పవన్ ఆశలు వదిలేసుకున్నట్లేనా?

పవన్ కళ్యాణ్ మూడు రాజధానులు వద్దు అంటున్నారు. అమరావతి ముద్దు అంటున్నారు. నిజానికి జనసేనకు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు, ఉత్తరాంధ్రాలో పట్టుంది. ప్రజారాజ్యం పెట్టినపుడు కూడా విశాఖలో మూడు సీట్లు చిరంజీవి ఇక్కడ…

పవన్ కళ్యాణ్ మూడు రాజధానులు వద్దు అంటున్నారు. అమరావతి ముద్దు అంటున్నారు. నిజానికి జనసేనకు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు, ఉత్తరాంధ్రాలో పట్టుంది. ప్రజారాజ్యం పెట్టినపుడు కూడా విశాఖలో మూడు సీట్లు చిరంజీవి ఇక్కడ నుంచే గెలుచుకున్నారు.

ఇక గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కూడా విశాఖ ఎంపీ సీట్లో గట్టి పోటీ ఇచ్చింది జనసేన. అలాగే గాజువాకలో పవన్ కి బాగానే ఓట్లు పడ్డాయి. అదే విధంగా బలమైన నాయకుడు ఉన్న ఎలమంచిలిలో కూడా జనసేన కొంత ప్రభావం చూపించింది.

ఇవన్నీ ఇలా ఉంటే ఎన్నికల  ఫలితాలు వచ్చిన తరువాత నెలల్లో  పవన్ విశాఖ లాంగ్ మార్చ్ నిర్వహిస్తే బాగానే జన సైనికులు హాజరయ్యారు. అటువంటిది విశాఖలో పార్టీని బలోపేతం కోసం జనసేనాని చర్యలు తీసుకోవడం మాట అటుంచి విశాఖ రాజధాని వద్దు అంటూ టీడీపీతో పాటు గొంతు జత చేసి పవన్  నినదించడం వల్ల పార్టీ ఇబ్బందుల్లో పడుతోందని జనసైనికులు అంటున్నారు.

విశాఖను రాజధాని చేస్తామని వైసీపీ అంటోంది. వద్దు అని టీడీపీ అంటోంది. దాని వల్ల టీడీపీకి వైజాగ్ లో రెడ్ సిగ్నల్స్ పడుతున్నాయి. జనసేన ఈ నేపధ్యంలో తటస్థంగా ఉన్నా ఫర్వాలేదు కానీ అచ్చం టీడీపీ మాదిరిగా గొంతు చించుకుని అమరావతి ముద్దు అంటే మాత్రం విశాఖ కచ్చితంగా వద్దు అనే అంటుంది.

జనసేన అటు అధికారంలో లేదు, ఇటు ప్రధాన విపక్షంగా కూడా లేదు. దాని వల్ల  పొలిటికల్ గా  ఎంతో వెసులుబాటు ఉంది. ఆచీ తూచీ ప్రకటించాల్సిన సున్నితమైన అంశాలలో పవన్ తొందరపడి భారీ స్టేట్మెంట్స్ ఇచ్చేయడం వల్ల కాస్తో కూస్తో పట్టున్న ఉత్తరాంధ్రాలో రాజకీయంగా అతి పెద్ద దెబ్బ పడుతుంది అంటున్నారు విశ్లేషకులు.  మరి పవన్ ఈ సంగతి ఆలోచిస్తున్నారో లేదోనని జనసైనికులే సందేహించాల్సిన పరిస్థితి ఉందిపుడు.

పవన్ కళ్యాణ్ మనిషే అదో టైప్