చరిత్ర అంటే ఏంటో తెలుసా బాలయ్య !

చరిత్ర అంటే అర్థం తెలియని వారు చరిత్ర గురించి మాట్లాడుతున్నారు.  వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్‌ షోలో బాలయ్య  మాటలు చరిత్రను వక్రీకరించేలా..? చరిత్ర అంటే 1982 నుంచే ప్రారంభం అయింది అనేలా ఉన్నాయి.…

చరిత్ర అంటే అర్థం తెలియని వారు చరిత్ర గురించి మాట్లాడుతున్నారు.  వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్‌ షోలో బాలయ్య  మాటలు చరిత్రను వక్రీకరించేలా..? చరిత్ర అంటే 1982 నుంచే ప్రారంభం అయింది అనేలా ఉన్నాయి. అజ్ఙానులు మాత్రమే ఇలా మాట్లాడతారు.”పాఠ్య పుస్తకాల నుంచి చరిత్రను తీసేయాలి” అన్నారు చంద్రబాబు. అప్పుడు ఆయన  అవగాహన లేక అన్నారని అనుకున్నాను. కానీ ఆయన మాటలు వెనుక పెద్ద కుట్రే దాగి ఉంది. ఆయన ఆలోచనల వెనుక అతి పెద్ద కుట్ర నక్కి ఉంది.

కొన్నేళ్లుగా చంద్రబాబు మాటలను,  బాలకృష్ణ ప్రసంగాలను, ఎల్లో మీడియా రాతలను, చర్చలను చూసినట్లైతే విషయం స్పష్టంగా బోధ పడుతుంది. ” చరిత్ర అంటే నిజాలను భవిష్యత్తు తరాలకు తెలియజేయడం.. చరిత్ర అంటే గత కాలం నుంచి పాఠాలు నేర్చుకోవడం.. చరిత్ర అంటే గతం నుంచి భవిష్యత్తుకు నిచ్చెనలు వేయడం.. చరిత్ర అంటే భవిష్యత్తుకు నిప్పులాంటి నిజాలతో కూడిన బంగారు బాట వేయడం”. కానీ.. చరిత్ర అంటే నందమూరి చరిత్రే అన్నట్లు బాలకృష్ణ మాట్లాడటం హాస్యాస్పదంగా, జుగుప్సాకరంగా ఉంది.

భారత దేశంలో 5 వేల ఏళ్ల క్రితమే హరప్పా, మొహంజోదారో నాగరికతలు పురుడు పోసుకున్నాయి. ఈ నాగరికతలు ఈజిప్ట్, రోమ్ చరిత్ర కంటే ప్రాచీనమైనవి. కానీ..ఈజిప్ట్, రోమ్ కంటే అడ్వాన్స్‌డ్ నాగరిత హరప్పా, మొహంజోదారో నాగరికతలు. శ్రీకృష్ణుడు 8 వేల ఏళ్ల క్రితమే భరత ఖండపై నడియాడాడు అని, ద్వారకా అవశేషాలు అరేబియా సముద్రంలో సజీవంగా ఉన్నాయని నాసానే ధ్రువీకరించింది.  చరిత్ర అంటే ఇది.  అంతకంటే ముందే..రాముడు అయోధ్యను పాలించాడని చరిత్ర చెబుతుంది.

ఇక ..మన తెలుగు నేలకు వచ్చే సరికి శాతవాహనులు, కాకతీయులు, రెడ్డి రాజ్యం, గొల్కొండ నవాబులు, నిజాం నవాబులు,పోలీస్ చర్యతో హైదరాబాద్‌ సంస్థానాన్ని ఇండియాలో విలీనం చేయడం  ఇది చరిత్ర. మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోవడం.. కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం.. తెలుగు వాళ్లందరూ కలిసి ఉండాలని తెలంగాణతో కలిసి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడటం ఇదీ చరిత్ర. ఈ చరిత్రలో నందమూరి , నారా వంశాలు ఎక్కడున్నాయి  బాలయ్య..? .

