ఎక్కువైన శ‌నివారం

ఆరు ఫైటింగ్‌లు, 32 మంది గాలిలోకి లేస్తే అది యాక్ష‌న్ సినిమా అయిపోదు.

రెండుమూడు నిమిషాల రీల్స్ బోర్ కొడితేనే జ‌నం భ‌రించ‌లేరు. వెంట‌నే ఫోన్ మీద వేలు పెట్టి తోసేస్తారు. మ‌రి 3 గంట‌లు, సినిమా థియేట‌ర్‌లో చూడాలంటే ఎంత గ్రిప్పింగ్ వుండాలి? వ‌రుస‌గా సంబ్ర‌మాశ్చ‌ర్యాల‌కి గుర‌వుతూ, ఎమోష‌న్స్‌కి క‌నెక్ట్ అయితేనే సాధ్యం. స‌రిపోదా శ‌నివారంలో విష‌యం వుంది కానీ, గ్రిప్పింగ్ లేదు. ఎంత తెలివిగా క‌థ చెప్పినా, వూహించేసే శ‌క్తి వున్న ప్రేక్ష‌కుడికి , మొద‌టి అర‌గంట‌లోనే మొత్తం అర్థ‌మైపోతే మిగ‌తా సినిమా మీద ఆస‌క్తి వుండాలంటే ద‌ర్శ‌కుడికి చాలా తెలిసుండాలి. వివేక్ ఆత్రేయ‌కి క‌థ చెప్ప‌డం తెలుసు కానీ, ఎంత చెప్పాలో తెలియ‌దు. ప్ర‌తిదీ అర‌టి పండు ఒలిచిన‌ట్టు తినిపించి, తొక్క‌మీద కాలేసి జారిప‌డ్డాడు.

వెనుక‌టికి కెవి.రెడ్డి తాను తీస్తున్న సినిమా నిడివిని కూడా క‌రెక్ట్‌గా చెప్పి మ‌రీ తీసేవాడు. ముడి ఫిలిం ఖ‌రీదు కాబ‌ట్టి ఈ జాగ్ర‌త్త‌. అంతేకాదు ప్రేక్ష‌కుడికి ఏది కావాలి, ఎంత కావాలి స్ప‌ష్టంగా తెలియ‌డం కూడా. ఫిలిం అవ‌స‌రం లేదు కాబ‌ట్టి, తానులు తానులు తీసి పుటేజిని ఎడిట‌ర్‌కి ఇస్తే, దాన్ని క‌ట్ చేయ‌డానికి క‌త్తెర క‌న‌బ‌డ‌క‌, ఎడిట‌ర్ ప‌ని కూడా ద‌ర్శ‌కుడే చేసి ఫ‌స్టాఫ్‌కే పూర్తి సినిమా చూసిన ఫీలింగ్ క‌లిగిస్తున్నారు. పాన్‌లో వ‌క్క‌, సున్నం మ‌రిచిపోతే నోరు పండ‌దు. పాన్ ఇండియా సినిమాలో వుండాల్సింది వుండ‌క‌పోతే అది కేవ‌లం ఫ్యాన్స్ సినిమానే.

నాని అద్భుత న‌టుడు. కామెడీని, ఎమోష‌న్‌ని స‌మ‌పాళ్ల‌లో పండించ‌గ‌ల‌డు. అదే అత‌ని బ‌లం. అయితే బ‌లాన్ని గుర్తించ‌డం ఎవ‌రికీ ఇష్ట‌ముండదు. అద‌న‌పు బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించాల‌నుకుంటారు. అన్ని ర‌కాల పాత్ర‌ల్లో న‌టించ‌డం న‌టుడి ల‌క్ష‌ణ‌మే. ఎంత‌టి వాడైనా గాలిలో ఎక్కువ సేపు వుండ‌లేడు. నేల మీద మెల్లిగా దిగుతాడు, లేదా ద‌బేల్‌మ‌ని ప‌డుతాడు.

