చిరంజీవిని భలేగా ఇరికించిన పవన్

కావాలని మాట్లాడాడో లేక, ఫ్లోలో అలా మాట్లాడుకుంటూ వెళ్లాడో కానీ.. పవన్ కల్యాణ్ విశాఖ  జనసైనికుల సమావేశంలో చాలా విషయాలు చెప్పుకుంటూ వెళ్లారు. అందులో ఆత్మస్తుతి పరనిందే ఎక్కువగా కనిపించింది. Advertisement నేను తల్చుకుంటే..…

కావాలని మాట్లాడాడో లేక, ఫ్లోలో అలా మాట్లాడుకుంటూ వెళ్లాడో కానీ.. పవన్ కల్యాణ్ విశాఖ  జనసైనికుల సమావేశంలో చాలా విషయాలు చెప్పుకుంటూ వెళ్లారు. అందులో ఆత్మస్తుతి పరనిందే ఎక్కువగా కనిపించింది.

నేను తల్చుకుంటే.. అంటూ మొదలు పెట్టి నా అంతటి వారు లేరంటూ ఊదరగొట్టారు. సినిమాల్లో ఉండి కూడా సైడ్ ఇన్ కమ్ ని తాను ఎందుకు వద్దనుకుందీ వివరించారు. ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చి తాను కష్టపడుతున్నానని, నానా మాటలు పడుతున్నానని అన్నారు.

అదే తాను సినిమాల్లో ఉండి చంద్రబాబు గారూ నమస్తే, జగన్ గారూ నమస్తే అంటూ రాజకీయ నాయకులతో రాసుకుపూసుకు తిరిగితే ఇలాంటి అవస్థే ఉండేది కాదని, తన సినిమాలకు కూడా మేలు జరిగేదని, కలెక్షన్లు పెంచుకునే ఉపాయం అదేనని చెప్పారు.

అధికారంలో ఉన్న నాయకుల్ని సినిమావాళ్లు ఎందుకు కలుస్తారనే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు పవన్. అంతా బాగానే ఉంది కానీ, ఈ విషయాన్ని ప్రస్తావించడంతో, తన అన్నయ్య చిరంజీవిపైనే పవన్ సెటైర్లు వేసినట్టయింది.

సొంత లాభం కోసమే సినీ హీరోలు రాజకీయ నాయకుల్ని కలిస్తే.. ఇటీవల జరిగిన జగన్-చిరంజీవి భేటీని ఏమనుకోవాలి. కచ్చితంగా ఇది కూడా అలాంటిదే.

సైరా నరసింహారెడ్డికి ఫేవర్ చేయాలని అడగడం కోసమే చిరు సీఎం జగన్ ని కలిశారు. అయితే ఈ మీటింగ్ ని వేలెత్తి చూపించడానికి ఇటు ఇండస్ట్రీ నుంచి కానీ, అటు రాజకీయ వర్గాల నుంచి కానీ ఎవరూ ధైర్యం చేయలేదు.

కానీ పవన్ మాత్రం పరోక్షంగా తన గొప్ప చెప్పుకోడానికి అన్నయ్య ఇమేజ్ ని డామేజ్ చేశారు. వంగి వంగి సలాంలు కొట్టేవారికి సినీ ఇండస్ట్రీ బాగానే ఉంటుందని, కానీ తానొక్కడినే నీతిమంతుడ్ని కాబట్టి సినిమాలు వదిలేసి ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానంటూ చెప్పుకొచ్చారు పవన్. అలా అనుకోకుండా చిరంజీవిని ఇరికించేశారు.

తన సినిమా కలెక్షన్ల కోసమే చిరంజీవి, సీఎం జగన్ ను కలిశారని బయటపెట్టాడు పవన్.