అయ్యా లాయరూ! ఔరంగజేబంటే చంద్రబాబు

చంద్రబాబు అరెస్టు ఏమో కానీ..ఈ సందర్భంగా సిద్ధార్థ లూథ్రా పేరు మాత్రం జనానికి తెలిసింది.  Advertisement ఈయన అన్ని కేసులు వాదించాడు, ఇన్ని కేసుల్లో తన క్లైంట్స్ కి శిక్షపడకుండా తప్పించాడు అంటూ పచ్చపత్రికలు…

చంద్రబాబు అరెస్టు ఏమో కానీ..ఈ సందర్భంగా సిద్ధార్థ లూథ్రా పేరు మాత్రం జనానికి తెలిసింది. 

ఈయన అన్ని కేసులు వాదించాడు, ఇన్ని కేసుల్లో తన క్లైంట్స్ కి శిక్షపడకుండా తప్పించాడు అంటూ పచ్చపత్రికలు ఆయన గొప్పతనాన్ని తెగ రాస్తున్నాయి. 

ఎందుకంటే ఆయన బాబుగారి లాయర్ కనుక. ఇంత మందాన ఫ్రీ పబ్లిసిటీ పొందడానికి ఆయనకున్న ఏకైక క్వాలిఫికేషన్ అదే. 

అయితే తాజాగా ఆయనగారు ఒక ట్వీట్ చేసారు. నేరుగా ట్వీటేయకపోయినా, ఎవరో చేసిన ట్వీట్ ని చూపిస్తూ “మోటో ఫర్ ది డే” అని ప్రకటించారు. 

ఇంతకీ ఆ ట్వీట్ ఏంటని ఆరా తీస్తే- “ఎంత ప్రయత్నించినా న్యాయం లభించకపోతే, అప్పుడు కత్తి తీయడమే సరైన పని. కత్తితో యుద్ధం చేయడమే సరైనది” అని ఉంది.  ఆ వాక్యాలు ఔరంగజేబుకి వార్ణింగ్ ఇస్తూ గోవింద్ సింగ్ రాసిన ఉత్తరంలోనివని కూడా అదే ట్వీటులో ఉంది.  

అంటే ఏమిటి? ఔరంగజేబ్ తమని హింసిస్తుంటే సహించి సహించి ఇక భరించలేక కత్తులేసుకుని తిరగబడతామని గోవింద్ సింగ్ చేసిన హెచ్చరిక అన్నమాట. అదెప్పుడో రాజులకాలం నాటి సంగతి. ఇప్పుడు మనమున్నది ప్రజాస్వామ్యంలో! 

ఇక్కడ లూథ్రా ఉద్దేశంలో ఔరంగజేబంటే ఎవర్ని మనసులో పెట్టుకుని అన్నాడో చెప్పలేదు. పాపం ఆయనకి ఆంధ్రప్రదేశ్ చరిత్ర తెలిసుండదు.

స్వర్గీయ ఎన్.టి.రామారావే స్వయంగా తన అల్లుడు చంద్రబాబు ఎంత కుట్రదారుడో చెబుతూ ఔరంగజేబుతో పోల్చాడు. ఆ వీడియో యూట్యూబులో ఇప్పటికీ ఉంది. కనుక తెలుగు ప్రజలకి ఔరంగజేబనగానే గుర్తొచ్చేది చంద్రబాబే. 

ఈ ట్వీట్ చేసే ముందు లూథ్రా పక్కనున్న లోకేష్ ని అడిగినా ఆపేవాడేమో!

“అది మా తాత మా నాన్నకిచ్చిన బిరుదు. మీరు ఇంకెవర్నో మనసులో పెట్టుకుని అన్నా జనం కనెక్ట్ కారు. గబుక్కున మీరు మా నాన్ననే అన్నారని అనుకుంటారు” అని వివరంగా చెప్పేవాడు. 

కానీ అలా అడక్కుండా పెట్టడం వల్ల ఇప్పుడు అదే అయోమయం చోటు చేసుకుంది. లూథ్రాకి, చంద్రబాబుకి ఏమన్నా చెడిందా అనుకుంటున్నారు జనం. పేమెంటేదైనా లేటైతే తనకి న్యాయం జరగలేదనే ఆక్రోశంతో బాబుని ఇలా బెదిరిస్తున్నాడా అంటూ ఏదేదో ఊహించుకుంటున్నారు. 

నర్మగర్భంగా ఏదో చేస్తే గర్భం వచ్చిందంట..అట్టా ఉంది తెలుగుదేశానికి చెందిన హిందీ లాయర్ యవ్వారం. 

అయినా ఒక లాయరేంటి, ఇట్టా హింసని ప్రేరేపించడమేంటి? కోర్టులో న్యాయం దొరక్కపోతే కత్తితో పొడవాలంటన్నాడా? ఎవుర్ని పొడవాలి? ఒక కేసు జరుగుతుండగా ఇట్టాంటి ట్వీటులు ఏ వర్గం జనానికి ఎట్టా అర్ధమవుతాయో ఎవరికి తెలుసు? 

రాం గోపాల్ వర్మ కూడా ఇదే అంటా ఉన్నాడు. “ఏందయ్యా! తెలుగుదేశం జనాల్ని ఆయుధాలు పట్టుకుని పోలీసుల మీద, న్యాయవ్యవస్థకు చెందినోళ్ల మీద దూకమని చెప్తున్నావా” అంటూ ట్వీట్ చేసాడు. 

నిజమే. అట్నే అనిపిస్తా ఉంది. గౌరవనీయ న్యాయమూర్తులు ఈ లాయర్ ని ఒక చూపు చూడాలి. 

పోనీ “ఈ సందర్భంగా అనలేదు..ఏదో ఊసుపోక చేసిన ట్వీట్ అది”..అని ఆ లాయరు తప్పించుకోవచ్చు, లాయరు కదా! 

అయినా కానీ..న్యాయం దొరక్కపోతే కత్తిపట్టుకోమని చెప్పడం ప్రజాస్వామ్యంలో ఒక సుప్రీం కోర్టు లాయర్ చెప్పడం ఎంత వరకు సమంజసం. అలా చెప్పబడిన చరిత్రని “మోటో” అన్నోడిని “సుమోటో” గా పిలిచి మందలించొద్దు! 

అయ్యా లాయరూ! చరిత్రలో ఔరంగజేబు కథలాపి నీ ఔరంగజేబు నీ జేబులో ఎంత పెట్టాడో లెక్కేసుకుని నీ పని నువ్వు చెయ్యి. అయినా ఈ కేసులు ఇప్పట్లో తేలేవి కావని నీకూ తెలుసు. హాయిగా ఫీజులు దండుకో!

“పాండవుల సంపాదన కౌరవుల తద్దినాలకే సరిపోయింది” అని ఒక సామెతుంది. అదేమో గానీ, చంద్రబాబు సంపాదన మాత్రం నీ ఫీజులకి సరిపోయేట్టుంది. 

చివరిగా ఒక మంచి మాట. 

“మొగల్ సామ్రాజ్యం ఔరంగజేబుతో పతనమయ్యింది. తెలుగుదేశం చంద్రబాబుతో అంతమవుతోంది”.  

– బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్యే