మంచి కామెడీలు చేస్తున్న నానీకి , కృష్ణార్జున‌యుద్ధం నుంచి యాక్ష‌న్ గాలి ప‌ట్టుకుంది. త‌న‌తో పాటు మేర్ల‌పాక గాంధీని కూడా యుద్ధంలో ఓడించాడు. ఇద్ద‌రికీ త‌మ బ‌లం తెలియ‌క రాక్‌స్టార్‌, విమెన్ ట్రాఫికింగ్ అని త‌మ‌కి తెలియ‌ని విష‌యాల్లో వేలు పెట్టి దారి చూడు అని పాడుతూ దారి తెలియ‌క తిక‌మ‌క ప‌డ్డారు. మంచి కామెడీ వున్న ఈ సినిమాలో ప్ర‌ధాన లోపం విల‌న్ ఎవ‌రో తెలియ‌క‌పోవ‌డం. రాక్‌స్టార్ ఎలా వుంటాడో ద‌ర్శ‌కుడికి , హీరోకి ఇద్ద‌రికీ తెలిసే అవ‌కాశం లేక‌పోవ‌డం.

శ‌నివారం సినిమాలో బ‌ల‌మైన విల‌న్ వున్నాడు. సూర్య‌, నాని ఇద్ద‌రూ పోటాపోటీగా న‌టించారు. మ‌రి స‌మ‌స్య ఏమంటే ఇది హీరో క‌థ కాక‌పోవ‌డం. ఇంకెవ‌రి సంఘ‌ర్షణ‌లోకో హీరో దూరి ఒక ఊరిని సంస్క‌రించే దిశ‌గా వెళ్ల‌డం. పాయింట్‌బ్లాంక్‌లో క‌థ చెబుతున్నాన‌ని అనుకున్న ద‌ర్శ‌కుడు , అస‌లు త‌న చేతిలో తుపాకి లేద‌నే విష‌యం మ‌రిచిపోయాడు.

ప్రేక్ష‌కుడు శ‌ర‌వేగంగా మారుతున్న కాలంలో సింగిల్ లేయ‌ర్ క‌థ‌లు వ‌ర్కౌట్ కావు. ఈ విష‌యం వివేక్‌కి తెలుసు. అందుకే మ‌ల్టిఫుల్ లేయ‌ర్స్ వేసుకున్నాడు. హీరోకి మ‌ద‌ర్ సెంటిమెంట్‌, తండ్రి, అక్క‌తో ఎమోష‌న్‌. చిన్న‌ప్ప‌టి ప్రేమ‌, ఒక సెటిల్‌మెంట్ విలేజ్‌, విల‌న్‌కి అన్న‌తో సంఘ‌ర్ష‌ణ‌. అయితే ఉప క‌థ‌లు ఎన్ని వేసినా అవ‌న్నీ ఎక్క‌డ క‌ల‌పాలో స‌రిగ్గా తెలియాలి. చుక్క‌ల ముగ్గు ప్రాక్టీస్‌లాంటిది. ఉప నదులు న‌దిలో క‌లిస్తే మంచినీళ్లు. న‌దులు స‌ముద్రంలో క‌లిస్తే ఉప్పునీళ్లు. లేయ‌ర్స్ వేసుకున్న ర‌చ‌యిత వివేక్‌, త‌ల్లి క్యారెక్ట‌ర్‌ని త‌ప్ప ఇంకెవ‌ర్నీ స‌రిగ్గా రిజిస్ట‌ర్ చేయ‌డు. ముర‌ళిశ‌ర్మ ఎంత బాగా న‌టించినా అత‌నో మెంట‌ల్ అంతే. సాయికుమార్ ప్లాష్ బ్యాక్‌లు చెబుతూ ఫ‌స్టాఫ్ స‌గం తినేసి, మ‌న‌ల్ని వాట్స‌ప్ వైపు తీసుకెళ్తాడు.

