పవన్ కళ్యాణ్ – అవకాశాన్ని వదిలేసుకున్న అల్పజీవి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అర్ధం కాని పదార్ధం పవన్ కళ్యాణ్. ఈయనెవడంటే జనసేన పార్టీ అధ్యక్షుడంటారు. ఆ పార్టీ సభ్యులెవరో, రేపు ఎన్నికలొస్తే నిలబడే క్యాండిడేట్స్ ఎవ్వరో ఒక్కరు కూడా జనానికి పరిచయం లేరు.  Advertisement…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అర్ధం కాని పదార్ధం పవన్ కళ్యాణ్. ఈయనెవడంటే జనసేన పార్టీ అధ్యక్షుడంటారు. ఆ పార్టీ సభ్యులెవరో, రేపు ఎన్నికలొస్తే నిలబడే క్యాండిడేట్స్ ఎవ్వరో ఒక్కరు కూడా జనానికి పరిచయం లేరు. 

జనసేన తరపున ఆయన తప్ప ఇంకెవ్వరూ మాట్లాడరు. నాదెళ్ల మనోహర్ ఆయన పక్కన ప్యాడింగ్ ఆర్టిష్టులా కనిపిస్తాడు తప్ప ఆయన వాగ్ధాటి, ఆలోచన సరళి జనానికి అస్సలు పరిచయం లేదు. 

తన కేడర్ ని బిల్డ్ చేసుకోకుండా, తన పార్టీపై ఒక బలమైన సదభిప్రాయాన్ని జనాల్లోకి పంపకుండా సమయం వృధా చేసిన పవన్ కళ్యాణ్ ఏపాటి నాయకుడో అర్ధం కాడు. 

ఇంతా చేసి జనసేన పార్టీ అంటే “కాపుల పార్టీ” అనే బ్రాండ్ తెచ్చుకుంది తప్ప సమాజంలో ఉన్న అన్నికులాల వాళ్లు ఓన్ చేసుకునే పార్టీలా లేనే లేదు. 

రాష్ట్ర జనాభాలో కాపులు, తెలగలు, బలిజలు, ఒంటరులు అంతా కలిపి ఎంతమందుంటారు? వాళ్లంతా ఒకే తాటిమీద ఉంటారా? ఉంటారనే అనుకుందాం. అంతా కలిసి మూకుమ్మడిగా జనసేనకే ఓట్లు గుద్దినా పవర్లోకి వచ్చేయడానికి ఆ ఓట్లు సరిపోతాయా? సరిపోవు గాక సరిపోవు. ఒక రాజకీయ పార్టీ అంటే అన్ని కులాలు ఓన్ చేసుకోవాలి. అలా కావడానికి భిన్న కోణాల్లో ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి. 

తెదేపా విషయాన్నే తీసుకుందాం. దానికి “కమ్మవాళ్ల పార్టీ” అని పేరు. అయినప్పటికీ పత్రికల్ని, టీవీల్ని పెట్టుకుని జనం మొత్తానికి కొన్ని దశాబ్దాలపాటు అదిగో అభివృద్ధి..ఇదిగో విజన్ 20-20… అంటూ రాతలు రాయించుకుని నిరంతరం పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకుంటూ..కొన్నాళ్లు పరిపాలన చేసి తనకంటూ చరిత్రలో కొన్ని పేజీలు రాసుకుంది. 

అలాగే వైకాపా. “రెడ్ల పార్టీ” అని ప్రతిపక్షాలు అన్నా, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, బీసీలు ఎక్కువగా ఓన్ చేసుకున్న పార్టీ ఇది. దానికి కారణం జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ప్రజల్లో తిరిగి సంపాదించుకున్న అభిమానమే. వైఎస్సార్ కొడుకనో, జైల్లో పెట్టబడ్డాడు అనే సింపతీ వల్లో అతనికి ఓట్లేసి గెలిపించలేదు. అదే జరిగుంటే 2014లోనే సీయం అయ్యుండేవాడు కదా! జనం తనని తమకి కావాల్సిన నాయకుడు అని ఎప్పుడైతే డిసైడయ్యారో అప్పుడే తాను సీయం ఆయ్యాడు. తన పదవిని కాపాడుకోవడానికి ప్రజల్ని, దైవాన్నే నమ్ముకుంటాడు తప్ప తన సొంత మీడియాని, అనుకూల మీడియాని కూడా ఏ మాత్రం పట్టించుకోడు. 

ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే…అయితే తెదేపా స్టైల్లో మీడియాని అడ్డం పెట్టుకుని జనంలోకి వెళ్లాలి.  లేదా వైకాపా పద్ధతిలో విస్తృతమైన పాదయాత్ర చేసి జనంలోకి వెళ్లి మమేకమవ్వాలి. 

అంతే తప్ప వారాహి వెహికల్ ఎక్కి స్పీచులిస్తే ఓట్లు రాలవు. పోనీ ఆ వాగ్ధాటిలో ఏమైనా బలముంటుందా అంటే..ఏమీ ఉండదు. 

ప్రభుత్వంపై దాడి తప్ప తన పార్టీ ఎజెండా ఏంటో చెప్పడు.  తన కేండిడేట్స్ ఎవ్వరో జనానికి తెలియదు. ఎన్నికలు దగ్గరపడుతున్నా అస్సలు ప్రిపరేషన్ లేదు. 

ఇన్నేళ్ల కాలంలో చంద్రబాబు నీడలో సుఖం మరిగిన అల్పజీవి ఈ పవన్ కళ్యాణ్. 

నిజమైన నాయకత్వలక్షణం ఒక్కసారి కూడా చూపించలేదు. 

బీజేపీ పంచన ఉంటాడా? లేక చంద్రబాబు పంచనే ఉంటాడా జనానికి తేలని పరిస్థితి. 

ఒకవేళ చంద్రబాబే కావాలనుకుంటే బీజేపీకి స్వస్తి చెప్పాలి కదా! 

రెండూ కావాలంటే కుదరట్లేదు కదా!

చంద్రబాబుకి ఊడిగం చేసి తాను బావుకున్నది ఏమిటి? బాబు అరెస్టు అయితే రోడ్డు మీద పొడుకుని నిరసన చెప్పాల్సినంత అవసరమేంటి? దీనివల్ల చంద్రబాబుకేమైనా ప్రయోజనముందా? 

అటు తన పార్టీకి గానీ, ఇటు చంద్రబాబు పార్టీకి కానీ ఏమాత్రం ఉపయోగపడకుండా ఏం సాధించినట్టు? ఒక పార్టీతో పొత్తంటే ఆ పార్టీ ఓటర్స్ చేత ఓట్లేయించడం కాదు. కొత్త ఓట్లు తీసుకురావాలి. ఇలా చంద్రబాబు కోసం రోడ్ల మీద పడి దొర్లితే కాపుల స్వాభిమానం ఏమవ్వాలి? ఆ ఆలోచన లేదా? 

పాపం జనసైనికులు, వీరమహిళలు అంటూ ఇంకా ఏవో ఆశలు పెట్టుకుని కాలక్షేపం చేస్తున్న యువత మీద జాలిపడడం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితి ఉందిప్పుడు. 

రోజులు మారాయి. జనామోదం కావాలంటే జనానికి చాలా దగ్గరవ్వాలి. కోర్ ఓటర్స్ ఎవరో తెలుసుకోవాలి. వాళ్ల కోసం జీవితాన్నే ధారపోసే నాయకుడిగా కనపడాలి. అలా చేస్తూ ఏళ్లు గడపాలి. అంతే తప్ప ఇదేదో మ్యూజికల్ చెయిర్ లాగ ఎప్పుడో అప్పుడు కూర్చునే అవకాశం వస్తుందిలే అనుకుంటే అంతకంటే వెర్రివాడు ఇంకొకడు ఉండడు. 

వైకాపా, తెదాపాలు పరస్పర యుద్ధం చేసుకుంటూ రాష్ట్రంలో ఒక యుద్ధ వాతావరణం అలముకుంది ఇప్పుడు. 

ఈ సమయంలో తనకంటూ బలమైన పార్టీ ఉండి, సమర్ధులైన కేడర్ ఉండి, క్లియర్ ఎజెండా ఉండి, అన్ని వర్గాల వాళ్లకి ఆశాభావంగా కనిపించే నాయకుడిగా కనపడి ఉంటే.. జనసేనకి ప్రస్తుత పరిస్థితి విపరీతంగా కలిసొచ్చేది. ఆ సువర్ణావకాశాన్ని పవన్ అలసత్వంతోటి, స్వల్పకాల వ్యక్తిగత ప్రయోజనాల కోసం జారవిడుచుకున్నాడు. ప్రస్తుతానికి మాత్రం అంతా శూన్యమే. 

