Advertisement

Advertisement


Home > Politics - Opinion

రాజమండ్రి పార్లమెంట్ కార్యకర్తలకు విజ్ఞప్తి..

రాజమండ్రి  పార్లమెంట్ కార్యకర్తలకు విజ్ఞప్తి..

స్వప్రయోజనాలకోసం పార్టీ భవిష్యత్తు తాకట్టుపెట్టిన రాష్ట్ర అధ్యక్షురాలు ఏపీలో బీజేపీని సంపూర్ణాంగా నాశనం చేస్తుంది. టీడీపీకి బీజేపీ ఆత్మగౌరవం తాకట్టు సంపూర్ణం, సైనికుడిని మోసం చేయడం సిగ్గు అనిపించడం లేదా పురందేశ్వరి గారు.

టీడీపీ నేతల్నే బీజేపీ తరపున పోటీ పెట్టడానికి పొత్తులు అవసరమా పురందేశ్వరి? మీ లాంటి స్వార్థపరుల రాజకీయ అవసరాలు తీర్చడానికి జాతీయ పార్టీ బీజేపీ ఆత్మగౌరవాన్ని ఇంతగా దెబ్బతీయాలా?

ఆనపర్తి బీజేపీ సీటు. అక్కడ బీజేపీ హైకమాండ్ అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీకి నిబద్ధతగా పని చేస్తున్న మాజీ సైనికుడు శివకృష్ణంరాజుకు సీటు ప్రకటించారు. పొత్తు ధర్మం ప్రకారం ఆయనకు సహకరించి .. కలసికట్టుగా గెలిపించాలి. కానీ ఏం జరుగుతోంది?

వ్యూహాత్మకంగా టీడీపీ హైకమాండ్ నల్లమిల్లిని తిరుగుబాటు చేసినట్లుగా రాజకీయం చేయాలని సూచిస్తే... అంతా తెలిసి కూడా పురందేశ్వరి నిరోధించి.. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి సపోర్టు చేయాలని తేల్చి చెప్పకుండా టీడీపీ కోసమే రాజకీయం చేయడం సిగ్గు అనిపించలేదా?

ఇప్పుడు నల్లమిల్లినే తీసుకుని బీజేపీ టిక్కెట్ ఖరారు చేస్తారా?

అధికారికంగా ప్రకటించక ముందే ఆనపర్తి బీజేపీ అభ్యర్థి పోటో కాకుండా టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఫోటో ప్రచార వాహనంపై పెట్టుకుని పురందేశ్వరి ప్రచారం చేయడం సొంత పార్టీని అత్యంత ఘోరంగా అవమానించడం కాదా?

పార్టీపై అభిమానం ఉన్న వారు ఎవరైనా ఇలా చేస్తారా? కానీ పురందేశ్వరి మీరు మాత్రం చేశారు.

బీజేపీ అత్యంత బలంగా ఉన్న గోదావరి జిల్లాల్లో వ్యూహాత్మకంగా పార్టీ ఉనికి దెబ్బతీసే కుట్ర క్లియర్ గా కనిపిస్తోంది. దశాబ్దాలుగా పదవులు లేకపోయినా పార్టీ కోసం పని చేస్తున్న వారికోసం కుట్రతో  బలమైన సీట్లు తీసుకునేందుకు పట్టుబట్టలేదు.

ఇప్పుడు ఆనపర్తిని టీడీపీ నేత ముసుగు దరించి వారి ఖతాలో మీరే వేస్తున్నారు. అంటే మీ స్వార్థ కుటుంబ, ఆర్థిక అవసరాలకోసం బీజేపీ ఉనికి ప్రశ్నార్థకం చేయడం కదా !

