రేక్షకులం .

  13. 11 reddy next steps 1. మత కలహాలు 2. కులాలు కొట్లాట 3. బీహార్ గ్యాంగ్ తో రేప్, మర్డర్స్, దొంగతానాలు, దారి దోపిడులు. 4. కలకత్తా రౌడీలు తో గుళ్ళ పై దాడులూ

Comments are closed.