ముర‌ళిశ‌ర్మ‌కి ఒక డైలాగ్ వుంటుంది. రాంగ్ జ‌డ్జిమెంట్ అంటూ వుంటాడు. హీరోలు క‌థ వినేట‌ప్పుడు ఇది గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే క‌థ‌లో తాము ఎలివేట్ అయితే చాల‌నుకుంటారు. మిగ‌తా గ్రాఫ్ చూసుకోరు. దారిన పోయే ప్ర‌తి విష‌యానికి గొడ‌వ‌ప‌డి, కోపం తెచ్చుకునే హీరోకి ఒక ల‌క్ష్యం అంటూ వుండ‌దు. అది లేక‌పోవ‌డం వ‌ల్లే అజ‌య్ ఘోష్ సుదీర్ఘ ఎపిసోడ్. క‌థ‌కి అద‌న‌పు ల‌గేజి.

శ‌నివారం మాత్ర‌మే కోపం తెచ్చుకునే హీరో, ఇది కొత్త పాయింట్‌లా అనిపించి వుంటుంది కానీ, కొత్త‌దేమీ కాదు. ఫాంట‌సీ, సైకో ఎనాల‌సిస్ ఆధారంగా ఇలాంటి పాయింట్లు చాలా వ‌చ్చాయి. పున్న‌మినాగులో పౌర్ణ‌మిరోజు పాములా మారే హీరో, ఫాంట‌సీ క‌థ‌.

స్టీవెన్‌స‌న్ రాసిన డాక్ట‌ర్ జ‌కిల్ అండ్ మిస్ట‌ర్ హైడ్ న‌వ‌ల‌లో ప‌గ‌లంతా మ‌ర్యాద‌స్తుడిగా వుండే జ‌కిల్‌, రాత్రికి కుటిల‌మైన హైడ్‌గా మారిపోతాడు. దీన్ని సోష‌లైజ్ చేస్తే మాన‌వుడు – దాన‌వుడు (శోభ‌న్‌బాబు).

లార్డ్ ఆఫ్ ది రింగ్స్‌లోని గొల్లుం క్యారెక్ట‌ర్‌కి ఇంకో లేయ‌ర్ వేస్తే అప‌రిచితుడు. మ‌ల్లాది న‌వ‌ల శ‌నివారం నాదిలో సైకో హ‌త్య‌లు శ‌నివార‌మే జ‌రుగుతాయి. ఒంట‌ర‌మ్మాయిలు క‌నిపిస్తే హ‌త్య‌లు చేసే సైతాన్ (శ‌త్రుఘ్న‌సిన్హా) ఇలా చాలా చెప్పొచ్చు. కొత్త పాయింట్ అనిపిస్తే క‌థ‌ని కూడా కొత్త‌గా చెప్పాలి. పాత‌గా చెప్పి కొత్త అని భ్ర‌మ ప‌డ‌కూడ‌దు.

సినిమాటిక్ లిబ‌ర్టీని మ‌నం త‌ర‌త‌రాలుగా గౌర‌విస్తున్నాం. ఎన్టీఆర్ పిల్లి గ‌డ్డం అతికించుకుని వ‌స్తే కొమ్ములు తిరిగి, తారు డ్ర‌మ్ముల మ‌ధ్య స్మ‌గ్లింగ్ చేసే విల‌నే గుర్తు ప‌ట్ట‌లేడు. ప్రేక్ష‌కుడు లాజిక్ ఎప్పుడు అడ‌గడంటే నువ్వు మ్యాజిక్ చేసిన‌ప్పుడు.

శ‌నివారంలో కూడా మ‌నం లాజిక్ జోలికి వెళ్ల‌కూడ‌దు. కార్పొరేట‌ర్ ఉన్నాడంటే ఆ ఊరు ఒక ప‌ట్ట‌ణం కింద లెక్క‌. మేయ‌ర్ ఉన్న ఊరికి ఎమ్మెల్యే, ఎంపీల‌తో పాటు ఎస్పీ స్థాయి అధికారి కూడా వుంటాడు. కానీ సీఐ ఇక్క‌డ రాజ్యం ఏలుతూ వుంటాడు. సెటిల్మెంట్‌ గ్రామం అరిగిపోయిన స‌బ్జెక్ట్‌. ర‌వితేజ తొంద‌ర‌ప‌డి టైగ‌ర్ అంటూ వ‌చ్చి మ్యావ్ అని సౌండ్ చేశాడు.

