కె ఏ పాల్. ప్రజా శాంతి ప్రెసిడెంట్ గా 2019 ఎన్నికల్లో హల్ చల్ బాగా చేశారు. అప్పట్లో ఆయన వైసీపీకి పడాల్సిన ఒక వర్గం మైనారిటీ ఓట్లను లాగడానికి ట్రై చేశారని ప్రచారం అయితే గట్టిగానే సాగింది. ఇక పాల్ ని కొందరు రాజకీయ పెద్దలు నాడు తెర వెనక నుంచి నడిపించారు అని ఆరోపణలు వచ్చాయి.
సరే పాల్ పోటీ చేశారు అన్న ఆనందంతోనే ఆ ఎన్నికలు ముగిసాయి. సడెన్ గా రెండేళ్ల తరువాత పాల్ విశాఖ వేదికగా మళ్లీ హడావుడి చేస్తున్నారు. నిజానికి పాల్ ది విశాఖ జిల్లా భీమిలీ నియోజకవర్గమే. ఆయన పుట్టింది పెరిగింది కూడా ఇక్కడే. అయితే పాల్ అంతర్జాతీయ ప్రముఖుడిగానే ఉంటూ వచ్చారు. ఆయన మత బోధకుడిగానే అందరికీ తెలుసు. అలాంటి పాల్ టెన్త్ ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలంటి విశాఖలో కొన్ని రోజులుగా దీక్షలు చేస్తున్నారు.
మరి అదే డిమాండ్ తో టీడీపీ జనసేన కూడా ఉన్నాయి. అయితే పాల్ దీక్షలు చేస్తున్నా కూడా విపక్షాల నుంచి ఆయనకు మద్దతు లభించకపోవడమే విడ్డూరం. మరి పాల్ ని 2019 ఎన్నికల వేల కొన్ని పార్టీలు సపోర్ట్ చేసి భుజాలకెత్తుకున్నాయి.
ఇపుడు ఆ అభిమానం ఏమైంది అన్న మాట అయితే ఉంది. ఏది ఏమైనా పాల్ ఒంటరి పోరాటమే చేస్తున్నారు. ఆయన చాలా మంది విపక్షాల కంటే నయంగా ఈ విషయంలో ఉన్నారు అన్న మాట కూడా ఉంది. అందరూ పేపర్ టైగర్లు అయిన వేళ పాల్ డేరింగ్ గా తాను అనుకున్న దాని కోసం పోరాటం చేయడం విశేషమే.
మొత్తానికి మాకు అన్ని ఓట్లు వచ్చాయి, సీట్లు వచ్చాయి అని చెప్పుకునే పార్టీల కన్నా పాల్ బాగానే స్పందిస్తున్నారు అనుకోవాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద కూడా ఆయన హై కోర్టులో కేసు వేశారు. ఇపుడు కూడా కరోనా విషయంలో పూర్తి వైఫల్యం కేంద్రానిదే అని గట్టిగా విమర్శిస్తున్నారు.
మరి ఇన్నేళ్ళ పొలిటికల్ ఇండస్ట్రీ అన్నేళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే పెద్ద పార్టీలు కూడా మోడీని ఒక్క మాట కూడా అనలేని స్థితిలో పాల్ బెటరే కదా అంటున్న వారూ ఉన్నారు.