Advertisement

Advertisement


Home > Politics - Opinion

ఇలా దిగ‌జార‌డం ఆ ప‌త్రిక‌కే సాధ్యం!

ఇలా దిగ‌జార‌డం ఆ ప‌త్రిక‌కే సాధ్యం!

ఇంత ధైర్యంగా, ప‌బ్లిక్ గా దిగ‌జార‌డం ఈనాడుకే సాధ్యం! ఒక్క రామోజీరావుకే సాధ్యం! ఇంత నీఛానికి ఒడిగ‌ట్ట‌డం ఆ పెద్ద ప‌త్రిక ఈనాడుకే సాధ్యం అవుతుంది! ఎంత చ‌క్క‌గా అన్నారో చూశారు క‌దా... అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని తాకే అర్హ‌త జ‌గ‌న్ ఉందా? అంటూ ఈనాడు ప‌త్రిక జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని నిల‌దీసింది. ప్ర‌శ్నించింది, బోనులో నిల‌బెట్టింది?  నువ్వెంత, నీ బ‌తుకెంత అనే రీతిలో ఒక పూర్తి పేజీలో రెచ్చిపోయింది. అంటే అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని తాకే అర్హ‌త ఎవ‌రికి ఉందో లేదో ఈనాడు ప‌త్రిక నిర్ణ‌యిస్తుంది!

మ‌రి ఇలా నిర్ణ‌యించ‌డానికి ఈనాడుకు ఉన్న అర్హ‌త ఏమిటి?  రామోజీరావుకు ఉన్న యోగ్య‌త ఏమిటి?  ఆయ‌న‌కు ఉన్న రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన బాద్య‌త ఏమిటి? జ‌నం నెత్తురు పిండే వ‌డ్డీ వ్యాపారం చేస్తున్న వాడికి, ప‌చ్చ‌ళ్లు అమ్మి కోట్లు గ‌డించిన వాడికి, మీడియా వ్యాపారం చేస్తున్న వాడికి, ప‌చ్చి క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు తీసిన వ్యాపారికి ఆ అర్హ‌త ఉందా!

ఎన్టీఆర్ ను దేవుడు అని ప్ర‌చారం చేసింది ఈనాడే, ఆయ‌న రాక్ష‌సుడ‌ని, ప్ర‌జాస్వామ్య హంత‌కుడ‌ని, అతడికి ల‌క్ష్మిపార్వ‌తి అనే దెయ్యం ప‌ట్టింద‌ని ప్ర‌చారం చేసిందీ ఈనాడే! ఎన్టీఆర్ పై హైద‌రాబాద్ న‌డిబొడ్డును చెప్పులు వేయించినందుకు, ప్ర‌జ‌లు ఎన్నుకున్న ఎన్టీఆర్ ను అక్ర‌మంగా, అవమాన‌క‌రంగా గ‌ద్దెదింపినందుకు, దొంగ‌చూపుల చంద్ర‌బాబునాయుడ‌నే ఏ అర్హ‌తా లేని వ్య‌క్తిని తెలుగుదేశం అధ్య‌క్షుడిగా, ముఖ్య‌మంత్రిగా చేసినందుకు రామోజీరావు అనే దుర‌హంకారికి అర్హ‌త‌లు నిర్ణ‌యించే హ‌క్కు ఉందేమో!

జ‌గ‌న్ మంచివాడా, చెడ్డ‌వాడా అనే చ‌ర్చ‌ను ప‌క్క‌న పెడితే, ఆంధ్ర‌ప్ర‌దేశ్ అనే ఒక సుసంప‌న్న రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి అత‌డు, 151 మంది ఎమ్మెల్యేలతో ప్ర‌జ‌లు ఎన్నుకున్న ముఖ్య‌మంత్రి అత‌డు! జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌డితే అధికారంలోకి వ‌చ్చిన‌వాడు! బ‌డుగు జ‌నానికి తోడు, నీడ‌గా నిలిచిన‌వాడు!

పోనీ ఈనాడు లెక్క‌లో చూసినా స‌క‌ల అర్హ‌త‌లు ఉన్న‌, అభివృద్ధికి అమ్మ‌మొగుడు అయిన చంద్ర‌బాబు అంత చిత్తుగా ఎందుకు ఓడిపోయిన‌ట్టు, 23 సీట్ల‌కు ఎందుకు ప‌రిమితం అయిన‌ట్టు! అంత అమాన‌క‌ర‌కంగా ఎందుకు ఓడిపోయిన‌ట్టు?  జ‌గ‌న్ ఒక ప్ర‌త్యామ్నాయంగా నిల‌బ‌డ్డాడు! చంద్ర‌బాబునాయుడి పార్టీని చిత్తుగా ఓడించింది జ‌నం.  అది తెలుగు ప్ర‌జ‌ల తిరుగుబాటు. అక్క‌డ ప్ర‌జాస్వామ్యం ఉత్సాహంగా ప‌ని చేసింది. 