ప‌బ్‌కి వెళ్లిన ముర‌ళిశ‌ర్మ‌కి, అక్క‌డ సీసీ కెమెరాలు వుంటాయ‌ని తెలియ‌దు. మ‌హిళ‌ల‌కి ర‌క్ష‌ణ క‌ల్పించ‌డానికి లేడీ కానిస్టేబుల్‌గా చేరిన హీరోయిన్ మ‌రీ అమాయ‌కురాలు. కానిస్టేబుల్‌పైన చాలా హైరార్కి వుంటుంది. ఆశ‌యాలున్నాయ‌ని చెబితే జాయిన్ అయిన రోజే స‌స్పెండ్ చేస్తారు. చాలా మంది ద‌ర్శ‌కుల‌కి ఉప‌రిత‌లం త‌ప్ప‌, లోతు తెలియ‌దు. అన్నింటిని సినిమా లిబ‌ర్టీ పేరుతో వ‌దిలేయొచ్చు కానీ, ఎవ‌రి క‌థ చెబుతున్నాడో తెలియ‌కుండా మూడు గంట‌లు సినిమా తీసిన ద‌ర్శ‌కుడిని క్ష‌మించ‌లేం.

ఇది ఎవ‌రి క‌థ‌? త‌ల్లికి ఇచ్చిన మాట క‌థా? కొడుకు క్షేమం కోరే తండ్రి క‌థా? ప్ర‌తి అన్యాయానికి శ‌నివారం కోపం తెచ్చుకునే హీరో క‌థా? సెటిల్‌మెంట్ గ్రామం క‌థా? అది క‌న్ఫ్యూజ‌న్‌.

అన్యాయాన్ని స‌హించ‌లేని హీరో, ఎంత‌టి అన్యాయానికైనా తెగ‌బ‌డే విల‌న్‌. ఇద్ద‌రి మ‌ధ్య గీత గీస్తే అపుడు శ‌నివారం స‌రిపోయేది. అంద‌ర్నీ క‌ల‌గాపుల‌గం చేసి క‌బ‌డ్డీనో, ఖోఖో ఆట‌నో తెలియ‌కుండా చేశారు.

సినిమాకి ప్ల‌స్ పాయింట్స్ లేవా? అంటే ఉన్నాయి. అక్క‌డ‌క్క‌డ మంచి డైలాగ్‌లు ఉన్నాయి. కొన్ని సీన్స్‌లో ఎమోష‌న్ పండింది. సూర్య‌, నాని పోటీగా న‌టించారు. లేనిది ఏమిటి, అల్లిక , క‌థ‌నంలో వేగం.

అభిమానులు ఇష్ట‌ప‌డి చూడొచ్చు. కాని వాళ్లు కొంచెం క‌ష్ట‌ప‌డి చూడొచ్చు.

ఆరు ఫైటింగ్‌లు, 32 మంది గాలిలోకి లేస్తే అది యాక్ష‌న్ సినిమా అయిపోదు. ప్రేక్ష‌కుడు ఉలిక్కి ప‌డి, కుర్చీలో నిటారుగా కూచుని క‌ళ్లు పెద్ద‌వి చేసి సినిమా చూస్తే అది యాక్ష‌న్‌. లేదంటే నిర్మాత‌కి రియాక్ష‌న్‌.

స‌న్నివేశాలు క‌లిపితే సినిమా అయిపోదు. మూల‌సూత్రం వుండాలి. ఎన్ని అంద‌మైన పువ్వులున్నా, మాల క‌ట్టాలంటే దారం వుండాలి. ప‌క్క‌నే వున్న కృష్ణాన‌గ‌ర్‌లో దార‌పు కండె కొనుక్కోవ‌డం మ‌రిచిపోయిన ద‌ర్శ‌కులు, మ‌న‌ల్ని థియేట‌ర్‌లో బంధించి “జింతాక” ఆడుకుంటున్నారు.

