పాపం! అప్పుడే కరివేపాకైపోయిన పవన్ కళ్యాణ్

నిన్నటివరకు “మా పవన్ బాబు” అన్నంత విధంగా ఒకానొక సమాజికవర్గానికి చెందిన తెదేపా సానుభూతిపరులు జనసేనానిని భుజాన మోసారు. నిజంగానే చంద్రబాబుకి దత్తపుత్రుడన్నంత రేంజులో అక్కున చేర్చుకున్నారు.  Advertisement ఎందుకంటే పొత్తుంటే తప్ప ఎన్నికల…

నిన్నటివరకు “మా పవన్ బాబు” అన్నంత విధంగా ఒకానొక సమాజికవర్గానికి చెందిన తెదేపా సానుభూతిపరులు జనసేనానిని భుజాన మోసారు. నిజంగానే చంద్రబాబుకి దత్తపుత్రుడన్నంత రేంజులో అక్కున చేర్చుకున్నారు. 

ఎందుకంటే పొత్తుంటే తప్ప ఎన్నికల పోరులోకి దిగలేని చంద్రబాబుకి అన్ని దారులు మూసుకుపోయాక ఇప్పుడు మిగిలిన ఏకైక తెప్ప పవన్ కళ్యాణ్. 

అయితే ఏరు దాటాక తెప్ప తగలేయడమనే సామెత మనందిరికీ తెలుసు. కానీ నీటి లోతు పెద్దగా లేదనిపించగానే తెప్పని తన్నేసే అతితెలివిపరులు మన తెదేపా తముళ్లు.

అప్పుడే సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ మీద జోకులు పేల్చేస్తున్నారు.

“మహానాడు” కి వచ్చిన స్పందనని చూసి పవన్ కల్యాణ్ అక్కర్లేదనుకుంటున్నారు. సింపుల్ గా చెప్పాలంటే మబ్బుని చూసి బిందెలో నీళ్లు ఒంపేసుకుంటున్నారు. 

ఒక పోస్ట్ చూడండి- “ఇక మనకి ఎవడి రోడ్ మ్యాప్ అవసరం లేదు. అవసరమైతే గ్లాసు గాడికి సైకిల్ రాడ్డు మీద చోటిద్దాం”. 

మరో పోస్ట్ ఇలా ఉంది- “మనం తొడ కొట్టేసాం. మెడ రుద్దుడు గాడు మనకక్కర్లేదింక”. 

వేరే పోస్టు- “హమ్మయ్య. ఇప్పటికైనా ఆ జాతితో పొత్తు లేకపోతే బాగుణ్ణు. మహానాడు దమ్ము చూసైనా మన నాయకుడు ఆ పొత్తుకు ఫుల్స్టాప్ పెడితే బెటరు” 

ఇదీ పరిస్థితి. ఇలాంటివి చాలా ఉన్నాయి. మొత్తంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తమకి ఉపయోగపడతాడనుకుంటే నెత్తిన పెట్టుకోవడం, లేకపోతే నిర్దాక్షిణ్యంగా పకకు నెట్టేయడం ఈ పార్టీ అధినేత నుంచి అతనిని ఫాలో అయ్యే సామాన్యుడి వరకు సంక్రమించిన బుద్ధి. ఇంతకంటే దిగజారుడుతనం ఉండదు. 

అయినా పవన్ కళ్యాణ్ ని అనాలి. నిజానికి ఇతనికి తెదేపా అవసరం లేదు. మరో దారి లేని తెదేపాకే పవన్ అవసరం ఉంది. ఇది తెలుసుకోకుండా చంద్రబాబుకి విధేయుడిగా పవన్ ప్రవర్తించడం ఒక్క కాపు ప్రజానీకానికే కాదు చాలామందికి మింగుడుపడలేదు…ఎవరు ఎవర్ని ఆడించాలి? ఎవరు ఎవర్ని ఆడిస్తున్నారు?

పవన్ కి కావాలంటే భాజపాతో పొత్తు కుదురుతుంది. చంద్రబాబుతో పెరటిగుమ్మం పరిచయముందని భాజపాకి అనుమానమొచ్చినా ఆ పొత్తుకొప్పుకోదు. 

కనుక తెదేపాతో తెగ తెంపులు చేసుకుని భాజపాని పూర్తిగా నమ్ముకోవడమే పవన్ కి బెటర్. లేకపోతే వాడుకుని వదిలేసే చరిత్ర ఉన్న పసుపు బ్యాచ్ కి టీ గ్లాసుని నేలకేసి కొట్టడం పెద్ద లెక్కేంకాదు. 

సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న తెలుగు తమ్ముళ్లకి రేపు ఈ “మహానాడు” హడావిదంతా బలుపు కాదు వాపే అని తెలిస్తే మళ్లీ పవన్ కళ్యాన్ ని సవరదీసుకుని అతని పల్లకి మోయడానికి సిద్ధమే. ఆ విషయంలో అస్సలు సిగ్గు పడరు. 

– హరగోపాల్ సూరపనేని