‘బోసడీకే’ పట్టాభి.. కేరాఫ్ రాజమండ్రి సెంట్రల్ జైలు

బోసడీకే పట్టాభి.. ఇది తిట్టుకాదు, ఆయన ఉపయోగించిన పదమే. టీడీపీ ఆమోదించిన పదజాలమే. కాబట్టి ఇలా పిలవడంలో తప్పులేదు. ఈ ఒక్క పిలుపుతో అరెస్ట్ అయిన పట్టాభి, ఇప్పుడు సెంట్రల్ జైలులో పడ్డారు. పోలీసులు…

బోసడీకే పట్టాభి.. ఇది తిట్టుకాదు, ఆయన ఉపయోగించిన పదమే. టీడీపీ ఆమోదించిన పదజాలమే. కాబట్టి ఇలా పిలవడంలో తప్పులేదు. ఈ ఒక్క పిలుపుతో అరెస్ట్ అయిన పట్టాభి, ఇప్పుడు సెంట్రల్ జైలులో పడ్డారు. పోలీసులు పట్టాభిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు పట్టాభి. బోసడీకే, అరె..తురె లాంటి పదాలు వాడి కించపరిచారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ముందుగా మచిలీపట్నం జైలులో ఉంచారు. 

ఎప్పుడైతే కోర్టు పోలీసుల వాదనతో ఏకీభవించి, రిమాండ్ విధించిందో ఆ వెంటనే మచిలీపట్నం సబ్ జైలు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు.

అలా టీడీపీ పార్టీ ఆఫీస్ లో దర్జాగా కూర్చోవాల్సిన పట్టాభి, ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. నవంబర్ 2వ తేదీ వరకు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఊచలు లెక్కబెడుతూ కూర్చోవాల్సిందే.

మరోవైపు పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఖండించాల్సింది పోయి, తదనంతరం జరిగిన పార్టీ ఆఫీస్ పై దాడి ఘటనను టీడీపీ హైలెట్ చేసుకుంది. ఈ మేరకు 36 గంటల దీక్షకు దిగిపోయారు చంద్రబాబు. ఈరోజు రాత్రి 8 గంటలతో ఈ దీక్ష ముగుస్తుంది.