జ‌నం ఆమోదించిన నాయ‌కుడు, ప్ర‌జ‌ల విజ‌య‌హార‌తులు అందుకున్న విజ‌య‌సార‌ధి అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌కూడదా? అయ్యో! ఆవిష్క‌ర‌ణ కాదు, అస‌లు తాకే అర్హ‌త కూడా లేదంటూ ఈనాడు అనే దుర్వార్తాప‌త్రిక మొరుగుతోంది. రాజ‌మండ్రి జైలు నుంచి ష్యూరిటీ ఇచ్చి బ‌య‌ట‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జ‌ల‌కు గ్యారెంటీ ఇస్తున్నాడు. భ‌లే!

అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని తాక‌డానికి చంద్ర‌బాబునాయుడు ఒక్క‌డికే అర్హ‌త ఉంద‌ని ఈనాడు ఎందుకు రాయ‌లేక‌పోయింది? ఎందుకు జంకింది! సిగ్గుతో త‌ల‌దించుకుంది? జ‌గ‌న్ మీద బుర‌ద జ‌ల్లేస్తే చంద్ర‌బాబు మిస్ట‌ర్ క్లీన్ అయిపోతార‌ని అనుకున్న‌ట్టుగా ఉంది! అస‌లు రామోజీరావు బాధేంటంటే, ఆకాశ‌మంత ఎత్తున్న అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించి, నిరుపేద‌ల హృద‌యాల‌ను గెలిచి రేప‌టి ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ అనే తిరుగులేని నాయ‌కుడు చంద్ర‌బాబు పార్టీని తొక్కి నార తీస్తార‌ని! చంద్ర‌బాబు భ‌వితవ్యం అంధ‌కారం అయిపోతుందేమోన‌ని! లోకేష్ ఎందుకూ కొర‌కాకుండా పోతాడ‌ని!

అందుకే ఆ ఆతృత‌, ఆందోళ‌న‌ల‌తో అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని అడ్డుపెట్టుకుని జ‌గ‌న్ని భ్ర‌ష్టుప‌ట్టించాల‌నే ప్ర‌య‌త్నంతో అర్జెంటుగా ఆడిన నాట‌కం ఇది! చిత్రంగా ఇక్క‌డ భ్ర‌ష్టుప‌ట్టింది రామోజీరావు, ఆయ‌న దిక్కుమాలిన జ‌ర్న‌లిజం! 

షాక్ అండ్ సెట్ బ్యాక్ టు రామోజీరావు, ఎంత అవ‌మానం రామోజీరావుకి! అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని తాకే అర్హ‌త కూడా జ‌గ‌న్ కు లేద‌ని , ఈనాడు పూర్తి పేజీ కేటాయించి, నిరూపించి, నిర్దారించినంత ప‌ని చేశాకా, విజ‌య‌వాడ‌లో జ‌నం నేల ఈనిన‌ట్టుగా, తండోప‌తండాలుగా త‌ర‌లివ‌చ్చిన దృశ్యం చూశాం మ‌న‌మంతా, మ‌రి పోలా, ప‌రువుపోలా, ఈనాడుకు రామోజీకీ ఒకేసారి సిగ్గుపోలా!

ఆవిష్క‌ర‌ణ సంగ‌తి అటుంచి, అస‌లు అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని తాకేందుకు జ‌గ‌న్ ఎవ‌రు? అత‌నికున్న అర్హ‌త ఏమిటి? అంటూ హీనంగా, నీఛంగా ఈనాడు విరుచుకుప‌డి తిట్టి, శ‌పించిన రోజే జ‌గ‌న్ స‌భ‌కు ల‌క్ష‌ల మంది ఉత్సాహంగా రావ‌డం, విజ‌య‌వాడ పుల‌కించిపోవ‌డం, ఎంత ప‌రాభ‌వం రామోజీరావుకు, ఈనాడుకు! ఎడ్యుకేట్, ఎజిటేట్, ఆర్గనైజ్.. అంటూ అంబేద్క‌ర్ వెలుగులో బ‌డుగు జ‌నం ప‌ర‌వ‌శించిపోయిన జ‌న‌వ‌రి 19వ తేదీ బ్లాక్ డే ఈనాడుకు!

-ఓ నెటిజ‌న్ మెయిల్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?