స‌రిపోతుంద‌నుకుంటా!

జీఆర్ మ‌హ‌ర్షి

31 Replies to “ఎక్కువైన శ‌నివారం”

  1. చాలు ఆపేయ్ బాబోయ్ చాలు 😰 ఏముంది ఇందులో మూవీ ఎంత దరిద్రంగా ఉందొ తప్పు ఇంకేం లేదు 😰 Entertainment ఎక్కడ రా 🤣

      1. Naaku mutton nachhadu… But neeku nachhochhu… Nenu Mutton biriyani order petti Food daridram ga undi ani cheppadam G balupu avutundi Bro. “Taste” is perspective either Food/Movie in fact anything.. it is your way of dealing the stuff..

  2. ఈ సినిమా పరిస్థితి ఇలా ఉంటే ఎర్రి పుష్పం గాడి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో 🤭

  3. meeru adhi bagoledu idi ila teyachu ani antunaru kada then why dont you direct and movie as you know more than heros and director kada.comment petatam easy meeru teyandi mari alanti negative points ani remove chesi oka all world block boster ivandi .pan india mov ekadu pan world movie .

  4. meeru adhi bagoledu idi ila teyachu ani antunaru kada then why dont you direct and movie as you know more than heros and director kada.meeru teyandi mari alanti negative points ani remove chesi oka all world block boster ivandi .pan india mov ekadu pan world movie .

  5. why dont you direct and movie as you know more than heros and director kada.comment petatam easy meeru teyandi mari alanti negative points ani remove chesi oka all world block boster ivandi .pan india mov ekadu pan world movie .

  6. meeru adhi bagoledu idi ila teyachu ani antunaru kada .comment petatam easy meeru teyandi mari alanti negative points ani remove chesi oka all world block boster ivandi .pan india mov ekadu pan world movie .

  7. అదంతా ఒక ఫైర్ అండ్ లవ్లీ రా బాబూ.. నల్లని తెల్ల చేసే ప్రక్రియ…

  8. Orey reviewer nuvvu oka Pani cheyyi

    ilaa reviews ivvadam maanesi nuvve oka cinema thiyyi

    Nee cinema lo act cheyadaniki yevaru raaru kabatti, nuvve hero, vilian, comedy, music, direction, and main ga heroine ga kuda nuvve cheseyi. Mukhyam ga producer ni chusuko endukanye bakara cheyadaniki baagubtundi kada.

    Bayata andariki nachina cinema lo inni loop holes vethikaavante Mee intlo nee valla situations yela untaayo ardham avuthundi.

  9. మీరు ఒక కథ రాసి గ్రేట్ ఆంధ్ర నిర్మాత గా వుండి డైరెక్షన్ చెయ్యండి. మీ సినిమాకి మీరే రివ్యూ రాయవచ్చు.

  10. సినిమాని సినిమాలా చూస్తే బాగుంటుంది…. నీకు review కామెంట్ చెప్పడం రాదు…. ఏదో భాష తెలుసని చాట భారతం పిచ్చోడిలా రాసి పెట్టేస్తే నీలా ఎర్రోళ్ళు ఎవరూ లేరు…. ముందు ఇలా చెత్తగా కామెంట్స్ వదిలేసి నీ పని చూస్కో….

  11. ఒరేయ్ పిచ్చ నా కొడుక నీకు ఎవడురా లైసెన్స్ ఇచ్చిన యాదవ నీ జీవితంలో ఒక్కటైనా పాజిటివ్ గా రాశవ రా ఏం చూసావ్ రా నువ్వు ఈ మూవీ గురించి మాట్లాడటానికి నీ లాంటి యధవలంధారు జర్నలిజం లో ఉండటం వల్లే దేశం సంక నాకి పోయేది

  12. రేయ్ ఎవడురా నువ్వు కుక్క రాసేవి తప్పుడు రాతలు దానికి గ్రేట్ ఆంధ్ర అని యాదవ పేరు

Comments are closed.