ధనవంతుల్ని దోచి, పేదలకి పంచిపెట్టే రాబిన్‌హుడ్. ఎపుడూ సక్సెస్‌ఫుల్ హీరోనే. కథ సరిగా చెబితే ప్రేక్షకులు ఎపుడూ ఆదరిస్తారు. దర్శకుడు వెంకీ కుడుముల ఈ పని సరిగా చేయక రాబిన్‌హుడ్‌ని దారి తప్పించి హీరోయిన్‌కి బాడీగార్డ్‌గా , రుద్రకొండ సంరక్షకుడిగా మార్చాడు.
గంజాయి స్మగ్లర్ నుంచి రుద్రకొండ ప్రజల్ని రక్షించడమే కథ అనుకుంటే హీరోని రాబిన్‌హుడ్ చేయడమెందుకు? అరగంట టైమ్ వేస్ట్. రాబిన్‌హుడ్ కథని రుద్రకొండకి కనెక్ట్ చేయదలుచుకుంటే, హీరో చోరీ నైపుణ్యం అక్కడ వర్కౌట్ కావాలి. ఫైటింగ్‌లు చేసే హీరోకి, రాబిన్‌హుడ్ కథకి లింక్ మిస్ కావడంతో మనం డిస్కనెక్ట్ అవుతాం. ఒకే సినిమాలో రెండు కథలు చెప్పకూడదు. ఒకవేళ చెప్పినా మెప్పించేలా చెప్పాలి. రాబిన్‌హుడ్ పాతగా అనిపించడానికి, కొత్తగా కనిపించకపోవడానికి కారణం వెంకీ కుడుముల ఏళ్లతరబడి రాసుకున్న ముతక కథ.
ఇది కామెడీనా, యాక్షనా అర్థం కాకపోవడానికి దర్శకుడు తీసుకున్న ఓవర్ లిబర్జీనే కారణం. కథ అయన ఇష్ట ప్రకారం నడిచిందే తప్ప, ప్రేక్షకుడి తెలివితేటలకి పరీక్ష పెట్టే విధంగా కాదు. క్లైమాక్స్ కూడా ఊహించుకోగలిగితే ఇక కిక్ ఏముంది?
చైల్డ్ ఎపిసోడ్స్ సినిమాని ల్యాగ్ చేస్తాయి. అనివార్యమైతే తప్ప వాటి జోలికి పోకూడదు. నలుగురికి మంచి చేయడానికి దొంగతనాలు చేసినా తప్పు లేదు అనే పాయింట్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి టైమ్ తీసుకున్న దర్శకుడు, ఆ తర్వాత దొంగతనాల జోలికే వెళ్లడు.
ఆ మాత్రం దానికి హోం మినిస్టర్, వైల్డ్ డాగ్‌లా బిల్డప్ ఇచ్చే ఇన్‌స్పెక్టర్ ఎందుకు? హీరో వెంటపడి, బ్రహ్మాండమైన ఇన్వెస్టిగేషన్ చేస్తాడనుకుంటే అడ్రస్ లేకుండా పోయిన వైల్డ్‌డాగ్, చివర్లో వెర్రిబాగులోడిలా వస్తాడు.
అతి క్రూరమైన విలన్‌ని పరిచయం చేసిన తర్వాత, అతను మళ్లీ కనపడడు. సెకెండాఫ్‌లో వప్తాడు. మరి హీరో యుద్ధం ఎవరితో? హీరోయిన్‌ని ఇంప్రెస్ చేయడానికి, పాటలు పాడడానికే అనుకుంటే, సినిమాలో అంతర్జాతీయ స్మగ్లర్లు, డాన్‌లు ఎందుకు?
సినిమాని ఎంతోకొంత రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ బతికించారు. అక్కడక్కడ అది కూడా బోర్ కొట్టినా, అది కూడా మిస్సయి వుంటే ప్రేక్షకుడు బేజారే. వెనుకటికి పెద్ద ఎన్టీఆర్ బుగ్గకి పులిపిరి పెట్టుకుని డెన్‌లోకి వస్తే రాజనాల గుర్తు పట్టలేడంటే అదో వెర్రికాలం.
ప్రపంచ సినిమానే ప్రేక్షకుడి అరచేతిలోకి వచ్చినపుడు కొమ్ములు తిరిగిన విలన్లు కూడా హీరో చేతిలో ఎందుకు మూర్ఖులవుతారు? ఆ లాజిక్‌లన్నీ వద్దు, ఇది కామెడీ సినిమా అనుకుంటే, రుద్రకొండలో అంత రక్తపాతం, దుర్మార్గాలు ఎందుకు?
ఎంత కొమ్ములు తిరిగిన వంటగాడైనా పులిహోరని చేత్తో కలపాల్సిందే. మిక్సీలో కుదరదు. రాబిన్‌హుడ్ కూడా మిక్సింగ్‌లో తేడా.
సినిమా ప్రమోషన్‌లో హీరో, దర్శకుడితో సహా ప్రతివాళ్లూ అద్భుతం చేసామని అంటూ వుంటారు. తీరా తెరమీద అవే చింతకాయ పచ్చడి, కాకపోతే డేవిడ్ వార్నర్ అనే కరివేపాకు జతకలిసింది. నిర్మాతలకి ఇదో అదనపు ఖర్చు.
ఫైనల్‌గా ఇలాంటి కథలే అవుట్‌ఫుట్ అయినపుడు ఏళ్లతరబడి రాయడమెందుకు? యూసఫ్‌గూడా బస్తీలో భుజానికి సంచి తగిలించుకున్న జూనియర్ రైటర్‌ని ఎవర్నిడిగినా చెబుతారు. ప్రేక్షకుల్ని దోచడం రాబిన్‌హుడ్‌కి అంత సులభం కాదు.
జీఆర్ మహర్షి
ఎంత కొమ్ములు తిరిగిన వంటగాడైనా పులిహోరని చేత్తో కలపాల్సిందే. మిక్సీలో కుదరదు. రాబిన్‌హుడ్ కూడా మిక్సింగ్‌లో తేడా — This is true.
Yerri po film ee site owner gadi gu elevation okati
True
హుడ్ మిస్సింగ్.. కిక్ బాయ్ ని అడగండి
పులిహోర ఉపమానం భలేగా వుంది
వాళ్ళని వీళ్లని ఎందుకు నువు చెప్పు ఒక కథ
Ga gu lo digina hood banam
Asalu ee film mundu …. Anna ga
Hi jobs vunnai job kavala reply me number pettandi nenu call chestha
Hi
Hi
Jobs vunnai manchi income intrest vunte reply me number pettandi nenu call chestha
Power star Pavan Kalyan movies quiz: https://youtu.be/4Nm6OTKSNm4
Megastar Chiranjeevi movies quiz: https://youtu.be/crQfuH0Tywc
Mega power star Ramcharan movies quiz: https://youtu.be/QEsrbd6Fd1Y
Nata Simham Balakrishna movies quiz: https://youtu.be/9hMcgg-fAig
Mass Maharaja Raviteja movies quiz: https://youtu.be/T5f-eUANVMo
NagaChaitanya movies quiz: https://youtu.be/9O_bjjU14qM
Natural star Nani movies quiz: https://youtu.be/GHX1gGNRCvE
Mahesh babu movies quiz: https://youtu.be/ciiIRnisQdE
JrNTR movies quiz: https://youtu.be/nWNhnOQYo40
AlluArjun movies quiz: https://youtu.be/dBIx1lMS6hY
Prabhas movies quiz: https://youtu.be/KmHULtleqMg