Advertisement

Advertisement


Home > Politics - Opinion

చంద్రబాబు! ఏమిటయ్యా నీ కులపోళ్లు?

చంద్రబాబు! ఏమిటయ్యా నీ కులపోళ్లు?

చంద్రబాబుని చూస్తే ఒక్కోసారి జాలిపడాలనిపిస్తుంది. తనకి అన్ని దార్లు మూసుకుపోయినా ఎక్కడో రవ్వంత ఆశ పవన్ కళ్యాణ్ రూపంలో కనపడింది. రాజకీయ దత్తపుత్రుడిగా అతనిని పెంచుకుంటున్న వాస్తవం అందరికీ తెలిసిందే. కానీ అదేంటో కాలం ఖర్మం అస్సలు కలిసి రావట్లేదు బాబుకి. 

మొన్నటికి మొన్న కందుకూరు రోడ్డు ర్యాలీలో తెదేపా నాయకుల అత్యుత్సాహం వల్ల ఏకంగా ఎనిమిదిమంది తొక్కిసలాటలో ప్రాణం వదిలారు. ఆ తర్వాత గుంటూరులో తెదేపా ఎన్నారై విభాగానికి చెందిన వ్యక్తి చీరలు పంచుతామని ఆశ చూపించి మళ్లీ తొక్కిసలాటకి తెర లేపి ముగ్గురు మహిళల చావుకి కారణమయ్యి అనేకమందిని గాయపరిచారు. 

ఇక్కడొక విషయం చెప్పుకోవాలి. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయానుభవం ఉన్న నాయకుడినని చెప్పుకుంటాడు. ఎవ్వడో ఒక బలిసిన ఎన్నారై టికెట్ ఆశించి టొకెన్లిచ్చి చీరలు కొని పంచుతానంటే దానికి తగుదునమ్మా అని చీఫ్ గెస్టుగా వెళ్లాడు. ఆలశ్యం చెసిన ఆశాభంగం టైపులో ఆ చీరలమేళాకి హైప్ క్రియేట్ చేసి మరీ తొక్కిసలాటకి దారులు వేసారు. తెదేపా నాయకత్వం ఎంత దిక్కుమాలిన స్థితిలో ఉందో అర్థమౌతోంది. 

ఇది చాలదన్నట్టు 2023 ప్రారంభమే అభాసుపాలు చేసారు అమెరికాలోని తెదేపా వీరాభిమానులు. విషయం తెలిసినవాళ్లకి సరే గానీ, తెలియని వాళ్ల కోసం సంఘటనేమిటో చెప్పుకోవాలి. 

తెదేపా వీరాభిమాని మరియు కమ్మవాడు అయిన చేకూరి (ఇతడికి కులసంఘాలకి తప్ప ఎవ్వడికీ పనికిరాని కమ్మకావరం గల వ్యక్తి అని పేరు) అనే వ్యక్తి తప్పతాగి పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్యకి దూసుకెళ్లి "జై బాలయ్య" అని అరిచాడట. అంతే, వెంటనే అటువాళ్లు "జై పవన్" అని అందుకున్నారు. ఈ లోగా తెదేపా వైపునున్న కమ్మవర్గీయులు "మిమ్మల్ని అలగాజనం అని తిట్టినా కూడా దిక్కులేక మీ వోడు (పవన్) మా వోడి (బాలకృష్ణ) కాళ్ల దగ్గరకొచ్చాడు" అంటూ అన్-స్టాపబుల్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పాల్గొన్న అంశాన్ని లేవనెత్తి రెచ్చగొట్టారట. రెచ్చగొడితే రెచ్చిపోవడం తప్ప ఆలోచన లేని కాపు వర్గీయులు తమ కండబలం చూపించారు. ఆ రకంగా ఇరువర్గాల వాళ్లు అసహ్యంగా, అన్యాయంగా, అభాసుపాలయ్యేలాగ కొట్టుకున్నారు. ఈ దొమ్మీలో ఈవెంట్ నిర్వహకుల్ని పిడిగుద్దులు గుద్దిన చేకూరిపై పోలీస్ కంప్లైంట్ చేయగానే పోలీసులొచ్చి అతనిని లొపలేశారు. వెంటనే తానాలోని కొందరు కమ్మపెద్దలు జనసేన వారి కాళ్ల వద్దకు వచ్చి కులమంటల మీద నీళ్లుజల్లి చేకూరిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

ఒకపక్కన తమ నాయకుడు జనసేనతో పొత్తు కుదుర్చుకున్నాడని తెలుసు. అయినా సరే వెళ్లి వెళ్లి పవన్ అభిమానుల్ని కెలకడమెందుకు? మందుకొడితే లోపలిమనిషిని బయటకి రాకుండా ఆపుకునే సంయమనం ఉండదా? ఎక్కడా ఆవగింజంతైనా ఇంగితం లేని, కనీస నాయకత్వపు లక్షణం లేని చేకూరిలాంటి కుహనామేధావులు చంద్రబాబుకి పెద్ద శాపంలా పరిణమించారు. చంద్రబాబో, బాలకృష్ణో అమెరికా వస్తే పక్కనే బంట్రోతులా తిరగడం తప్ప ఇతను చేసే ఘనకార్యమేంటో అమెరికాలో చాలామందికి తెలియదు. ఆ మాత్రం దానికే "పబిల్క్ ఫిగర్" అంటూ తనని తాను అభివర్ణించుకుంటాడు సోషల్ మీడియాలో.  