పొత్తుల ప్రస్తావన వచ్చినప్పటి నుంచి బీజేపీలో నలభై ఏళ్లుగా పని చేసుకుంటున్న సీనియర్ నేతల దగ్గర్నుంచి సామాన్య కార్యకర్త వరకూ ఎవరి అభిప్రాయాలూ పరిగణనలోకి తీసుకోలేదు. నిన్నామొన్న పార్టీలో చేరిన వారే నిర్ణయాలు తీసుకున్నారు. వాళ్లే పోటీ చేస్తున్నారు. అరకొరగా అవకాశం వచ్చిన శివకృష్ణం రాజు వంటి వారిని అవమానించి చివరి క్షణంలో పోటీ చేస్తున్నారు.

పురందేశ్వరి మీరు బీజేపీ పగ్గాలు చేపట్టినప్పటి నుండి టీడీపీ కోసం పని చేస్తున్నారు. బీజేపీ కోసం ఓక్క రోజు పని చేయలేదు. ఇది ప్రతి సామాన్య బీజేపీ కార్యకర్త అభిప్రాయం. పార్టీని బలోపేతం చేసేందుకు ఒక్క నిర్ణయం తీసుకోకపోగా.. టీడీపీకి అనుబంధ పార్టీగా మార్చేందుకు మీరు నిరంతరం ప్రయత్నస్తూనే ఉన్నారు. కార్యకర్తల ఆత్మగౌరవాన్ని టీడీపీ కాళ్ల దగ్గర పెడుతూనే ఉన్నారు.

దేశంలో అత్యంత బలమైన పార్టీ. తిరుగులేని ఆదరణ ఉన్న పార్టీ. కానీ ఏపీలో మాత్రం టీడీపీకి అనుబంధ సంస్థలా మార్చేశారు. పొత్తులు లేకపోతే పోటీ చేయలేమని కేంద్రం పార్టీని తప్పుదారి పట్టించావు. నీ సీటు కోసం, చిల్లర డబ్బుకోసం  ఓ భారీ తప్పిదం చేసి పార్టీని ముంచేశారు.

ఆ సీట్లలో టీడీపీ నేతల్ని నిలబెట్టడం అవమానం కాదా?

కార్యకర్తల ఆత్మాభిమానాన్ని కూడా తాకట్టు పెట్టేశాక.. ఇక  ఏపీ బీజేపీకి ఏం మేలు చేసినట్లు? బీజేపీ సానుభూతి పరులు ఎవరైనా చూస్తూ చూస్తూ కూటమి అభ్యర్థులకు ఓటచేయగలరా?

పదేళ్లు కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా ఉన్న మీరు బీజేపీపై ఎప్పుడూ అభిమానం లేదు. తప్పని సరి పరిస్థితుల్లోనే పార్టీలో చేరారు. అందుకే పార్టీ ప్రయోజనం.. పార్టీకి లాభం అనే మాటే మీకు నచ్చడం లేదు. ఏపీలో పార్టీని, పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవం, ఆత్మాభినానాన్ని చంద్రబాబు కళ్ల దగ్గర పెట్టేశారు.

ఇలాంటి పరిస్థితుల్ని నిఖార్సైన ఏ ఒక్క బీజేపీ కార్యకర్త హర్షించడం. పార్టీని బతికించుకోవడానికి కీలక నిర్ణయాలు తీసుకోకుండా ఉండరు. గుర్తుంచుకోండి.. పొత్తులు పార్టీని బలోపేతం చేయాలి కానీ.. ఉనికిని దెబ్బతీయకూడదు. పార్టీలకు పరస్పర ప్రయోజనాలు కలగాలి కానీ..  ఓ పార్టీని నిర్వీర్యం చేయకూడదు.

ఇప్పటికైనా పురందేశ్వరి గారు మీరు ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా గుర్తించి.. తప్పులు దిద్దుకుంటారని భావిస్తున్నాము. కార్యకర్తలకు గౌరవం ఇవ్వాలని కోరుకంటున్నారు. లేకుంటే మీకు రాబోయే రోజులలో రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో కార్యకర్తలు ఓటుతో సమాధానం చెబుతాము.

చేగోండి, బద్రినాద్. కార్యకర్త, రాజమండ్రి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?