తెలుగువారి ఆత్మగౌరవం అంటే ఏమిటి? తెలుగువాడి కీర్తి అంటే ఏమిటి? తెలుగుదనం అంటే ఏమిటి? తెలుగు రాష్ట్రం అంటే ఏమిటి?
కొంతమంది దృష్టిలో స్వర్గీయ ఎన్.టి.ఆర్ ని పూజించడమే తెలుగు ఆత్మగౌరవం.
రాజమౌళి సినిమాల్లో కనిపించేదే తెలుగువాడి కీర్తి.
రాఘవేంద్రరావు సినిమాల్లో కనిపించేదే తెలుగుదనం.
తెలుగుదేశం ప్రభుత్వం నడిస్తేనే అది తెలుగు రాష్ట్రం.
బుద్ధిలేని ప్రబుద్ధుడొకడు ట్విట్టర్ వేదికగా ఆర్.ఆర్.ఆర్ ని విమర్శించడం తెలుగుజాతికి చేస్తున్న ద్రోహమన్నట్టుగా కూతలు కూసాడు.
ఆ ప్రబుద్ధుడే తన సొంత సినిమా హాల్లో “ఆర్ ఆర్ ఆర్” టికెట్లను అధిక రేట్లకి అమ్మి ప్రజల వీక్నెస్ ని దోచుకున్నాడు. బహుశా ఆ దోచుకోవడమేనేమో ఆత్మగౌరవమంటే.
పైగా ఒక పార్టీలో ఉన్నా మరొక పార్టీకి కోవర్టుగా పనిచేస్తూ కమ్మనైన ఆత్మగౌరవానికి ప్రతీకలాగ ఉంటాడీ కులబద్ధుడు.
ఇక్కడొక మాట. కమాల్ ఆర్ ఖాన్ అనే సమీక్షకుడు ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ ఎలుగుబంటుల్లా ఉంటారు, వాళ్లని పెట్టుకుని తెలుగులో సినిమా తీసుకుంటే తీసుకోవచ్చు కానీ హిందీ ప్రేక్షకులమీదికి ఎందుకు వదిలారంటూ రాజమౌళిని తిట్టిపోసాడు. ఇలాంటి సినిమా తీసినందుకు రాజమౌళిని ఆర్నెల్లు జైల్లో పెట్టాలని ట్వీట్ చేసాడు.
అతను అహంకారంతో వాగినా, వెటకారంతో విర్రవీగినా, పబ్లిసిటీ కోసం పేలినా అతడి మీద కూడా “లోడ్- ఎయిం- షూట్” అంటూ ఆర్ ఆర్ ఆర్ లో అజయ్ దేవగన్ లా ఫీలైపోతున్న ఈ ప్రబుద్ధుడు తెలుగు తమ్ముళ్లకు పిలుపునివ్వచ్చుకదా!
అబ్బే..ఆ పని చేయడు.
ఇలాంటి వాళ్ల అత్యుత్సాహం, ఆవేశం వల్లే ఒక వర్గం మిగిలిన తెలుగువారందరికీ శత్రువవుతోంది.
“ఎవ్వడో ఒక్కడంటే…మొత్తం వర్గానికి ఆపాదిస్తే ఎలా?” అని అడగొచ్చు. కానీ అదే ఇక్కడ దుస్థితి. ఆ వర్గంలో కొందరు అతిగా ఏది చేసినా అది మొత్తం కులానికి ఆపాదించే విధంగా తయారైంది పరిస్థితి.
ప్రతి వర్గంలోనూ అతిగాళ్లూ ఉంటారు, సహేతుకంగా ఆలోచించే వాళ్లూ ఉంటారు. కానీ ఏ ఇతర వర్గంలోనూ అతిగాళ్లున్నా కూడా వాళ్ల తీరు వల్ల ఆయా వర్గాలకు మరకంటడంలేదు. ఒక్క ఫలానా వర్గానికే ఆ స్పెషల్ స్టేటస్ దక్కింది. వీరిలో కొందరి “అతి” అంత అసహ్యం పుట్టేలా ఉంటుంది మరి. అందుకే ఆ వర్గానికి చెందిన పార్టీ కూడా ప్రజలకి దూరమవుతూ వస్తోంది.
కేవలం సినీ సమీక్ష తనకు నచ్చినట్టుగా లేనందుకే “కోడకల్లారా!” అని సంబోధించిన సంస్కారవంతుడీ ప్రబుద్ధుడు. ఎన్నో సినిమాలకి రివ్యూలు రాసినా ఎప్పుడూ ఈ కుసంస్కారి నుంచి ఇలాంటి స్పందన లేదు. తన వర్గం వాడు దర్శకుడనే సరికి అది తెలుగువాడి ఆత్మగౌరవమైపోయింది ఈ ప్రబుద్ధుడికి.
సినిమా జయాపజయాలకి, సమీక్షలకి ఎప్పుడూ సంబంధం ఉండదు. సినిమా ఆడడానికి, ఆడకపోవడానికి అనేక కారణాలుంటాయి. ఆడినంత మాత్రాన అది అపురూప చిత్రరాజమని కాదు. ఆడనంత మాత్రాన అది తీసి పారేసేదనీ కాదు.
సమీక్షనేది ఎన్నో అభిప్రాయాల్లాగ అదీ ఒక అభిప్రాయం మాత్రమేరా మిత్రమా!
సారీ.. నీ భాషలో చెప్తేనే నీకు నచ్చుతుందేమో..
కనుక “మిత్రమా!” తీసేసి “కొడకా!” పెట్టుకుని చదువుకో.