జనసేనాని పవన్‌కల్యాణ్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా సున్నితంగా నిలదీశాడు. దాంతో పవన్ కూడా కాస్తా సర్దుకోవాల్సి వచ్చింది. ఇంతకూ ఇదంతా ఏమిటి? ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? పదండి కథనంలోకి…
తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు, ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్, జనసేనాని పవన్ మధ్య ట్విటర్‌లో ఆసక్తికర సంభాషణ (చాటింగ్) సాగింది. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు పవన్‌కల్యాణ్ తనవంతు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చి ఆదర్శంగా నిలిచాడు. కేంద్ర, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన అండగా నిలిచాడు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక్కో రాష్ట్రానికి రూ.50 లక్షలు చొప్పున రూ.కోటి. అలాగే కేంద్రప్రభుత్వానికి రూ.కోటి వంతున పవన్ విరాళం అందజేశాడు. ఈ విషయాన్ని పవన్ ట్విటర్ వేదికగా తెలిపాడు.
తన రాష్ట్రానికి మద్దతుగా నిలిచిన పవన్‌కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపేందుకు ముందుకు వచ్చాడు. కేటీఆర్ స్పందిస్తూ.. ‘గొప్ప సందేశమిచ్చారు.. అన్నా’ అని రిప్లయ్ ఇచ్చాడు. కేటీఆర్ స్పందనపై పవన్ మళ్లీ రియాక్ట్ అయ్యాడు.
‘ధన్యవాదాలు సార్.. ఇలాంటి అల్లకల్లోల సమయాల్లో శ్రీ కె.సి.ఆర్ గారి నాయకత్వంలో, ప్రశంసనీయంగా నడుచుకుంటున్న మీ తీరుకు హృదయపూర్వక అభినందనలు. ఆదర్శంగా నిలుస్తున్నారు’ అని పవన్ మరో ట్వీట్ చేసి తన సంస్కారాన్ని చాటుకున్నాడు.
పవన్ ట్వీట్‌పై కేసీఆర్ మళ్లీ రియాక్ట్ అయ్యాడు. ‘ధన్యవాదాలు అన్నా.. ఎప్పటి నుంచి ఇలా సార్ అని పిలవడం మొదలెట్టారు? దయచేసి ఎప్పటిలాగే బ్రదర్ అని పిలవండి’ అని అభిమానంతో పవన్‌ను నిలదీశాడు. అయితే ఇది వాళ్లిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని తెలియజేస్తోంది.
దీనికి పవన్ కూడా అదేస్థాయిలో రెస్పాండ్ అయ్యాడు. ‘అలాగే బ్రదర్’ అని ట్విటర్‌లో రిప్లయ్ తన ఔన్నత్యాన్ని చాటుకున్నాడు. ఇదన్న మాట పవన్, కేటీఆర్ మధ్య సాగిన ట్విటర్ సంభాషణ.