నందమూరి తారక రామరావు రూ.116 కూలీ తీసుకుని సినిమాల్లో నటించారు. టిఫెన్ సరిపోవడంలేదని ప్రొడక్షన్ మేనేజర్లతో ఒక వడ ఎక్కువ వేయించుకునేవాడు ఎన్టీఆర్‌. సెట్‌లో నచ్చిన వస్తువులు, నచ్చిన డ్రెస్‌లు తీసుకెళ్లి ఇంట్లో దాచుకునేవాడు. సహజకవి, దర్శక, నిర్మాత మల్లెమాల ఆత్మ కథ చదివితే ఎన్టీఆర్‌ బుద్ది ఏంటో నేటి తరానికి తెలుస్తుంది. బాలయ్య..  మీ సోదరి భువనేశ్వరి పెళ్లి ఖర్చులు ఎవరూ పెట్టుకున్నారో తెలుసా..? 1970ల్లో హైదరాబాద్‌ శివారుల్లో నిమ్మతోటకు మొక్కలు తెచ్చి ఇచ్చింది ఎవరో తెలుసా..? దర్శక, నిర్మాత మల్లెమాల. ఆయనకు ఎన్టీఆర్‌ ఒక్క పైసా కూడా తిరిగి ఇవ్వలేదు. ఇదీ మీ చరిత్ర బాలయ్య. 

మీ ఇంట్లో కాల్పుల కేసు ఓ సారి గుర్తు తెచ్చుకో బాలయ్య. చరిత్ర అంటే అదీ. మీ ఇంట్లో కాల్పులు నిజమైన చరిత్ర. బెల్లకొండను ఎందుకు కాల్చావో నిజం చెప్పు బాలయ్య..? మీ ఇంట్లో వాచ్‌మెన్‌ ఎలా చనిపోయాడో నిజం చెప్పు బాలయ్య..? కాల్పుల కేసులు అప్పటి సీఎం  వైఎస్ఆర్ కాపాడారు అని, మీ వంశ పరువును కాపాడారని పబ్లిక్‌ మీటింగ్‌ల్లో ఎందుకు చెప్పవు బాలయ్య..? నీకు మెంటల్ పర్టిఫికెట్ ఉందని, ఆ సర్టిఫికెట్ కోర్టులో సబ్‌మిట్ చేసి కాల్పుల కేసు నుంచి బయటపడ్డానని ఎందుకు చెప్పవు బాలయ్య..? బెల్లంకొండ- నీకు మధ్య సినీ, రాజకీయ పెద్దలు రాజీ కుదిర్చారని ఎందుకు మాట్లాడవు బాలయ్య..? వైఎస్ఆర్‌ మంచి మనసుతో వ్యవహరించకపోతే ఈ రోజున నీ పరిస్థితి ఏంటీ బాలయ్య..? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ధైర్యం నీకుందా బాలయ్య..?

1953 నుంచి 1956 వరకు  1956 నుంచి 1983 వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్‌ పాలించింది. ఢిల్లీ నుంచి పెత్తనంపై తెలుగు ప్రజలు అప్పటికే కడుపు మండి ఉన్నారు. ఇష్టమొచ్చినట్లు ముఖ్యమంత్రులను మార్చడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో 1983లో ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్‌ సమర్ధ నాయకుడే అయితే..నాదెండ్ల భాస్కర్‌ రావు ఎందుకు తిరుగుబాటు చేశారు..? ఎన్టీఆర్‌ కేబినెట్‌లో మంత్రులు ఎందుకు తిరుగుబాటు చేశారు..? 1989లో ఎన్టీఆర్‌ ఘోరంగా ఎందుకు ఓడిపోయారు..? యుగ పురుషుడు, చరిత్ర సృష్టించిన వాడైతే ఎన్టీఆర్ ఓడిపోకూడదు కదా..? ఎన్టీఆర్‌ను 1989లో ప్రజలు ఎందుకు తిరస్కరించారు..? ఈ ప్రశ్నలకు బాలయ్య సమాధానం చెప్పాలి.

ఎన్టీఆర్‌ దైవ సమానుడైతే.. నందమూరి వంశం గొప్పదైతే … ఎన్టీఆర్‌ ఎందుకు వెన్నుపోటుకు గురయ్యారు..? నారా వంశం..నందమూరి వంశానికి వెన్నుపోటు పొడుస్తుంటే ..వెన్నుపోటు బావ వైపు ఉన్న నందమూరి వంశీకుల తొడలు కొట్టేది..? చరిత్ర పుస్తకాల్లో ఎన్టీఆర్‌ నాయకుడే కాదు అని రాస్తారు. నందమూరి వంశం బావకు బానిస వంశం అని భవిష్యత్తు తరాలు చర్చించుకుంటాయి. ఎన్టీఆర్‌ దగ్గర నుంచి చంద్రబాబు వరకూ పొత్తులు లేకుండా, అలయన్స్‌ లేకుండా ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర మీకుందా..? ఈ ప్రశ్నలకు బాలయ్య సమాధానం చెప్పాలి.