ఒక పక్క తెదేపాలో చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతుంది. చంద్రబాబు జైల్లో ఉంటే బాలకృష్ణ ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్న తీరులో పార్టీ ఆఫీసులో దర్శనమిచ్చాడు. ఆ కాంఫరెన్స్ టేబుల్ చుట్టూ ఎవరు కూర్చున్నారో ఒక్కసారి గూగుల్ చేసి ఫొటొలో, వీడియోలో చూడండి. వాళ్లల్లో ఒక్కళ్లు కూడా ఎమ్మెల్యేగా గెలిచే స్కోపున్న వాళ్లు లేరు. ఒక్కళ్లకి కూడా జనంలో కరిష్మా లేదు. వీళ్లకి నాయకుడు ప్రస్తుతం దబిడిదిబిడి బాలకృష్ణ. 

మరోపక్క చంద్రబాబు స్థానాన్ని ఏ మాత్రం భర్తీ చేయగల ఇమేజ్ కాని, ఇంటిలిజెన్స్ కానీ లేని లోకేష్ మరొక నాయకుడు. 

ఎవరి మొహం చూసి ఆ పార్టీకి జనం ఓట్లేస్తారని నమ్ముతున్నారో ఆయన జైల్లో ఉన్నారు. 

ఈ సమయంలో పోనీ పవన్ కళ్యాణ్ తన పార్టీతో బలాన్ని చెకూర్చగలడా అంటే, రోడ్డు మీద పడుకోవడానికి తాను తప్ప తన పార్టీలో ఎవ్వరూ లేరు. అదెంత సిగ్గు చేటు! తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకి మద్దతుగా రోడ్డు మీద వెల్లకిలా పడుకుంటే ఒక్క జనసైనికుడు కానీ, వీరమహిళ కానీ ఆయనతో పాటు రొడ్డున పడలేదే? 

తనతో పాటూ కనీసం నాదెండ్ల మనోహరన్నా రోడ్డు మీదా దొర్లుంటే అది డ్రామా కాదని, నిజమైన పొత్తు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని నమ్మడానికి ఆస్కారముండేది. 

కొణిదెల నాగబాబు రోడ్డెక్కి అరిచినా పూర్తి స్థాయి మద్దతు అన్నట్టుగా ఉండేది. 

అఫ్కోర్స్ అప్పుడు కాపుల మనోభావాలు మంటకలిసినా కనీసం జనసేన పార్టీ పరంగా అందరూ చంద్రబాబు అరెస్టుని సీరియస్ గా తీసుకున్నారని అనిపించేది. జనసైనికులకి ఒక దిశానిర్దేశమయ్యుండేది. 

ఏదీ పూర్తిగా చేయకుండా అన్నీ సగం సగం చేయడం, మొక్కుబడి డ్రామాలాడడం తప్ప పవన్ వెలగబెడుతున్నది ఏదీ లేదు.  

రాజకీయాల్లోనే కాదు అతని వైఖరి సినిమాల్లో కూడా అంతే. 

ఏ సినిమా కూడా మొదలుపెట్టి పూర్తిగా కంప్లీట్ చేయడు. అన్ని సగం సగం పనులు. తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బు సంపాదించడం ఎలా? 

తక్కువ సమయం కేటాయిస్తూ రాజకీయాల్లో కనిపిస్తుండడం ఎలా? అక్కడెంత సంపాదన, ఇక్కెడంత సంపాదన! 

ఇదే తప్ప ఎక్కడా చిత్తశుద్ధి లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. 

రాజకీయాల్లో తన పార్టీ జెండా గౌరవాన్ని ఎగరేస్తూ తాను ముఖ్యమంత్రి అవ్వాలని అనుకోడు. ఆ దిశగా ప్రయత్నాలుండవు. సినిమా పరంగా ఒక అద్భుతమైన చిత్రంలో నటించి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలనుకోడు. 

అన్నీ షార్ట్ టెర్మ్ గోల్సే! అంతా మనీ మైండేడే! 

పవన్ ఎన్ని పుస్తాకాలు చదివాడో ఏమో కానీ, రాజకీయపరిజ్ఞానంలో మాత్రం నిరక్షరకుక్షి. సమయాన్ని వృధా చేసి తన పార్టీని బలోపేతం చేయకుండా, తనని నమ్ముకున్న వాళ్ల జీవిత కాలాన్ని కూడా కాలరాస్తున్న టైం పాస్ నాయకుడు. 

ఇతన్ని ప్రజలే కాదు, కాలం కూడా క్షమించదు. 

హరగోపాల్ సూరపనేని