లూ’స్లీప‌ర్‌’

లూసిఫ‌ర్ న‌చ్చ‌డానికి కార‌ణం ఎమోష‌న్‌. పార్ట్‌-2లో లేనిదే అది.

లూసిఫ‌ర్ -2 చూడ‌డానికి మొద‌టిరోజు ఉద‌యాన్నే వెళ్లాను. థియేట‌ర్ ఫుల్‌గా వుంది. మోహ‌న్‌లాల్ అభిమానం మ‌న‌కి కూడా బాగానే వుంది. సినిమా స్టార్ట‌యింది. నా ప‌క్క‌న ఒకాయ‌న కూచున్నాడు. టైటిల్స్ ప‌డిన కాసేప‌టికే ఆయ‌న నిద్ర‌పోయాడు. ఆయ‌న నిద్ర ఆయ‌నిష్టం. కానీ గుర‌క మ‌న‌కి క‌ష్టం. సినిమాలో భారీ శ‌బ్దాలు వుండ‌డంతో కాసేపు విన‌ప‌డ‌లేదు. దృశ్యం వ‌చ్చిన‌పుడు మాత్రం మ‌న‌వాడు గుర‌గుర‌మ‌ని చెడిపోయిన రేడియోలా సౌండ్ చేస్తున్నాడు.

అస‌లే స్క్రీన్ మీద ఏం జ‌రుగుతుందో అర్థం కాకుండా వుంటే, ప‌క్క వాయిద్యం ఒక‌టే.

నోటిని నాలుక‌ను
భ‌ద్ర‌ము చేసుకొనువాడు
శ్ర‌మ‌ల నుండి తన ప్రాణ‌మును కాపాడుకొనును

బైబిల్ వాక్యాన్ని గుర్తు చేసుకుని అత‌ని వైపు చూసాను. హాయిగా నిద్ర‌పోతూ సినిమా నుంచి కాపాడుకుంటున్నాడు. నేను అతి తెలివితో ఏదో వుంద‌ని చూస్తున్నాను. ఏమీ లేద‌ని అత‌ను మొద‌టి నిముషాల్లోనే గుర్తించాడు. జ్ఞాన‌వంతుడు.

అర‌గంట త‌ర్వాత అన్ని స్పీక‌ర్ల నుంచి భారీ శ‌బ్దాలు వినిపిస్తే అనివార్యంగా లేచి “మోహ‌న్‌లాల్ వ‌చ్చాడా” అని అడిగాడు. ఇంకా రాలేద‌న్నాను. ఇది లూసిఫ‌ర్‌-2 నే క‌దా అన్నాడు. అవున‌న్నాను. నింపాదిగా మ‌ళ్లీ నిద్ర‌పోయాడు.

ప‌ది నిమిషాల త‌ర్వాత ఒక నిశ్శ‌బ్ద స‌న్నివేశం వ‌చ్చింది. గుర‌క స్ప‌ష్ట‌మ‌య్యేస‌రికి వెనుక కూచున్న ఇద్ద‌ర‌మ్మాయిలు గుస‌గుస‌గా “ఏంటా శ‌బ్దం” అనుకున్నారు. శ‌బ్దం కాదు గుర‌క అని స్ప‌ష్ట‌మ‌య్యేస‌రికి కిల‌కిల నవ్వారు. కామెడీ లేని సినిమాలో ప‌క్క సీటాయ‌నే కామెడీ.

గంట తర్వాత మోహ‌న్‌లాల్ రానేవ‌చ్చాడు. బిల్డ‌ప్, ఎలివేష‌న్స్‌. “మా పిల్లి మాకే మ్యావ్‌మ్యావా” అని ఒక సామెత చెబుతారు. నీలాంటోళ్ల‌ని చాలా మందిని చూశామ‌ని దాని అర్థం. ఈ మ‌ధ్య తెలుగు పెద్ద హీరోల సినిమాల‌న్నీ హైఓల్టేజీ బిల్డ‌ప్‌ల‌పైనే న‌డుస్తున్నాయి. క‌థ‌ని మ‌న‌మే వెతుక్కోవాలి.