కోస్తాంధ్రలోని కొన్ని రాజకీయచారిత్రకాంశాల కారణంగా కమ్మలకి, కాపులకి పడి చావదు. దానికి తోడు ఇరువర్గాల్లోనూ పేరొందిన పెద్ద సినిమా హీరోలుండడం వల్ల ఆ వైరానికి ఇంకాస్త గాలి తోడౌతోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు తెలివి అటకెక్కినట్టే ఉంది. కమ్మలు, కాపులు పాలునీళ్లు మాదిరి కాదు ..కలిపేసి తాగేయడానికి. ఆ రెండు వర్గాలూ ఎప్పుడూ కలవవు. పోనీ దిక్కులేక కలుపుకుందామనుకుంటే కిందనున్నవాళ్లు ఊరమాసుగా కొట్టుకోవడం దరిద్రాల్లోకెల్లా దరిద్రం. అమెరికాలో కమ్మ-కాపు వర్గాల వాళ్లు కొట్టుకోవడమంటే అది తెలుగువారికే తలవొంపులు. 

బాలకృష్ణకూడా కూడా ఎంతటి డేడ్ దిమాక్ ఆలోచన చేసాడో ప్రస్తావించుకోవాలి. మైత్రీ బ్యానర్ వాళ్లు వీర సింహారెడ్డి సినిమాని డిసెంబర్ 2022 విడుదలకి ప్లాన్ చేసి వాల్తేర్ వీరయ్యని సంక్రాంతి 2023 కి ప్లాన్ చేస్తే, బాలకృష్ణ బలవంతాన తన వీరసింహారెడ్డిని కూడా సంక్రాంతికే విడుదలచేయమన్నాడు. దీంతో ఒక్క రోజు తేడాతో రెండు సినిమాలు విడుదల చేస్తున్నారు మైత్రీవాళ్లు. ఇద్దరు హీరోలూ రెండు సామాజిక వర్గాలకి ప్రతీకలు. పోటీ ఉంటుంది, పోలికలుంటాయి...గొడవలౌతాయి. అమెరికాలో జరిగిన కొట్లాటల్లాంటివి ఆంధ్రలో కూడా జరిగే అవకాశాలుంటాయి. దీనివల్ల ఎవరికి లాభం? ఒక పక్క రెండు సామాజిక వర్గాలు కలిసిపోయి ఏదో రాజకీయయుద్ధం చెయ్యాలనుకుంటూ ఈ పోటీలు, కలహాలు అవసరమా? బుర్రలేని బాలయ్య, అతనిని ఆపలేని చంద్రయ్య కలిసి తమ పార్టీని నిర్వీర్యం చేసుకుంటున్నారు. 

కొన్ని గుణాలని గంపగుత్తగా కులాలకి ఆపాదించడం కరెక్ట్ కాదు. కానీ ఎటువంటి గుణాలున్న నాయకుల నీడలో ఆయా కులాల వాళ్లు నడుచుకుంటారో దానిని బట్టి ఆ గుణాల్ని ఆయా కులాలకి ఆపదించడం జరుగుతుంది. కమ్మవారిలో విజ్ఞులు, వివేకవంతులు, పండితులు, కళాకారులు, శాంతికామకులు, శ్రామికులు ఎందరో ఉన్నారు. కానీ ఆ కులానికి కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న తెదేపాని నడుపుతున్నవారు, ఆ కిందనున్న వాళ్లు... కుట్రదారులు, వెన్నుపోటు వీరులు, అవకాశవాదులు, దుర్మార్గులు, స్వార్థపరులు అవడం చేత కమ్మవారిందరికీ ఆ మకిలి అంటుతోంది. 

అలాగే కాపుల్లో మేధావులు, చదువరులు, వక్తలు, పోరాటయోధులు, కళాకారులు ఎందరో ఉన్నారు. కానీ ఆ కులానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న జనసేన నాయకుడు దాసోహం టైపులో చంద్రబాబుకి ఊడిగం చేయడం వల్ల, వేదికలెక్కి "కొడకల్లారా!" అంటూ అలగా స్పీచులివ్వడం వల్ల ఆ కులానికి అంటకూడని మసి అంటుతోంది. 

కమ్మలైనా, కాపులైనా తమ కులానికి ప్రాతినిథ్యం వహిస్తున్నవారు ఎలా ఉన్నారో చూసుకోవాలి. వాళ్లని చక్కదిద్దుకోవాలి. అంతే తప్ప "యథా రాజా తథా ప్రజా" ని ఫాలో అయిపోతామంటే రాను రాను తక్కిన కులాల మనసుల్లో తమ కులాలకి సరైన స్థానం లేకుండా చేసినవారౌతారు. 

హరగోపాల్ సూరపనేని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?