అన్‌స్టాపబుల్‌ షోను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు. బాలయ్య – బాబు  రాజకీయ పతివ్రతలమని వారికి వారే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు. వెన్నుపోటు కాదు ప్రజాస్వామ్యం కోసం తిరుగుబాటు అని చెప్పుకుంటున్నారు. నాదెండ్ల భాష్కర రావు తిరుగుబాటు చేస్తే వెన్నుపోటు, చంద్రబాబు వెన్నుపొటు పొడిస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమమా..? ఇదేనా మీరు చెప్పే చరిత్ర..? ఇదేనా బాలయ్య నీవు మాట్లాడే చరిత్ర..? ఇదేనా బాలయ్య నీవు సృష్టించిన చరిత్ర..? ఎన్టీఆర్‌ – చంద్రబాబు – బాలయ్య ఒక తానులో ముక్కలే. 

వైఎస్ఆర్ స్వతహాగా డాక్టర్‌. పేదల డాక్టర్‌గా, రూపాయి డాక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. సీఎంగా 108,104, ఆరోగ్య శ్రీ లాంటి విప్లవాత్మక పథకాలు చేపట్టి లక్షల మంది ప్రాణాలు కాపాడి వారి గుండెల్లో నిలిచి పోయారు. ఎన్టీఆర్ వైద్య రంగానికి ఏ సేవలు చేశారు…? బాలయ్య సమాధానం చెప్పాలి..? ఎన్టీఆర్‌ వర్శిటీకి వైఎస్ఆర్ పేరు పెడితే తప్పేంటో బాలయ్య చెప్పాలి..? ఆ ఒక్క సంతకం మూడున్నరేళ్లలో లక్షల కోట్లు ప్రజలకిచ్చింది. ఆ ఒక్క సంతకం గ్రామ స్వరాజ్యం దిశగా ఆంధ్రప్రదేశ్‌ను అడుగులు వేయిస్తుంది. ఆ ఒక్క సంతకం..దేశంలోనే ఏపీ తల ఎత్తుకుని తిరిగేలా చేస్తుంది. ఎన్టీఆర్‌, చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారు..? మా రక్తం, మా కులం, మా వంశం అని తొడగొట్టడమే కానీ..మీరు పేద ప్రజలకు చేసింది ఏమైనా ఉందా..?

తెలుగు దేశం పార్టీ పుట్టిన తరువాతనే ఫ్యాక్షన్ పురుడు పోసుకుంది. వేలాది మంది మీ అధికార దాహంలో తలలు తెగి పడ్డారు. వేలాది మహిళల పుస్తెలు తెగిపడ్డాయి. ఈ పాపం నందమూరి వంశానిది కాదా..? ఈ చరిత్ర గురించి నీవు ఎందుకు మాట్లాడవు బాలయ్య..? వంగవీటి రంగా హత్య గురించి ఎందుకు మాట్లాడవు..? చివరకు బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి వైఎస్ జగన్ సీఎం అయిన తరువాతనే బిల్లులు చెల్లించారు. దీని గురించి పబ్లిక్‌ మీటింగ్‌ల్లో ఎందుకు మాట్లాడవు బాలయ్య..?

చరిత్ర గురించి నీవు మాట్లాడటం కాదు బాలయ్య.. చరిత్ర గురించి ప్రజలు మాట్లాడాలి. చరిత్రను మేధావులు, విద్యావేత్తలు, ప్రజలు సర్టిపై చేయాలి. నీ నోట్లోంచే వచ్చింది చరిత్ర అంటే సమాజం ఒప్పుకోదు, హర్షించదు. బాలయ్య నీ చరిత్ర ఏంటో తెలుసా..? వెన్నుపోటు చరిత్ర, ఆడవాళ్ల పట్ల అవమానీయంగా మాట్లాడే చరిత్ర, ఇతర కులాలను నీచంగా చూసే చరిత్ర, మీది కాల్పుల చరిత్ర, ఈ చరిత్ర గురించి మాట్లాడు…కూతురు వయసున్న అమ్మాయిల నడుము గిల్లి, బుగ్గలు గిల్లీ..డాన్స్‌లు వేసే నీకు చరిత్ర గురించి ఏం తెలుస్తుంది బాలయ్య..?!. సోషల్ మీడియాలో ఒక ఫొటో చూశా.. నిర్మాతలు కుర్చీల్లో కూర్చుని ఉంటే.. మీ అయ్యా.. అదే ఎన్టీఆర్‌ నేల మీద కూర్చొని ఉన్నారు.. అది బాలయ్య మీ చరిత్ర.. మీ నందమూరి చరిత్ర.

– వెంకటేశ్వర్ పెద్దిరెడ్డి. సామాజిక విశ్లేషకులు