తెలుగు ప్రేక్ష‌కుడు ఇనుము కంటే బ‌లంగా, వ‌జ్రం కంటే గ‌ట్టిగా, పాషాణం కంటే క‌ఠినంగా రాటుదేలిపోయాడు. ఒంటిచేత్తో రైళ్ల‌ని ఆపిన హీరోల్ని చూసాడు. ఒకేసారి ప‌ది మంది రౌడీల‌ని ఆకాశానికి ఎగ‌రేసిన వాళ్ల‌ని చూసాడు. ఆయ‌న కొడితే ట్రాన్స్‌ఫార్మ‌ర్లు విరిగిపోతాయి. న‌డిస్తే భూమిలో నుంచి పొగ‌లొస్తాయి. క‌త్తి, బాంబు, బుల్లెట్‌, ఫిరంగి, మిష‌న్‌గ‌న్ ఏదీ ప‌నిచేయ‌దు. బుల్లెట్, బుల్లెట్‌కి మ‌ధ్య డైలాగ్‌లు చెబుతూ వెళ్లే హీరోల్ని చూసాం. తెలుగు వాళ్ల‌ని త‌క్కువ అంచ‌నా వేసిన మోహ‌న్‌లాల్ అంత‌ర్జాతీయ డాన్‌గా ఖురేష్ అబ్రాం అంటే మ‌నకి అంత సుల‌భంగా ఎక్కుతుందా?

ఇంత‌లో ఇంట‌ర్వెల్‌. గుర‌క మిత్రుడు లేచి అయిపోయిందా అని అడిగాడు. విశ్రాంతి అని చెప్పాను. వెళ్లి స‌మోసా, శ్యాండ్ విచ్‌, కూల్ డ్రింక్ ఒక పెద్ద ట్రేలో తెచ్చుకుని క‌స‌క‌సా లాగించి మ‌ళ్లీ నిద్ర‌పోయాడు.

నేను మొత్తం చూసాను. లూసిఫ‌ర్ న‌చ్చ‌డానికి కార‌ణం ఎమోష‌న్‌. పార్ట్‌-2లో లేనిదే అది. తెలుగువాళ్ల గొప్ప‌త‌నం ఏమంటే మ‌నం ఎవ‌రినైనా చెడ‌గొట్ట‌గ‌లం. మంచి సినిమాలు తీసే మ‌ళ‌యాళం వాళ్ల‌కి కూడా పాన్ ఇండియా తిక్క ఎక్కించ‌గ‌లిగాం.

మొత్తం మీద సినిమా అయిపోయింది. ప‌క్క‌సీటు మిత్రుడు కూల్‌గా లేచి వెళ్లిపోయాడు.

బ‌య‌ట కెమెరాల వాళ్లు త‌గులుకున్నారు. త‌ప్పించుకుంటూ వుండ‌గా “మోహ‌న్‌లాల్ యాక్టింగ్ సూప‌ర్‌, సినిమా నెక్ట్స్ లెవెల్ భ‌యా, కేక” అని జుత్తు పీక్కుంటూ ఒక‌డు అరుస్తున్నాడు.

చూస్తే మ‌న గుర‌క‌రాయుడు. వీడు రాజ‌కీయాల్లో చేర‌డానికి అన్ని విధాలా అర్హుడు.

జీఆర్ మ‌హ‌ర్షి

8 Replies to “లూ’స్లీప‌ర్‌’”

  1. బతుక్కి చిన్న ad film తీయడం చేత కానోడు ఇండస్ట్రీ హిట్ సినిమా లు తీసే వాడిని అనటం…

    తెలుగు వాళ్ళు పక్క వాళ్ళని చెడగొట్టారా….సిగ్గు లజ్జ ఏం అన్నా ఉందా రా ముసలి మొగ్గ గా…

    Indian cinema అంతా తెలుగు వాళ్ళని పొగుడుతుంటే తెలుగు వాడిగా నీకు సిగ్గు అనిపిస్తోంది ఏమో… నీ బతుక్కి ఒక్క యాడ్ ఫిలిం తీసి చూపించి రా మొగ్గ లేవని ముంజ

  2. కన్వర్ట్ గొర్రె వి ఏదో ఆశీర్వాదం అని పేరు పెట్టుకోరాదా.

    అయినా మీ శవ దేవుడికి జేజేలు.

  3. బహుశా పక్క సీట్లో పడుకున్నోడు, అన్న అభిమాని లాంటోడు.. అన్న పాలన చూడకుండా 5 సంవత్సరాలు కల్తీ మందు తాగుతూ మత్తులో గడిపేసి, ఎలక్షన్ టైమ్ లో అన్న పాలనను పొగుడుతూ అన్న కోసం ప్రాణాలిచ్చే రేంజిలో ప్రచారం చేసే గ్రేట్ ఆంధ్ర లాంటోడు

Comments are closed.